Housing company
-
సంపూర్ణ హక్కుతో సంతోషం
ఫొటోలో కనిపిస్తున్న కంచెర్ల కృష్ణవేణిది తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం. చాలా ఏళ్ల క్రితం గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకుంది. రుణం చెల్లించకపోవడంతో ఇంటి పత్రాలు తనఖాలోనే ఉండిపోయాయి. గత ఏడాది సీఎం జగన్ ప్రభుత్వం ఇంటి రుణాలపై రాయితీ ఇస్తూ, నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని ప్రకటించింది. దీంతో తన అప్పు వడ్డీ, అసలు కలిపి రూ. 50,620కు చేరిందని తెలుసుకుంది. అయితే, రూ.10 వేలు చెల్లిస్తే చాలని అధికారులు సూచించడంతో.. ఆ మొత్తాన్ని చెల్లించింది. సర్కారు సర్వహక్కులతో ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న జి. వాణిప్రియది శ్రీకాకుళం జిల్లా రాజాం. రోజూ కూలి పనికి వెళ్తేగానీ పూట గడవని పరిస్థితి. ఈమెకు భర్త కూడా లేడు. రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకుంది. ఆ ఇంటికి హక్కు పత్రాలు లేవు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రుణం కోసం బ్యాంకుకు వెళ్తే అప్పు కూడా పుట్టదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టడంతో వాణిప్రియ రూ.10వేలు కట్టేసి ఇంటిపై సంపూర్ణ హక్కులు పొందింది. దీంతో ఆ ఆస్తి విలువ ఇప్పుడు రూ.10 లక్షలకు పెరిగిందని ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తోంది. భవిష్యత్తులో బ్యాంకు రుణం వస్తుందని ధీమాగా ఉంది. .. ఇలా కృష్ణవేణి, వాణిప్రియ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది పేదలు ఈ పథకం కింద ఇళ్లపై సర్వహక్కులు పొందుతున్నారు. సాక్షి, అమరావతి: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ (జేఎస్‌జీహెచ్‌పీ) కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకూ గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లకు ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మంది ఇళ్లు నిర్మించుకోగా వీరిలో 96% మందికి ఇళ్లలో నివసించే హక్కులు తప్ప, ఆస్తులపై ఇతర హక్కులు లేవు. దీంతో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం లబ్ధిదారులకు వరంలా మారింది. ఎంతో సంతోషంతో వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. కానీ, టీడీపీ, దాని అనుకూల పచ్చమీడియా ప్రభుత్వ నిర్ణయాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నాయి. ఈ పథకంపై ఎక్కడలేని దుష్ప్రచారం చేస్తున్నాయి. నిజానికి.. 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వాలు ఓటీఎస్‌ను అమలుచేస్తూ వస్తున్నప్పటికీ 2014–2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ఓటీఎస్ అమలుచేయాలని ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గృహ నిర్మాణ సంస్థ పాలకవర్గం కోరినా చంద్రబాబు కనికరించలేదు. జగన్ సీఎం అయ్యాక జేఎస్‌జీహెచ్‌పీ ప్రవేశపెట్టడంతో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 9,69,786 మంది ముందుకొచ్చారు. వీరిలో 3,69,139 మంది పేర్లపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రూ.16 వేల కోట్ల మేర లబ్ధి 1983 నుంచి 2011 మధ్య గృహ నిర్మాణ సంస్థకు ఇళ్ల లబ్ధిదారులు పడిన బకాయి వడ్డీతో కలిపి రూ.14,400 కోట్లుగా ఉంది. ప్రస్తుతం జేఎస్‌జీహెచ్‌పీ ద్వారా ఓటీఎస్ రూపంలో ప్రభుత్వం రూ.10 వేల కోట్లు మాఫీ చేసింది. అంతేకాక.. రిజిస్ట్రేషన్ సమయంలో చార్జీలు, ఫీజులను ఎత్తివేస్తూ రూ.6 వేల కోట్లు పేదలపై భారం పడకుండా చూసింది. ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర పేదలకు లబ్ధిచేకూర్చింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు చెల్లిస్తే ఇంటిపై ప్రభుత్వం సర్వ హక్కులు కల్పిస్తోంది. ఇక నిర్దేశించిన మొత్తం కన్నా అప్పు తక్కువగా ఉంటే లబ్ధిదారులు ఆ మొత్తాన్నే చెల్లించుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. ఓటీఎస్ అమలుకు 03–11–2017న గృహ నిర్మాణ సంస్థ ఎండీ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన. ఈ తరహాలో 2014–19 మధ్యలో గత టీడీపీ ప్రభుత్వానికి గృహ నిర్మాణ సంస్థ ఐదుసార్లు ప్రతిపాదనలు పంపింది. అయినా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వడ్డీతో సహా వసూలుకే అప్పట్లో బాబు ప్రభుత్వం మొగ్గు చూపింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో ప్రయోజనాలివే.. ► పూర్తి యాజమాన్య హక్కులు రావడంవల్ల ఆస్తులను తనఖా పెడితే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. ► డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్ స్థలాలకు మార్కెట్లో విలువ తక్కువగా ఉంటుంది. రిజిస్ట్రర్ ఆస్తులతో పోలిస్తే ప్రాంతాలను బట్టి 20 నుంచి 50 శాతానికిపైగా విలువ తక్కువే. ఈ వ్యత్యాసం లేకుండా ఆస్తుల విలువ పెరుగుతుంది. ► డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్లను వారసుల పేర్లపై బదలాయించడానికి ఆస్కారంలేదు. ఈ పథకం ద్వారా ఆస్తులను బదలాయించుకోవడంతో పాటు అమ్ముకోవచ్చు. రుణం రూ.51 వేలు.. కట్టింది రూ.10 వేలు 17 ఏళ్ల క్రితం ప్రభుత్వ రుణంతో ఇల్లు నిర్మించుకున్నాం. వడ్డీతో కలిపి రుణం రూ.51 వేలకు చేరుకుంది. ఇంటిపై అధికారికంగా మాకు ఎలాంటి హక్కులు లేవు. సీఎం వైఎస్ జగన్ ఎంత అప్పు ఉన్నా, కేవలం ఒకేసారి రూ.10 వేలు కడితే అప్పును పూర్తిగా రద్దుచేయడంతో, పాటు ఇంటి పత్రాలు ఇస్తామని చెప్పడంతో వెంటనే కట్టేశా. ఇల్లు నా పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. డాక్యుమెంట్లు తీసుకున్నా. – పి. అనంతమ్మ, పగిడిరాయి గ్రామం, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓటీఎస్ అమలుకు గృహ నిర్మాణ సంస్థ బోర్డు మీటింగ్ లో చేసిన తీర్మానంకు సంబంధించిన ప్రతి ఇన్నేళ్లకు సొంతింటి కల నేరవేరింది ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకున్నాం. ఇందులో మాకు నివసించే హక్కు తప్ప మా వారసులకు దీనిని బదలాయించే హక్కులేదు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఆ బెంగ తీరింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు బ్యాంకు రుణాలు పుట్టవు. ఇది మాలాంటి వాళ్లకి పెద్ద సమస్య. మా సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపారు. చాలా ఏళ్లుగా సొంతింటిలో ఉంటున్నప్పటికీ ఇప్పటికి నా సొంతింటి కల వాస్తవ రూపం దాల్చింది. – జంగాల నాగమ్మ, జయంతి కాలనీ, రాజుపాలెం గుంటూరు జిల్లా దుష్ప్రచారం మానుకోవాలి గతంలో వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ముందుకు రాని చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ చర్యను తప్పుపడుతున్నారు. బాబుకు పేదలు బాగుపడటం ఇష్టం ఉండదు. ప్రస్తుత ప్రభుత్వం అసలు, వడ్డీలో రాయితీ ఇచ్చి, ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పిస్తుండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు. లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి బాబు బుద్ధి మార్చుకోవాలి. – దావులూరు దొరబాబు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ మా ఆస్తి విలువ పెరిగింది 15 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నాం. మాది ప్రభుత్వం ఇచ్చిన స్థలం. డీ పట్టా ఉండటంతో మార్కెట్ ధరలతో పోలిస్తే మా ఆస్తి విలువ 50 శాతం తక్కువే పలుకుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో ఇకపై మాది ప్రైవేట్ ఆస్తితో సమానం. దీంతో భవిష్యత్‌లో మేం అమ్మాలనుకున్నా కొనుగోలుకు ఎంతోమందిముందుకు వస్తారు. మాకు దిగులుండదు. ఇప్పుడు మా ఇల్లు రూ.35 లక్షల వరకు పలకనుంది. – కోనేటి రాజ్యలక్ష్మి, రమణయ్యపేట, కాకినాడ ఇంటి పత్రాన్ని అధికారులు ఇంటికి తెచ్చిచ్చారు సొంత ఇంట్లో ఉన్నా ఇంటిపై యాజమాన్య హక్కులు లేవని లోటు ఉండేది. 2007లో తీసుకున్న రుణం వడ్డీతో రూ.30 వేలు అయింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి వలంటీర్ చెప్పగానే ఎవరి ప్రోద్బలం లేకుండా రూ.10 వేలు చెల్లించాం. సర్వహక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పత్రాన్ని అధికారులు ఇంటికి తెచ్చిచ్చారు. – కోకిల, పలమనేరు, చిత్తూరు జిల్లా ఇంటి విలువ పెరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంపూర్ణ గృహ హక్కు పథకం పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో ఉపయోగపడుతోంది. నేను 2010లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకున్నాను. ఇప్పటివరకు అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.28 వేలకు చేరుకుంది. ప్రభుత్వం ఓటీఎస్ ప్రవేశపెట్టడంతో వెంటనే రూ.10 వేలు చెల్లించా. నా ఇంటికి సంబంధించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను అందించారు. ఇప్పటివరకు ఇల్లు నాదైనా, దానికి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంవల్ల ఎంతో ఇబ్బందిపడ్డాం. ప్రస్తుతం డాక్యుమెంట్లు పక్కాగా రావడంవల్ల నా ఇంటి విలువ ఇప్పుడు రూ.20 లక్షలకు చేరుకుంది. – అల్లాబకాష్, నెరవాడ, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా -
బాబు వచ్చే...జాబు పోయే!!
గృహనిర్మాణ సంస్థలో 149 మంది వర్క్ ఇన్స్పెక్టర్ల తొలగింపు రిటైర్మెంట్ పేరుతో 200 మంది అంగన్వాడీ ఉద్యోగులు ఇంటిదారి ఆదర్శ రైతులు 1551 మంది తొలగింపు మచిలీపట్నం : పోయి ఉన్న ఉద్యోగాలను పీకేశారు.జిల్లా గృహనిర్మాణ సంబాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందంటూ ఎన్నికల్లో ప్రకటనలు గుప్పించారు. టీడీపీ సర్కారు వచ్చాక కొత్తవి ఇవ్వడం స్థ 2007 నుంచి 149 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారు. టెక్నికల్ ఉద్యోగులకు నెలకు రూ.9 వేలు, నాన్‌టెక్నికల్ ఉద్యోగులకు రూ.7,500 చొప్పున వేతనం ఇచ్చేవారు. 2014 అక్టోబర్ 14 నుంచి 70మంది వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగించారు. ఆదర్శరైతులదీ ఇంటిదారే: జిల్లాలో 2007-08లో 2,365 మంది ఆదర్శరైతులను నియమించారు. 2014 -15 నాటికి వీరి సంఖ్య 1551 మందికి పడిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 జూన్‌లో వారందరినీ విధుల నుంచి తొలగించారు. అంగన్వాడీలకు పదవీ విరమణ: టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ టీచరుకు రూ.7వేల వరకు, ఆయాకు రూ.4,700 వేతనం ఇస్తామని చెప్పింది. మినీ అంగన్వాడీల్లో పనిచేసే టీచరుకు రూ.6,400 ఇస్తామని, సెప్టెంబర్ నుంచి ఈ వేతనాలు అమలుచేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే పెంచిన వేతనం ఇవ్వకపోగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ వయసు ప్రకటించారు. జిల్లాలో 135మంది టీచర్లు, 65 మంది ఆయాలను తొలగించారు. గాలిలో ఫీల్డు అసిస్టెంట్లు :జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 167 మంది ఫీల్డు అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం గాలిలో పెట్టింది. 7వేల పనిదినాలు లక్ష్యం చేరుకోలేదని కొంతమందిని, సక్రమంగా పనిచేయడం లేదని మరికొందరిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోంది. సీఎస్పీలూ ఇంటికే: జిల్లావ్యాప్తంగా 1100 మంది కష్టమర్ సర్వీస్ ప్రొవైడర్లు (సీఎస్పీ)లను ప్రభుత్వం తొలగించింది. వారు గ్రామాల్లో, పట్టణాల్లో లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు అందజేసేవారు. -
83 వేల ఇండ్లు రద్దు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో వివిధ స్కీముల కింద మంజూరైన 83,768 ఇండ్లను రద్దు చేసేందుకు గృహనిర్మాణ సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం మూ డు విడతలతో పాటు రచ్చబండ తదితర పథకాల కింద మంజూరై.. లబ్ధిదారులు ఇంకా నిర్మాణం మొదలు పెట్టని ఇండ్లను రద్దు చేయనున్నారు. 125 గజాల స్థలంలో రూ.3.50 లక్షల వ్యయంతో రెండు పడక గదులతో కూడిన పక్కాఇండ్ల నిర్మాణం పథకం త్వరలోనే ప్రారంభించనున్న నేపథ్యంలో తాజాగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ జిల్లాల గృహనిర్మాణ సంస్థ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు మార్గదర్శకాలను సూచించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 83,768 ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారులకు సమాచారం అందించి వాటిని రద్దు చేసేందుకు గృహనిర్మాణ సంస్థ అధికారులు రెండు రోజుల్లో కసరత్తు పూర్తి చేయనున్నారు. లబ్ధిదారుల్లో కలకలం మంజూరైనా నిర్మాణం మొదలెట్టని ఇండ్లను రద్దు చేయాలన్న ప్రభుత్వం యోచన ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల్లో కలకలం రేపుతోంది. 2006 సంవత్సరంలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ప్రారంభం కాగా మూడు విడతల్లో జిల్లాలోని అర్హులైన పలువురు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఇందిరమ్మ మూడు విడతలకు తోడు రచ్చబండ, ఇందిరా అవాస్ యోజన తదితర పథకాల కింద కూడ ఇండ్లు మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తంగా ఇప్పటి వరకు ఈ పథకాల కింద 2,42,255 ఇండ్లు మంజూరు కాగా 1,29,202 మాత్రమే పూర్తయ్యాయి. పునాదుల నుంచి రూఫ్, రెంటల్ లెవెల్లో 29,285 ఇండ్ల నిర్మాణం ఉంటే, 83,768 మంది లబ్ధిదారులు అసలే ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించ లేదు. ఇందులో మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులు 5,750 మంది ఉండగా, రెండో విడతలో 14,532 మంది ఉన్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇందిరమ్మ మూడో విడతతో పాటు రచ్చబండ-1, 2 విడతలు, ఇతర స్కీముల కింద మంజూరైన మరో 63,486 మంది సైతం ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టలేదు. ఇదిలా ఉండగా ఇండ్లు మంజూరైనా కనీసం పునాదులు కూడ తీయని లబ్ధిదారులకు చెందిన ఇండ్లను రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో జిల్లాలో మొత్తంగా 83,768 మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను అసలే మొదలు పెట్టలేదని తేల్చిన అధికారులు ప్రభుత్వానికి సమర్పించేందుకు నివేదిక సిద్ధం చేశారు. రెండు పడక గదుల పక్కాఇండ్లు ఎప్పుడో? ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు జిల్లాలో 83,768 ఇండ్లు రద్దుకానుండగా, 125 గజాల్లో రూ.3.50 లక్షల వ్యయంతో రెండు పడక గదులతో నిర్మిస్తామన్న పక్కాఇండ్లు ఎప్పుడు మంజూరవుతాయన్న చర్చ సాగుతోంది. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న రెండు పడక గదులు, ఓ వంటగది, బాత్రూమ్తో కూడిన పక్కాఇండ్ల కోసం అర్హులైన పేదలు కలలు కంటున్నారు. గతంలో ఇండ్లు మంజూరైనా నిర్మాణాలు చేపట్టలేదని రద్దు చేస్తున్నా.. కొత్తగా ప్రారంభించే పక్కాఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. ఇప్పటి వరకు ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్లను ప్రస్తుతం 240 చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 16 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో నిర్మించే ఈ ఇళ్లపై ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీయేతరులకు రూ.70 వేలు చెల్లిస్తుంది. షెడ్యూల్ తెగలకు రూ.1.05 లక్షలు, షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు రూ.1లక్ష వివిధ దశలు, రూపాల్లో చెల్లిస్తోంది. అయితే కొత్తగా మంజూరు చేసే ఇండ్ల కోసం 125 గజాల స్థలం కేటాయించడంతో పాటు రూ.3.50 లక్షలు ఖర్చు చేయనుండటంతో అందరూ ప్రభుత్వ ప్రకటన కోసమే ఎదురు చూస్తున్నారు. -
ఇల్లు రాసుకోండి.. పైసల్ తీసుకోండి!
సిద్దిపేట, న్యూస్‌లైన్: పేదలు మరీ ముఖ్యంగా బడుగూ, బలహీన వర్గాల్లో సొంత గూడంటూ లేని వారి కోసం ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ ద్వారా పక్కా ఇళ్లు కట్టిస్తోంది. గత సంవత్సరం వరకు ఒక్కో ఇల్లుకు రూ.42 వేలు చెల్లించింది. స్టీలు, సిమెంటు, ఇసుక వంటి ప్రధాన సామగ్రి ధరలకు రెక్కలు రావడంతో ఆ మొత్తాన్ని దాదా పు రెట్టింపు చేస్తూ సవరించింది. రాయితీ గృహాలకు పెంచిన ఆర్థిక సహాయాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తోంది. సిద్దిపేట నియోజవకర్గంలోని సిద్దిపేట అర్బన్, రూ రల్, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో కలిపి ‘ఇందిరమ్మ ఇల్లు’ పేరిట మొత్తం రెండు వేల పక్కా గృహాలను సర్కారు ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మంజూరు చేసింది. ‘అదనం’లోనే అక్రమాలు! గత ఏడాదిలో జీఓ నంబర్ 171 ద్వారా అదనపు ఇళ్లను గృహ నిర్మాణ శాఖ మంజూరు చేసింది. వాటిల్లో కొన్నిచోట్ల అక్రమాలు కూ డా ‘అదనం’గానే జరిగాయని తెలుస్తోంది. చి న్నకోడూరు మండలం రామంచలో ఓ వ్యక్తిని లబ్ధిదారుగా జాబితాలో పేర్కొన్నారు. నిజానికి అతడు ఆ ఊరిలోనే నివాసం ఉండడం లేదు. అక్కడాయనకు ఇల్లు కూడా లేదు. ఆ గ్రామానికి శనివారం వెళ్లి వాకబు చేసిన ‘న్యూస్‌లైన్’కు ఈ విషయం ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అలాంటి అక్రమ లబ్ధిదారుడికి విడతలవారీగా రూ.42 వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. అలా...మూడు దఫాలుగా బిల్లులు ఇచ్చినట్లు సమాచారం. చివరి ఇన్స్టాల్మెంటు గత ఫిబ్రవరి 11న విడుదల చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కొందరికి కల్పతరువు. నియోజవకర్గంలోని కొన్ని గ్రామాల్లో పలుకుబడిగల కొందరు వ్యక్తులకు గృహ నిర్మాణ శాఖ కల్పతరువుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు అధికారులతో చేతులు కలిపి...తమ విలాసవంతమైన జీవన వ్యయానికి వీలునుబట్టి బినామీ/బోగస్ పేర్లతో పక్కా గృహాలు నిర్మించినట్లు రికార్డులు సృష్టింపజేసి యథేచ్ఛగా డబ్బులు కాజేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది బహిరంగ రహస్యేమనని, సదరు అధికారులు, వ్యక్తులను ఎవరూ ఏమీ చేయలేరని కొందరు స్థానికులు ‘న్యూస్‌లైన్’తో పేర్కొనడం గమనార్హం. గృహ నిర్మాణాల్లో అక్రమాల బాగోతం ఆరోపణలపై చిన్నకోడూరు హౌసింగ్ ఏఈ మహేందర్ వివరణ కోసం ‘న్యూస్‌లైన్’ శని, ఆదివారాల్లో పలుమార్లు ప్రయత్నించింది. ఆయన సెల్‌ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. మా దృష్టికి రాలేదు... పక్కా ఇళ్లల్లో అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి రాలేదు. అసలు అలా జరిగేందుకూ ఆస్కారమే లేదు. అలాంటివి ఎక్కడైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. చర్యలు తీసుకుంటాం. డబ్బులు రికవరీ చేస్తాం. అయినా...చిన్నకోడూరుకు సంబంధించి మీరు (న్యూస్లైన్ను ఉద్దేశిస్తూ) ఏఈని అడగాల్సింది. -సత్యనారాయణ, డీఈఈ, హౌసింగ్, సిద్దిపేట కొసమెరుపు..! డీఈఈని వివరణ కోసం ఫోన్లో ‘న్యూస్‌లైన్’ శనివారం సాయంత్రం సంప్రదించిన కొద్దిసేపట్లోనే సదరు అక్రమ లబ్ధిదారుడికి తెలిసిపోయింది. ఆయన క్షణాల్లోనే తేరుకొని గ్రామంలోనూ, ఇతరత్రా ఆరా తీయడం గమనార్హం. అంటే దీన్నిబట్టి కొందరు అధికారుల పాత్రపైనా అనుమానాలు మొలకెత్తుతున్నాయి.