house to house
-
ఇంటింటికీ ‘అయోధ్య’ చిత్రపటాలు
హుజూరాబాద్ రూరల్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఇంటికే అయోధ్య రామయ్య రానున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అవును.. ఎంపీ బండి సంజయ్‌కుమార్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజల ఇళ్లకు రాములోరి చిత్రపటాలను పంపిణీ చేయనున్నారు. అయోధ్య వెళ్లలేని వారు తమ ఇళ్లల్లోనే స్వామివారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతమంది ఓటర్లున్నారు? ఎన్ని కుటుంబాలున్నాయి? వారిలో రామయ్యను కొలిచే వాళ్లెందరున్నారు? అనే వివరాలను సేకరించారు. మొత్తం 5 లక్షల కుటుంబాలకు పైగా ఉండగా.. వాటిలో నాలుగు లక్షలకు పైగా కుటుంబాలు హిందువులని తేలింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, 4.21 లక్షల అయోధ్య రాముని చిత్రపటాలను తయారు చేయించే పనిలో ఎంపీ నిమగ్నమయ్యారు. ఇప్పటికే లక్షకు పైగా సిద్ధమవడంతో ఇంటింటికీ చేరవేసే పనిలో కాషాయ శ్రేణులు నిమగ్నమయ్యాయి. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంజయ్ మంగళవారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలో పర్యటించనున్నారు. -
ఇంటింటికీ టీకాలు సాధ్యం కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. ఇంటింటికీ (డోర్–టు–డోర్) టీకాలు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు కౌంటరు దాఖలు చేస్తూ... ఆ విధంగా చేయలేకపోవడానికి ఐదు కారణాలున్నాయంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ నిమిత్తం జాతీయ నిపుణుల బృందం దేశంలో టీకా డ్రైవ్ అంశాలకు మార్గనిర్దేశం చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అఫిడవిట్లో పేర్కొంది. 1. టీకా వేశాక ప్రతికూల సంఘటనలు ఎదురైతే తక్షణ వైద్య సదుపాయాలు అందించడంలో ఆలస్యం కావొచ్చు. 2. వ్యాక్సినేషన్ తర్వాత తీసుకున్న వ్యక్తికి 30 నిమిషాలు పరిశీలించడంలో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. 3. పదేపదే వ్యాక్సిన్ భద్రత పరిచే పెట్టెను తెరవడం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల వ్యాక్సిన్ పాడయ్యే అవకాశం ఉంది. తద్వారా వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గడం తోపాటు దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. వ్యాక్సిన్‌పై నమ్మకం కూడా తగ్గే అవకాశం ఉంది. 4. ఒక లబ్ధి దారుడు నుంచి మరో లబ్ధిదారుడిని చేరుకొనే క్రమంలో వ్యాక్సిన్ వృథా అయ్యే అవకాశం ఉంది. 5. డోర్ టు డోర్ వల్ల కరోనా ప్రొటోకాల్స్ పాటించే అవకాశం ఉండదు. -
నేటి నుంచి ఎమ్మెల్సీ ఓటర్లకు స్లిప్పుల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజక వర్గం ఓటర్లకు మార్చి నెల 2 నుంచి స్లిప్పులు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. 5వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేస్తారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే స్లిప్‌లను సంబంధిత తహసీల్దారు కార్యాలయాలకు పంపినట్లు తెలిపారు. స్లిప్‌లో ఓటరు పేరు పోలింగ్ కేంద్రం అడ్రస్ ఉంటాయని. ఇది ఓటరు గుర్తింపునకు తోడ్పడుతుందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్లిప్‌లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత తహసీల్దార్ లేదా కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూంలోని 08518–227305, 227309 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.