hotel owner
-
అమెరికాలో మరో భారతీయుడి హత్య
వాషింగ్టన్: అమెరికాలో భారతీయుల వరస మరణాలు అక్కడి భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. కాలిఫోరి్నయా రాష్ట్రంలో కేరళ కుటుంబం మొత్తం సొంతింట్లో మరణించిన వార్త మరువకముందే మరో హత్యోదంతం అమెరికాలో వెలుగుచూసింది. అలబామా రాష్ట్రంలో రహదారి వెంట హోటల్‌ను నడుపుకుంటున్న 76 ఏళ్ల ప్రవీణ్ రావూజీభాయ్ పటేల్‌ను అద్దె గది కోసం వచి్చన ఒక కస్టమర్ కాల్చి చంపారు. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జరిగిన ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలను షెఫీల్డ్ పట్టణ పోలీస్ ఉన్నతాధికారి రిక్కీ టెర్రీ గురువారం వెల్లడించారు. షెఫీల్డ్ పట్టణంలో హిల్‌క్రెస్ట్ మోటెల్ పేరుతో ఒక హోటల్‌ను ప్రవీణ్ సొంతంగా నిర్వహిస్తున్నారు. ఆ హోటల్‌కు 35 ఏళ్ల విలియం జెరిమీ మోరే అనే వ్యక్తి వచ్చి రూమ్ కావాలని ప్రవీణ్‌ను అడిగాడు. కొద్దిసేపటికే విలియం, ప్రవీణ్ మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. వెంటనే విలియం తన వద్ద ఉన్న గన్‌తో ప్రవీణ్‌ను కాలి్చచంపాడు. అక్కడి నుంచి పారిపోయి దగ్గర్లోని ఇంట్లో చొరబడేందుకు ప్రయతి్నస్తుండగా పోలీసులు అరెస్ట్‌చేశారు. మూడు సార్లు తుపాకీ శబ్దం విన్నానని అక్కడే ఉన్న ఒక సాక్షి చెప్పారు. అసలు కారణాలను పోలీసులు వెల్లడించలేదు. -
ప్రియురాలినే ఎరగా వేసి.. ప్రతీకార హత్య!
క్రైమ్: ఆ ఇద్దరికీ పాత గొడవలు ఉన్నాయి. అది మనసు పెట్టుకుని ఎలాగైనా చంపాలని ప్లాన్ చేశాడు శిబిల్. అందుకు తన ప్రియురాలినే ఎరగా ఉపయోగించాడు. హనీట్రాప్ ద్వారా ప్రత్యర్థిని రప్పించి.. అత్యంత కిరాతకంగా హతమార్చాడు. కేరళలో సంచలనం సృష్టించిన రంజిపాలెం మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. శుక్రవారం అట్టప్పడి వద్ద అనుమానాస్పద రీతిలో పడి ఉన్న రెండు ట్రాలీ బ్యాగ్‌లు పోలీసుల దృష్టికి వచ్చాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా.. మనిషి శరీరం ముక్కలు కనిపించాయి. దీంతో ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదే సమయంలో.. త్రిస్సూర్ చెరుతుర్తి వద్ద ఓ హోండా సిటీ కారును వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ కారుకు.. అటవీ ప్రాంతంలో దొరికిన ట్రాలీ బ్యాగులకు ఏదైనా కనెక్షన్ ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు.. ఆ కేసు ప్రతీకార హత్యగా తేలుస్తూ చిక్కుముడిని విప్పారు. మల్లప్పురం తిరూర్‌కు చెందిన సిద్ధిఖ్(58) ఐదేళ్ల కిందట గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చాడు. రంజిపాలెంలో ఓ హోటల్ నడుపుతూ స్థిరపడ్డాడు. అందులో శిబిల్(22) మేనేజర్‌గా పని చేసేవాడు. అయితే తన హోటల్ పేరుతో శిబిల్ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడనే విషయం సిద్ధిఖ్ దృష్టికి వచ్చింది. దీంతో.. అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాడు సిద్ధిఖ్. ఈ పరిణామంతో శిబిల్ కోపంతో రగిలిపోయాడు. మరో స్నేహితుడితో కలిసి సిద్ధిఖ్ అంతుచూడాలని అనుకున్నాడు. అందుకు తన ప్రియురాలు ఫర్హానా(18)ను సాయం చేయమని కోరాడు. ఫర్హానా సిద్ధిఖ్‌తో ఫోన్ ద్వారా పరిచయం పెంచుకుంది. చివరకు.. శారీరక సుఖం అందిస్తానని, ఎర్హనిపాలెంలోని ఓ హోటల్‌కు రావాలంటూ కబురు పంపింది. మే 18వ తేదీన హోటల్ వద్దకు సిద్ధిఖ్ చేరుకున్నాడు. గదిలోకి వెళ్లిన అతన్ని.. శిబిల్, ఫర్హానా కలిసి హతమార్చారు. చంపేశాక ఆ బాడీని ముక్కలు ముక్కలు చేసి.. రెండు ట్రాలీ బ్యాగుల్లో కుక్కేసింది ఆ ప్రేమ జంట. ఆపై మరో స్నేహితుడి సాయంతో ఆ ట్రాలీ బ్యాగులను సిద్ధిఖ్ కారులోనే తీసుకెళ్లి అట్టప్పడి వద్ద పడేసి వెళ్లిపోయారు. తండ్రి కనిపించకుండా పోవడంతో.. విదేశాల నుంచి తిరిగొచ్చాడు కొడుకు. నాలుగు రోజుల తర్వాత అంటే మే 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. రెండు రోజులకే సిద్ధిఖీ అకౌంట్ నుంచి ఏటీఎం కార్డు ద్వారా భారీగా నగదు విత్‌డ్రా అయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈలోపు ట్రాలీ బ్యాగులో మృతదేహం బయటపడడం.. అది సిద్ధిఖీదేనని పోలీసులు నిర్ధారించుకోవడం జరిగిపోయాయి. డబ్బు విత్‌డ్రా అయిన ప్రాంతం గురించి పోలీసులు ఎంక్వైయిరీ చేయగా.. చెన్నై నుంచి ఆ డబ్బు విత్ డ్రా అయినట్లు తేలింది. దీంతో చెన్నై పోలీసుల సాయం కోరగా.. వాళ్లు శిబిల్, ఫర్హానాను అదుపులోకి తీసుకుని కేరళ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు అషిఖ్‌ను సైతం కస్టడీలోకి తీసుకున్నారు. -
యువకుల వీరంగం.. కబాబ్‌లో చికెన్ ముక్క తక్కువొచ్చిందని!
సాక్షి, బెంగళూరు: చికెన్ కబాబ్‌లో ఒక ముక్క తక్కువ వచ్చిందని హోటల్ యాజమానిపై ఇష్టం వచ్చిన్నట్లు దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన బెంగళూరులోని కోణనకుంట పోలీసుస్టేషన్లో జరిగింది. బాబు అనే వ్యక్తి ఈశ్వరలేఔట్‌లో హోటల్ నడుపుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి అదే ప్రాంతానికి చెందిన అభి, మని అనే ఇద్దరు యువకులు రూ.120 చెల్లించి ఒక ప్లేట్ చికన్ కబాబ్ పార్శిల్ తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లి పార్శిల్ తెరిచి చూడగా అక్కడ 9 కబాబ్ పీస్‌లు మాత్రమే ఉన్నాయి. అయితే ఒక ప్లేట్‌కు 10 ముక్కలు ఇస్తారు. దీంతో 9 ముక్కలు మాత్రమే ఉన్నాయంటూ గురువారం ఉదయం హోటల్ వద్దకు వెళ్లి యజమానితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి గొడవ పెద్దదవడంతో.. బాబుపై ఇద్దరూ దాడికి దిగారు. యమజాని ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రగాయాలైన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అభి, మనులను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: హోటల్లో నాగుపాము హల్చల్.. భయంతో కస్టమర్ల పరుగులు -
ఢిల్లీ యువతి ఘటన.. హోటల్ ఓనర్‌పై మహిళా కమిషన్ సీరియస్..
న్యూఢిల్లీ: ఢిల్లీలో యువతిని కారుతో ఈడ్చికెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జనవరి 31 అర్ధరాత్రి దాటిన తర్వాత న్యూ ఇయర్ రోజున ఈఘటన జరిగింది. అయితే అంతకుముందు ఏం జరిగిందో ఓ హోటల్ యజమాని వివరించాడు. ఈ ఘటనలో చనిపోయిన యువతి(అంజలి) తన స్నేహితురాలు(నిధి)తో కలిసి హోటల్‌కు వచ్చిందని పేర్కొన్నాడు. ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని, ఒకరితో ఒకరు గొడవపడి హోటల్లో రచ్చ చేశారని చెప్పాడు. ఇది చూసి ఇద్దరినీ బయటకు గెంటేసినట్లు వెల్లడించాడు. హోటల్ ఓనర్ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ సీరియస్ అయ్యారు. బాధితురాలిపై నిందలు మోపడం సరికాదన్నారు. అర్ధరాత్రి సమయంలో అమ్మాయిలను బయటకు ఎలా గెంటేస్తారని ప్రశ్నించారు. ఇద్దరు యువతులు మద్యం మత్తులో ఉన్నారనేందుకు ఆధారాలేంటని? అడిగారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువతులను హోటల్ నుంచి గెంటేయడం కంటే.. పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందని స్వాతి అన్నారు. అలా చేసి ఉంటే యువతి చనిపోయి ఉండేది కాదన్నారు. హోటల్ నుంచి వాళ్లను బయటకు పంపడం వల్లే ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయిందన్నారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. सुबह से होटल मालिक के घटिया बयान TV पे दिखाए जा रहे हैं, वो कह रहा है लड़कियों ने शराब पी थी, झगड़ा कर रही थीं और मैंने उन्हें बाहर निकाल दिया। अगर लड़कियाँ नशा करके झगड़ा कर रही तो पुलिस बुलाते, देर रात में उन्हें होटल से क्यूँ निकाला? नशे का क्या सबूत है? STOP VICTIM SHAMING! — Swati Maliwal (@SwatiJaiHind) January 3, 2023 జనవరి 1న ఉదయం 1:30 గంటల సమయంలో ఇద్దరు యువతులు హోటల్ నుంచి బయటకు వచ్చినట్లు సీసీటీవీ రికార్డులో ఉంది. ఆ తర్వాత కాసేపటికే ఆ యువతి స్కూటీని కారు ఢీకొట్టింది. చక్రాల మధ్య ఇరుక్కున్న ఆమెను గుర్తించకుండా మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు కారును కిలోమీటర్ల మేర తిప్పారు. దీంతో యువతి చనిపోయింది. తెల్లవారుజామున ఆమె మృతదేహం నగ్నంగా రోడ్డుపై కన్పించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత.. -
కుక్కను పులిలా తయారు చేసిన యజమాని
-
పెట్టింది తిను.. డబ్బులిచ్చిపో..
అన్నవరం (తూర్పుగోదావరి జిల్లా) : పెట్టింది తిని, మారు మాట్లాడకుండా డబ్బులిచ్చి పోవాల్సిందే మరి ఆ హోటల్‌కి వెళ్తే! ఆ హోటల్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయానికి సమీపంలో ఉంది. శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 20మంది భక్తులు అన్నవరం వెళ్లారు. ఈ క్రమంలోనే ఆలయానికి సమీపంలోని ఒక హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లారు. అయితే భోజనం సరిగా లేకపోవడంతో భక్తులు సదరు హోటల్ యజమానిని నిలదీశారు. దీంతో హోటల్ యజమాని సిబ్బందితో కలిసి భక్తులపై దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హోటల్ యజమాని పై కత్తితో దాడి
-
న్యాయం జరగకుంటే హెచ్ఆర్సీని ఆశ్రయిస్తా
తిరుమల : హోటల్లో వంద రూపాయిలు దొంగలించాడని కార్మికుడిపై యజమాని తన ప్రతాపాన్ని చూపించాడు. దాంతో కార్మికుడి వీపుపై వాతలు వచ్చేల కొట్టాడు. దీంతో సదరు కార్మికుడు తిరుమల పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులోభాగంగా బాధితుడితో సహా పోలీసులు సదరు హోటల్‌కు చేరుకున్నారు. హోటల్ యజమానిని విచారించగా... హోటల్లో పని చేసే కార్మికులను తన సొంత పిల్లలుగా చూసుకుంటానని చెప్పారు. అలాంటిది తాను కార్మికుడిపై దాడి చేయలేదని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తనకు న్యాయం జరగకుంటే మానవహక్కుల సంఘాన్ని (హెచ్ఆర్సీ) ఆశ్రయిస్తానని కార్మికుడు వెల్లడించారు. -
రూ.8 కోట్లతో ఉడాయించిన వ్యాపారి!
హైదరాబాద్: ఈసీఐఎల్ చౌరస్తాలోని రెండు హోటళ్లు, మెస్‌లను నిర్వహిస్తున్న ఓ వ్యక్తి స్థానికులకు రూ.8 కోట్ల మేర టోకరా వేసి ఉడాయించాడు. విశాఖపట్నం, యలమంచిలి మండలానికి చెందిన ఆర్.రాజారావు (62) బాల్యంలోనే నగరానికి వచ్చి శ్రీచక్రిపురం కాలనీలో ఉంటున్నాడు. హోటల్ వ్యాపారం చేసే రాజారావు, స్థానికంగా తెలిసిన వారి వద్ద అందిన కాడికి అప్పులు చేశాడు. ఈనెల 8వ తేదీ రాత్రి నుంచి రాజారావు కనిపించకుండా పోవడంతో అధిక వడ్డీలకు ఆశపడి అప్పులు ఇచ్చినవారు లబోదిబోమంటున్నారు. కాగా, రాజారావు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఐ.పీ పెట్టినట్లు సమాచారం. అతడు దాదాపు ఎనిమిది కోట్ల మేర అప్పు చేసినట్లు తెలిసింది .కాగా, ఈ విషయమై కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎన్.వెంకట రమణ మాట్లాడుతూ, నిందితుడు ముందుగానే ఐపీ పెట్టుకోవడంతో బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదన్నారు.