నేటి నుంచి ఎమ్మెల్సీ ఓటర్లకు స్లిప్పుల పంపిణీ | voter slips issue from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎమ్మెల్సీ ఓటర్లకు స్లిప్పుల పంపిణీ

Published Sat, Mar 4 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

voter slips issue from today

కర్నూలు(అగ్రికల్చర్‌): శాసనమండలి కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజక వర్గం ఓటర్లకు మార్చి నెల 2 నుంచి స్లిప్పులు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ తెలిపారు. 5వ తేదీ వరకు బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేస్తారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే స్లిప్‌లను సంబంధిత తహసీల్దారు కార్యాలయాలకు పంపినట్లు తెలిపారు. స్లిప్‌లో ఓటరు పేరు పోలింగ్‌ కేంద్రం అడ్రస్‌ ఉంటాయని. ఇది ఓటరు గుర్తింపునకు తోడ్పడుతుందన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు స్లిప్‌లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత తహసీల్దార్‌ లేదా కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలోని 08518–227305, 227309 ఫోన్‌ నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement