Huda Colony
-
Hyderabad: చిట్టి ఇన్ టౌన్.. రోబో@ రెస్టారెంట్
ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మనిషి జీవనశైలిలోనే కాదు ఆతిథ్య రంగంలోనూ మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో వెయిటర్లు వడ్డిస్తే తినడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు. దీంతో ఓ రెస్టారెంట్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించి వెయిటర్ల స్థానంలో రోబోలను తీసు కొచ్చారు. వినియోగదారులు ఇచ్చే ఆర్డర్లను తీసుకొని సర్వ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సరూర్‌నగర్ హూడాకాంప్లెక్స్లోని ‘చిట్టి ఇన్ టౌన్’ రోబో రెస్టారెంట్ వేదికగా మారింది. సాక్షి, హుడాకాంప్లెక్స్: కరోనాకు భయపడి చాలా మంది రెస్టారెంట్ ఫుడ్‌కు దూరంగా ఉంటున్నారు. ఫుడ్ సర్వ్ చేసే వాళ్లకి కరోనా లక్షణాలు ఉంటే తమకు ఎక్కడ సోకుతుందోనని ప్రజలు హోటల్, రెస్టారెంట్‌కి వెళ్లడానికి జంకుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మలక్‌పేట్‌కు చెందిన మణికాంత్‌గౌడ్ వినూత్నంగా ఆలోచించాడు. వెయిటర్ల స్థానంలో రోబోలను పెట్టి ఫుడ్ సర్వ్ చేసేలా.. ఆర్డర్ తీసుకునేలా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాలని పూనుకున్నాడు. కొత్తపేట్‌లోని హుడాకాంప్లెక్స్‌లో ‘చిట్టి ఇన్ టౌన్’పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు రోబోలను అందుబాటులో ఉంచారు. రెస్టారెంట్‌కు వచ్చే వారి ఆర్డర్లు తీసుకోవడం.. వచి్చన ఆర్డర్లను షెఫ్‌కు అందజేయడం... ఆహారం రెడీ అయిన తర్వాత ఆహారప్రియులకు వడ్డిస్తున్నాయి. అంతే కాకుండా తిన్న తరువాత ప్లేట్లను తీసుకెళ్లి శుభ్రం చేయడం.. బిల్లు జారీ చేయడం.. కస్టమర్ ఇచ్చిన డబ్బులను తీసుకెళ్లి కౌంటర్లో జమ చేయడం పనులన్నీ రోబోలే చేస్తుండటం విశేషం. రోబోలు చేస్తున్న ఈ పనులను చూసి కస్టమర్లు మంత్రముగ్ధులవుతున్నారు. మరో రోబో వచ్చి రెస్టారెంట్‌కు వచ్చిన వారితో ముచ్చటిస్తుంది. వచి్చన వారికి బోరు కొట్టకుండా చూస్తూ అతిథులను అమితంగా ఆకట్టుకుంటోంది. మంచి ఆదరణ.. కోవిడ్భయంతో రెస్టారెంట్‌కు రావడానికి జనాలు భయపడేవారు. నలుగురు మిత్రులం కలిసి వినూత్నంగా ఈరెస్టారెంట్ను ప్రారంభించాం. ఇప్పటికే మేం రోబోటిక్ కోర్సులను పూర్తి చేసి ఉండటంతో రోబోల తయారీ, పనితీరుపై మాకు అవగాహన ఉంది. ఇది మాకు కలిసి వచ్చింది. వీటిని చూసేందుకు చాలా మంది వస్తున్నారు. 120 సీటింగ్ సామర్థ్యం ఉన్నరెస్టారెంట్కు రావాలంటే ఆన్లైన్ బుకింగ్ తప్పని సరి. నేరుగా వచ్చేవారు వేచిఉండాల్సి ఉంటుంది. ఈ రోబోలతో రెస్టారెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. – మణికాంత్ గౌడ్, రెస్టారెంట్ యజమాని -
హుడా కాలనీలో దారుణం
హైదరాబాద్: చందానగర్ హుడా కాలనీలో పాత భవనం కూల్చివేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్లాబు ఒక్కసారిగా కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న భవన నిర్మాణ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ హఫీజ్‌పేట్ డివిజన్లోని హుడాకాలనీలో నివాసముండే రాంచందర్ తన ఇంటిని పునర్నిర్మాణం చేయడానికి కూల్చివేసే పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాంట్రాక్టర్ యాదగిరి ఐదుగురు కూలీలతో పురాతన భవనాన్ని పనులను ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మాల్యాల సాదుతండాకు చెందిన వీరన్న (45), జనగామవాసి సిద్దులు (30) పాపిరెడ్డి కాలనీలో నివాసముంటూ, కూలి పనులను చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు మరో ముగ్గురితో కలసి కూల్చివేతలు చేపట్టారు. సాయంత్రం 4.30 ప్రాంతంలో ప్రమాదవశాత్తూ గోడ, స్లాబు కుప్పకూలిపోయాయి. గోడ పక్కనే ఉన్న వీరన్న తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడే ఉన్న సిద్దులుకు తీవ్ర గాయాలయ్యాయి. జీహెచ్ఎంసీ అధికారులు గాయపడిన సిద్దులును స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతుడు వీరన్నకు భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సిద్దులుకు భార్య యాదమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. అనుమతి లేకుండానే పురాతన భవనాన్ని కూల్చివేసే పనులను యజమాని చేపట్టినట్లు జీహెచ్ఎంసీ అధికారులు నిర్ధారించారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ పరిశీలించారు. బాధితులను పరామర్శించి, ప్రభుత్వం ద్వారా పూర్తి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన మృతుడు వీరన్న కుటుంబసభ్యులు ఘటనా స్థలం వద్ద ఆందోళన చేపట్టారు. పెద్ద దిక్కు కోల్పోయి పిల్లలతో ఎలా బతకాలని మృతుడి భార్య, పిల్లలు రోదించడం అందరినీ కలచి వేసింది. నిరుపేదలైన వీరన్న కుటుంబసభ్యులను ప్రభుత్వం, ఇంటి యజమాని ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. -
చందానగర్ హుడా కాలనీలో విషాదం