
'డబుల్స్' టైటిల్ పోరులో సానియా
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-హోరియా టెకాయు (రుమేనియా) జోడి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియన్ జోడి జార్మిళ గాజ్డొసోవా-మాథ్యూ ఎబ్డెన్పై 2-6, 6-3,10-8తో గెలుపొందింది. గంటా 13 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో మొదటి సెట్ ఓడిపోయిన సానియా-టెకాయు జోడి తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది.
ఈ టైటిల్ గెలిస్తే ఆమెకు రెండో టైటిల్ అవుతుంది. మహేష్ భూపతితో కలిసి 2009లో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచింది.