మేట్రిన్ అవకతవకలపై ఐటీడీఏ పీఓ విచారణ
మనుబోలు : మనుబోలు ఎస్సీ బాలుర వసతి గృహంలో గతంలో మేట్రిన్‌గా పనిచేసి అవకతవకలకు పాల్పడి సస్పెండ్ అయిన మాధవిపై ఐటీడీఏ పీఓ కమలకుమారి శనివారం విచారణ చేపట్టారు. సుమారు సంవత్సరం క్రితం ఎస్సీ బాలుర వసతి గృహంలో మేట్రిన్‌గా పనిచేసిన మాధవి పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అప్పటి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవి సమక్షంలోనే విచారణ చేపట్టిన కమలకుమారి హాస్టల్‌కు చేరుకుని పాత రికార్డులు పరిశీలించారు. విద్యార్థులను, సిబ్బందిని ఆరా తీశారు. మాధవి పని తీరుపై నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. ఆమె వెంట ఐటీడీఏ సూపరింటెండెంట్ దిలీప్‌కుమార్, నవీన్‌కుమార్, ఏఎస్డబ్ల్యూఓ ప్రభుదాస్, ప్రస్తుతం హాస్టల్ వార్డన్ పద్మనాభరెడ్డి ఉన్నారు.