Horia Tecau
-
రన్నరప్ బోపన్న జంట
మాడ్రిడ్: డిఫెండింగ్ చాంపియన్స్ రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న-మెర్జియా జంట 4-6, 6-7 (5/7)తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఎనిమిది ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న జోడీకి 1,38,400 యూరోల (రూ. కోటీ 5 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సానియా మీర్జా ఆశలపై నీళ్లు
మెల్బోర్న్: మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న భారత స్టార్ సానియా మీర్జా కల నెరవేరలేదు. ఆస్ట్రేలియా ఓపెన్ రెండో టైటిల్ నెగ్గాలన్న ఆమె కోరిక తీరలేదు. ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన తుదిపోరులో సానియా మీర్జా-హొరియా టెకావ్ (రుమేనియా) జోడి పరాజయం పాలయింది. క్రిస్టియానా మ్లాడినోవిక్(ఫ్రెంచ్)-డానియన్ నెస్టర్(కెనడా) జోడి చేతిలో 3-6 2-6తో ఓడిపోయింది. 58 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా-టెకావ్ జంట కనీస పోరాట పటిమ కూడా కనబరచలేకపోయింది. ప్రత్యర్థుల ముందు తేలిగ్గా తలవంచింది. -
'డబుల్స్' టైటిల్ పోరులో సానియా
-
'డబుల్స్' టైటిల్ పోరులో సానియా
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-హోరియా టెకాయు (రుమేనియా) జోడి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియన్ జోడి జార్మిళ గాజ్డొసోవా-మాథ్యూ ఎబ్డెన్పై 2-6, 6-3,10-8తో గెలుపొందింది. గంటా 13 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో మొదటి సెట్ ఓడిపోయిన సానియా-టెకాయు జోడి తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది. ఈ టైటిల్ గెలిస్తే ఆమెకు రెండో టైటిల్ అవుతుంది. మహేష్ భూపతితో కలిసి 2009లో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచింది. -
ప్రత్యేక కారణాలు లేవు
న్యూఢిల్లీ: భారత ఆటగాళ్లతో కలిసి ఆడకపోవడం వెనుక ప్రత్యేకమైన కారణాలేమీ లేవని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేసింది. గతంలో కలిసి ఆడినా ప్రస్తుతం కుదరడం లేదని చెప్పింది. అయితే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్‌లో హోరియా టెకావ్ (రొమేనియా) తోనే కలిసి బరిలోకి దిగుతానని వెల్లడించింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం తమ జోడి ఈ టోర్నీ వరకు కొనసాగుతుందని తెలిపింది. ‘టెకావ్ ప్రపంచస్థాయి డబుల్స్ ప్లేయర్. బ్యాక్‌హాండ్, భారీ సర్వీస్‌లు చేయగల సమర్థుడు. మూడు టోర్నీల్లో కలిసి ఆడాలని మేం ముందుగానే అనుకున్నాం. కాబట్టి ఆస్ట్రేలియా ఓపెన్ వరకు మా జోడి కొనసాగుతుంది. మిగతా అంశాలను తర్వాత నిర్ణయించుకుంటాం. క్లే కోర్టుల్లో టెకావ్ మంచి ఆటగాడే అయినా ఫ్రెంచ్ ఓపెన్ గురించి ఇప్పుడే చెప్పలేను’ అని సానియా వ్యాఖ్యానించింది.