house sanctioned
-
అనకాపల్లిలో ఘనంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం (ఫొటోలు)
-
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా: మేడా మల్లికార్జునరెడ్డి
సాక్షి, రాజంపేట (అన్నమయ్య): మనసున్న ముఖ్యమంత్రి అని వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చెయ్యేరులో వరద బీభత్సానికి సర్వం కోల్పోయిన వారికి ఇంటి స్థలంతోపాటు, ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.5లక్షలు మంజూరు చేయాలని సీఎంను కోరామన్నారు. దీంతో ఒక్కో ఇంటికి రూ.5లక్షలు పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేసిందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు వివరించారు. పులపుత్తూరులో మొదటి లే అవుట్లో 160, రెండవ లే అవుట్లో 101, మూడవ లే అవుట్లో 62, తొగురుపేటలో 69, రామచంద్రాపురంలో 56 ఇళ్లను మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. రాజంపేట నుంచి ఏ కార్యాలయం తరలింపు లేదు పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రం రాజంపేట నుంచి ఏ కార్యాలయం తరలించేది లేదని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్పష్టంచేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీసీ యోగీశ్వరరెడ్డి, ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, మాజీ చైర్మన్ పోలి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పదేళ్ల కల.. ఫలిస్తున్న వేళ
ఉరవకొండ: పదేళ్లుగా ఎదురు చూస్తున్న పేదల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. తెలుగుదేశం పాలనలో ఇళ్ల పట్టాలు పొందినా ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియవు. అడిగినా చూపేవారు లేరు. ఇక తమ ఆశలు అడియాసలయ్యాయనుకుంటున్న వేళ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 25 వైకుంఠ ఏకాదశి రోజున ఇళ్ల పట్టాల మంజూరుతో పాటు పక్కాగృహాల నిర్మాణాలు చేపట్టనుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు నివేశన స్థలాల పంపిణీ కోసం 2008లో ఉరవకొండ పట్టణంలో కోటి రూపాయల వ్యయంతో 88 ఎకరాల భూమిని కొనుగోలు చేయించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఈ మేరకు భూమి సేకరించారు. అనంతరం టీడీపీ అధికారంలోకొచ్చింది. అప్పటి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయడానికి అవకాశం ఉన్నా తాత్సారం చేశారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసుకుని లబ్ధి పొందేందుకు అసమగ్ర వివరాలతో కూడిన మూడు వేల పట్టాలను హడావుడిగా ఉరవకొండలో పంపిణీ చేశారు. అయితే 15 సర్వే నంబర్లతో పేర్కొన్న పట్టాలో ఎవరి స్థలం ఎక్కడుందో చూపించలేకపోయారు. చెక్కు బందీలు లేవు.. ఎవరు ఎక్కడో తెలీదు.. అయినా పక్కాగృహాలు కూడా మంజూరైనట్లు ప్రకటించారు. ఓట్ల కోసమే ఈ డ్రామా ఆడారని పేదలకు నిదానంగా అర్థమయ్యింది. సొంతింటి కల సాకారమైందిలా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇచ్చిన హామీ మేరకు ఇంటి పట్టా, పక్కా గృహ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద అర్హులైన పేదలందరికీ పట్టాలు మంజూరు చేయనున్నారు. తాజాగా 8,651 మందికి ఇంటి పట్టాలు ఇవ్వనుండగా.. గత టీడీపీ హయాంలో పక్కాగృహాలు మంజూరై నిర్మాణాలు చేపట్టని వారిని కూడా కలుపుకొని 25,391 మందిని ‘అందరికీ ఇళ్లు’ పథకంలో చేర్చారు. ఇళ్ల మంజూరులో రెండోస్థానం పేదలకు పక్కా ఇళ్ల మంజూరులో రాష్ట్రంలో వైఎస్సార్ జిల్లా తరువాత ఉరవకొండ నియోజకవర్గంలోనే అత్యధికంగా 25,391 పక్కాగృహాలు మంజూరయ్యాయి. పక్కా ఇళ్ల మంజూరులో రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచింది. ఈసారి ఇస్తున్న పట్టాలో స్థలం, చెక్కుబందీలు స్పష్టంగా కనబరిచారు. నివేశన స్థలాల కోసం ఎంపిక చేసిన లే అవుట్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. సంతోషంగా ఉంది ఎన్నో ఏళ్ల నుంచి ఇంటి పట్టా కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. జగనన్న ప్రభుత్వం మాకు ఇంటి పట్టా మంజూరు చేసి ఈ నెల 25న అందిస్తోంది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంటి పట్టాతో పాటు పక్కా ఇల్లు కట్టిస్తుండటంతో నాసంతోషం మాటల్లో చెప్పలేను. – బీబీ, పదో వార్డు, ఉరవకొండ పార్టీలకతీతంగా ఇంటి పట్టా అర్హులైన ప్రతి పేదవారికీ జగనన్న ప్రభుత్వం ఇంటి పట్టా అందించబోతోంది. గత టీడీపీ హయంలో ఇంటి పట్టా కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ప్రస్తుతం పారీ్టలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పట్టా, పక్కా ఇల్లు మంజూరు అవుతోంది. – ఏసీ పార్వతమ్మ, అంబేడ్కర్‌నగర్, ఉరవకొండ -
అనుగృహమేదీ?
– జిల్లాకు 29,500 ఇళ్లు కేటాయింపు – లబ్ధిదారుల ఎంపికకు మూడ్రోజులే గడువు – ఇప్పటి వరకు అందని జాబితా – జన్మభూమి కమిటీలకు పెత్తనమివ్వడమే ఆలస్యానికి కారణం ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీం కింద రెండేళ్లకు గాను 29,500 ఇళ్లను జిల్లాకు కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఈనెలాఖరులోగా జాబితాను గృహ నిర్మాణ సంస్థ అధికారులకు అందించాలి. ఇప్పటి వరకూ ఏ నియోజకవర్గం నుంచి కూడా లబ్ధిదారుల జాబితా అందని పరిస్థితి. సాక్షాత్తూ గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇలాఖాలోనే ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం. - అనంతపురం టౌన్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో ఒక్క ఇంటినీ నిర్మించలేదు. ఎక్కడికక్కడ ప్రజావ్యతిరేకత రావడంతో ఆలస్యంగా పేదోడి సొంతింటి కలను సాకారం చేయాలని భావించింది. ఇందులో భాగంగా గతేడాది 16 వేల ఇళ్లను ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీం కింద మంజూరు చేసింది. ఇప్పటికే నిర్మాణాలన్నీ పూర్తి చేయాల్సి ఉన్నా రాజకీయ కారణాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. గతేడాదికి సంబంధించి ఇంకా 1,105 ఇళ్లకు లబ్ధిదారుల జాబితా అధికారులకు అందని దుస్థితి. ఇక 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి తాజాగా 29,500 ఇళ్లను కేటాయించగా లబ్ధిదారుల ఎంపికలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. ఏడాదికి 14,750 ఇళ్లు కేటాయింపు జిల్లాకు ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం కింద తాజాగా 29,500 ఇళ్లు కేటాయించారు. అనంతపురం నియోజకవర్గానికి 450 .. మిగిలిన వాటిలో ఒక్కో నియోజకవర్గానికి 1,100 ఇళ్లు కేటాయించారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 14,750 వేల ఇళ్లు, 2018–19 ఆర్థిక సంవత్సరంలో మరో 14,750 వేల ఇళ్లు నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అంటే ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గంలో 1,100 ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది. ఇందులో ఎస్సీలకు 192, ఎస్టీలకు 45, మైనార్టీలకు 9, బీసీలు, ఇతరులకు కలిపి 854 చొప్పున ప్రతి నియోజకవర్గంలో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. వచ్చే ఏడాది కూడా ఇదే ప్రాతిపదికను అనుసరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలు ఇంటికి అందిస్తున్న మొత్తం విలువ పూర్తి రాయితీగా అందనుంది. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.50 లక్షలు మంజూరు చేస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ రాయితీ రూ.92 వేలు, మరుగుదొడ్డి కోసం అదనపు రాయితీ రూ. 3 వేలు, ఉపాధి హామీ పథకం కింద రూ.55 వేలు సమకూర్చుతారు. ఉపాధి నిధులు రూ.55 వేలకు సంబంధించి రోజుకు రూ.194 వేతనం కింద 90 రోజులకు రూ.17,460, ఇటుకలు, బ్లాక్స్ మేకింగ్ కోసం రూ.25,540, మరుగుదొడ్డికి రూ.12 వేలు అందిస్తారు. ప్రతి లబ్ధిదారుడికి రేషన్‌కార్డు, ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. చాలా చోట్ల గ్రామ సభలు నిర్వహించని వైనం లబ్ధిదారుల ఎంపిక బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులకే అప్పగించారు. జన్మభూమి కమిటీలు గ్రామ సభ నిర్వహించి పంచాయతీ స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక చేయాలి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ చాలా చోట్ల గ్రామ సభలు నిర్వహించని దుస్థితి. జన్మభూమి కమిటీలదే పెత్తనం కావడంతో రాజకీయ కూడికలు, తీసివేతల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుండడంతో ఈ పరిస్థితి వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 31లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. దీనికి ఇక మూడ్రోజులే గడువు ఉంది. ఇంత వరకు అసలు ప్రక్రియే గ్రామ స్థాయిలో ప్రారంభం కాలేదు. జన్మభూమి కమిటీల ఆమోదం తప్పనిసరి గ్రామ సభలు నిర్వహించి జన్మభూమి కమిటీల ఆమోదంతోనే లబ్ధిదారుల జాబితా రావాల్సి ఉంది. ఈ విషయమై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు. లబ్ధిదారుల ఎంపిక నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఆలోపు వస్తాయని భావిస్తున్నాం. – రాజశేఖర్, హౌసింగ్ పీడీ ఈ ఏడాది మంజూరు చేసిన ఇళ్లు ఎస్సీ వర్గాలకు : 2,573 ఎస్టీలకు : 602 మైనార్టీలకు : 850 బీసీలు, ఇతరులకు : 10,725 మొత్తం ఇళ్లు : 14,750 -
8,207 ఇళ్లు మంజూరు
అనంతపురం అర్బన్ : జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌తో పాటు ఏడు మునిసిపాలిటీకు పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 8,207 ఇళ్లు మంజూరయ్యాయని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. గృహ నిర్మాణానికి అవసరమైన రుణాన్ని లబ్ధిదారులకు బ్యాంకర్లు త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఏల్డీఎంను ఆదేశించారు. శనివారం పట్టణ గృహ నిర్మాణాలపై ఆయన తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద గుంతకల్లు మునిసిపాలిటీకి 2,000, అనంతపురం కార్పొరేషన్‌కి 2,000, ధర్మవరానికి 1,400, రాయదుర్గంకి 1,307, హిందూపురానికి 500, కదిరి మునిసిపాలిటీకి 1,000 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. పథకం కింద ఒక్కో గృహ నిర్మాణ వ్యయం రూ.3.50 లక్షలు అన్నారు. ఇందులో సబ్సిడీగా కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు మంజూరు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఇస్తుందన్నారు. లబ్ధిదారుని వాటా రూ.25 వేలు, బ్యాంకు రుణంగా రూ.75 వేలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లబ్ధిదారులకు బ్యాంక్ రుణం రూ.75 వేలు త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
బెంగాల్ అత్యాచార బాధితురాలికి ఇల్లు, ఉపాధిహామీ పని
పశ్చిమబెంగాల్ అత్యాచార బాధితురాలిని ఊళ్లోకి రానిచ్చేది లేదని గ్రామస్థులు అంటుండటంతో.. గ్రామ సమీపంలోనే ఓ ఇల్లు కట్టించి ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఆ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆమె గ్రామానికి సమీపంలోనే ఇందిరా ఆవాస్ యోజన కింద ఓ ఇల్లు కట్టించి ఇవ్వబోతున్నట్లు పశ్చిమబెంగాల్ మహిళా, శిశు సంక్షేమ మంత్రి శశి పంజా తెలిపారు. దాంతోపాటు ఆమెకు పోలీసు రక్షణ కూడా కల్పిస్తామన్నారు. బాధితురాలితో తాము మాట్లాడామని, ఇంతకుముందు ఆమె రోజు కూలీగా పనిచేసింది కాబట్టి అదే పని ఇప్పిస్తామని తెలిపారు. ఆమె ఎటూ నిరక్షరాస్యులు కాబట్టి, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసేందుకు అంగీకరించినట్లు మంత్రి చెప్పారు. జనవరి 21వ తేదీన 13 మంది వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఆమెను శుక్రవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ సంక్షేమ గృహానికి తరలించారు. ఆమెకు అన్ని రకాలుగా సాయం చేసేందుకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. నిందితులు 13 మందీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.