Hottest
-
కళ్లు చెదిరే అందంతో రంగులీనుతుంది ఆ ఎడారి..అడుగుపెట్టారో అంతే..!
ఇదో ప్రకృతి కళాఖండం. ఉత్తర ఆఫ్రికాలో ఇథియోపియా ఈశాన్య ప్రాంతంలోని దీన్ని దానకిల్ డిప్రెషన్ అంటారు. 1,36,956 చదరపు కిలోమీటర్ల మేర కళ్లు చెదిరేంత అందంతో రంగులీనుతుంది ఈ ప్రదేశం. ఇక్కడ అడుగు పెడితే వేరే గ్రహం మీద అడుగుపెట్టినట్లుంటుంది. ప్రపంచంలోని అత్యంత వేడి ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ భూమి నుంచి నిత్యం నిప్పులు ఎగసిపడతాయి. ఇక్కడ నీళ్లు కుతకుతా మరుగుతాయి. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఆమ్లవర్షం కురుస్తుంటుంది. మనిషి మనుగడకు అనుకూలం కాని ఈ ఎడారిలో చూడతగ్గ అందాలెన్నో ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రమాదాలు కూడా నీడలా పొంచే ఉంటాయి. భూమి లోపల అల్లకల్లోలం ఏర్పడినప్పుడల్లా నిప్పులుచిమ్మే లావా ఎగసిపడుతుంది. అది ధారలా పొంగి, కనుచూపు మేర రంగురంగుల కథలెన్నో చెబుతుంది. లక్షల సంవత్సరాలుగా ఈ భూభాగం ఎన్నో మార్పులకు గురైంది. దీనిలోని వైవిధ్యభరితమైన మార్పులను గుర్తించి, దీనికి ‘దానకిల్ డిప్రెషన్’ అని పేరు పెట్టారు. దానకిల్ చుట్టుపక్కల పెద్దపెద్ద లోయలు, ఎతై న పర్వతాలు, ఉప్పు గోపురాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ఇక్కడికి వెళ్లే పర్యాటకులంతా స్థానిక గైడ్ అడుగుజాడల్లోనే నడుచుకోవాలని సూచిస్తుంటారు. సురక్షితమైన పాదరక్షలు ధరించి మాత్రమే నడవాలంటారు. చేతులతో ఏదిపడితే అది తాకి చూడటం ప్రమాదమని హెచ్చరిస్తారు. గ్రహాంతర ప్రదేశంలా ఉండే ఈ దానకిల్లో వేడి నీటి బుగ్గలు, ఆమ్ల కొలనులు, సరస్సులు మైమరిపిస్తుంటాయి. అయితే ఈ ఎడారి ఎందుకు ఇంత వేడిగా ఉంటుంది? భూమి లోపల ఏం జరుగుతూ ఉంటుంది? లాంటి వివరాలను శాస్త్రవేత్తలు సైతం కనిపెట్టలేకపోయారు. దాంతో భూమి మీద ఈ ప్రదేశం మిస్టీరియస్‌గానే మిగిలిపోయింది. ఇథియోపియాలో కొన్ని శతాబ్దాల క్రితం ఉప్పును కూడా కరెన్సీగా ఉపయోగించేవారట. అందుకోసం ఉప్పును సేకరించేందుకు ఈ ప్రదేశానికి వెళ్లేవారట. ఒకప్పుడు ఈ ప్రాంతం ఎర్ర సముద్రంలో భాగంగా ఉండేది. కాలక్రమేణా అగ్నిపర్వతాల విస్ఫోటాల కారణంగా.. కొంతభాగం సల్ఫ్యూరిక్ సరస్సులా మారింది. మరికొంత భాగం లావాతో బీటలువారి ఎడారిని తలపిస్తుంది. శిలాద్రవంలోని ఖనిజాలు, సముద్రపు ఉప్పు నీరు, ఆమ్ల వర్షపు నీరు కలసి పసుపు, నారింజ, ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులతో ఈ ప్రాంతమంతా మెరుస్తుంది. ఇక్కడ కొంత సురక్షితమైన భూభూగానికి పర్యాటకులు తరచుగా వెళుతుంటారు. చూడటానికి ఈ పరిసర ప్రాంతాలన్నీ చాలా వింతగా ఉంటాయి. ఒక చోట వేడి నీరు.. పొగలు కక్కుతుంటే, పక్కనే మరో చోట చల్లటి నీటి కొలను సేదతీరుస్తుంది. మనుషులను మునిగిపోనివ్వకుండా తేలియాడిస్తూ ఆటలాడిస్తుంది. --సంహిత నిమ్మన (చదవండి: కాదేది రికార్డుకనర్హం! అగ్గిపుల్లలతో సరికొత్త రికార్డు..!) -
వామ్మో 2023!
భూతాపం విషయంలో 2023 కనీవినీ ఎరగని రికార్డు సృష్టించింది. అత్యంత వేడిమి డిసెంబర్ నెల ముగియక ముందే 2023 రికార్డులకెక్కడం తెలిసిందే. అయితే చరిత్రలో ఇప్పటిదాకా అత్యధికంగా 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదైన ఏడాదిగా 2023 నిలిచింది! 2016 నాటి రికార్డు కంటే ఇది ఏకంగా 0.17 డిగ్రీలు అధికం! అదే 1991–2020 మధ్య 20 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏకంగా 0.6 డిగ్రీలు ఎక్కువ!! గతేడాదికి సంబంధించిన ఉష్ణోగ్రతల గణాంకాలను క్షుణ్నంగా విశ్లేషించిన మీదట యూరోపియన్ యూనియన్ వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్ మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పేర్కొంది. అంతేకాదు, 2023 రెండో అర్ధ భాగంలో దాదాపుగా ప్రతి రోజూ ఎండ తీవ్రతలో కొత్త రికార్డులు నెలకొల్పినట్టు తేల్చింది! ఇది నిజంగా భయానక పరిణామమేనని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... – సాక్షి, నేషనల్ డెస్క్ 2023 నవంబర్ 17. భూ ఉష్ణోగ్రతలో ఏకంగా 2.06 డిగ్రీల పెరుగుదల నమోదైన తేదీ! మానవ చరిత్రలో ఉష్ణోగ్రతల పెరుగుదలను రికార్డు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచీ అత్యధిక పెరుగుదల అదే! అలా మానవాళి చరిత్రలో ఓ దుర్దినంగా నవంబర్ 17న నిలిచిపోయింది. తర్వాత అదే నెలలో మరోసారి ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలను దాటేసింది. దాంతో పర్యావరణవేత్తల్లో గగ్గోలు మొదలైంది. కానీ 2023 రెండో భాగంలో, అంటే జూలై నుంచి డిసెంబర్ దాకా ప్రతి రోజూ ఎండలు కనీవినీ ఎరగని రీతిలో ప్రపంచాన్ని అల్లాడించాయని కోపర్నికస్ తాజా నివేదిక తేల్చింది. పైగా 2023లో 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవడమూ భయపెట్టే పరిణామమే. భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలను పారిశ్రామికీకరణనాటి తొలినాళ్లతో, అంటే 1850–1900 సంవత్సరాల మధ్య కాలపు సగటుతో పోల్చి చెబుతారు. అప్పటితో పోలిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 1.5 డిగ్రీల కంటే దిగువకు కట్టడి చేయాలన్నది 2015 నాటి పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలన్నీ సంయుక్తంగా చేసుకున్న తీర్మానం. కానీ 2023లో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల దాదాపుగా ఆ లక్ష్మణరేఖను తాకింది. 1850తో పోలిస్తే గతేడాది ప్రతి రోజూ ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది! 2015లో తొలిసారిగా ఒక్క రోజు ఇలా 1 డిగ్రీ పెరుగుదల నమోదైతేనే ప్రపంచమంతా విస్మయపడింది. అది కాస్తా కేవలం ఏడేళ్లకే రోజువారీ పరిణామంగా మారిపోయింది. పైగా సగటు పెరుగుదలే దాదాపుగా 1.5 డిగ్రీలను తాకేసింది. గ్లోబల్ వారి్మంగ్ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోందనేందుకు ఇంతకు మించిన తార్కాణం అవసరం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన 2024లో ఉష్ణోగ్రత సరికొత్త రికార్డులు సృష్టించి భూగోళాన్ని మరింత వినాశనం దిశగా నెట్టడం ఖాయమని తాజా నివేదికలో కోపర్నికస్ కూడా అంచనా వేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జూన్‌లోపే సగటు భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటేస్తే ఆశ్చర్యం లేదని అది అభిప్రాయపడింది. అదే జరిగితే భూమిపై కీలక పర్యావరణ వ్యవస్థల్లో చాలావరకు అంతటి తాపాన్ని తట్టుకోలేవు. అప్పుడిక ప్రపంచంలో ఒకవైపు తీవ్ర కరువులు, కార్చిచ్చులు, మరోవైపు భయంకరమైన తుపాన్లు నిత్య సమస్యలుగా మారిపోతాయి. గతేడాది అమెరికా, కెనడా, హవాయి, దక్షిణ యూరోప్‌ల్లో నిత్యం కార్చిచ్చులు చెలరేగడం, పలు దేశాలు కనీవినీ ఎరగని వరదలతో, గడ్డకట్టించే చలి పరిస్థితులతో అతలాకుతలం కావడం తెలిసిందే. వాతావరణ మార్పులు, ఎల్ నినో... 2023 ఇంతగా మండిపోవడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని కోపర్నికస్ నివేదిక స్పష్టం చేసింది. దానికి తోడు గతేడాది జూలైకల్లా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నెలకొన్న ఎల్ నినో (కరువు) పరిస్థితులు పరిస్థితిని మరింత దిగజార్చినట్టు వివరించింది. ఫలితంగా పసిఫిక్ మొదలుకుని ప్రతి మహాసముద్రమూ ఎప్పుడూ లేనంతగా వేడెక్కినట్టు పేర్కొంది. 1991–2020 సగటుతో పోలిస్తే 2023లో సముద్రాల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఏకంగా 0.44 డిగ్రీలుగా నమోదైంది! దాంతో మంచు ప్రాంతాలైన ఆర్కిటిక్, అంటార్కిటికాలపై దీని ప్రభావం విపరీతంగా పడటం మొదలైంది. అక్కడి మంచు ఎన్నడూ లేనంతగా కొన్నాళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. ఈ దెబ్బకు సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత మహా నగరాలు చాలావరకు నీట మునుగుతాయి. అదే జరిగితే ప్రపంచంలో కనీసం మూడో వంతు జనాభా నిర్వాసితులుగా మారతారని అంచనా. ఊహించుకోవడానికే భయం కలిగే ఇలాంటి పరిణామాలెన్నో అతి త్వరలో జరిగేలా కనిపిస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. -
హాట్ వింటర్పై ఐఎండీ కీలక అప్డేట్ !
న్యూఢిల్లీ : గ్లోబల్ వార్మింగ్‌తో వాతావరణ మార్పులు కళ్ల ముందు కనిపిస్తునే ఉన్నాయి. ఓ పక్క సీజన్‌తో సంబంధం లేకుండా వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో పక్క శీతాకాలంలోనూ మధ్యాహ్నం వేళల్లో ఎండలు వేడెక్కిస్తున్నాయి. ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉంటోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. దేశంలో ఈ శీతాకాలంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సాధారణంగా కంటే వేడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ‘దేశంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పీక్ వింటర్‌గా పరిగణిస్తారు. అయితే ఈ టైమ్‌లో ఈ ఏడాది దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణంగా కంటే కనీస, గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతాయి. మధ్య, ఉత్తర భారతాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి’అని ఐఎండీ డైరెక్టర్ మహాపాత్ర తెలిపారు. ఇప్పటికే నవంబర్ నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐఎండీ ఉష్ణోగ్రతలు రికార్డు చేయడం ప్రారంభించిన 1901 నుంచి గణాంకాలు తీసుకుంటే ఈ ఏడాది నవంబర్‌లో మూడోసారి కనీస, గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయి కొత్త రికార్డు సృష్టించాయి. ఇదీచదవండి.. రిసార్టులకు పండగే! ఎగ్జిట్‌పోల్స్‌తో సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్ -
రాధికా ఆప్టే అందానికి.. రాం.. ఫిదా!
సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ కనిపించే దర్శకుడు రాంగోపాల్ వర్మ కన్ను... ఈసారి మరాఠీ అందాల భామ రాధికా అప్టేపై పడింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన కబాలీ సినిమాలో నటిస్తున్న రాధికా ఆప్టే అందాన్ని వర్ణిస్తూ రాం చేసిన ట్వీట్.. రాధికా అభిమానులను మరింత పెంచేట్టుగా ఉంది. రాధికాను చూడగానే తాను డైరెక్ట్ చేసిన సినిమా గోవిందా గోవిందా సినిమాలోని పాట గుర్తుకు వచ్చిందని, ఇంతటి హాటెస్ట్ అమ్మాయిని ఇటీవల ఎక్కడా చూడలేదంటూ వర్మ తనదైన శైలిలో వర్ణిస్తూ ట్వీట్ చేశాడు. ఆ మరాఠీ బ్యూటీకి కొంతకాలం క్రితం విడుదలైన రక్త చరిత్ర సినిమాలో వర్మ...అవకాశం కూడ కల్పించాడు. అయితే ఇన్నాళ్ళ తర్వాత ఆమె మళ్ళీ తెరపైకి వస్తున్న నేపథ్యంలో తన మనసులోని భావాలను ''ఆహ్హాఆఆఆ! ది హాటెస్ట్ ఐ సా మై లాస్ట్ త్రీ బర్త్స్'' అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశాడు.Ahhhhhhhhh!- The hottest I saw in my last 3 births 😍 pic.twitter.com/KQ0wIWC2ZJ— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2016