huge funds
-
కీలక రైల్వే ప్రాజెక్టులు కొలిక్కి..
సాక్షి, హైదరాబాద్: వరసగా రెండేళ్లలో కేంద్రప్రభుత్వం కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తుండటంతో వాటి పనులు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తూ కొత్త బడ్జెట్ కాలపరిధిలో వాటిని పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో రాష్ట్రంలో మెదక్–అక్కన్నపేట, మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను రైల్వే శాఖ పూర్తి చేసి అందుబాటులోకి తెచి్చంది. కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన గుంటూరు–బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో పట్టాలెక్కించింది. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరపు పూర్తి కాల బడ్జెట్లో ఆ నిధులను కొంత సవరించే అవకాశం ఉంది. ఆ నిధులతో అవి ఈ ఆర్థిక సంవత్సరంలో తుదిదశకు చేరే అవకాశం ఉంది. కాజీపేట–బల్లార్షా మూడో లైన్ పనుల్లో వేగం ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే ప్రధాన లైన్లో ఇది కీలకం. నిత్యం 275 వరకు ప్రయాణికుల రైళ్లు, 180 వరకు సరుకు రవాణా రైళ్లు పరుగుపెట్టే ఈ మార్గంలో మూడో లైన్ అత్యవసరం. అది అందుబాటులోకి వస్తే కనీసం మరో 150 రైళ్లను కొత్తగా నడిపే వీలు చిక్కుతుంది. ఈ మార్గంలో తెలంగాణకు సంబంధించి దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు.ఇందులో మహారాష్ట్ర– తెలంగాణల్లో కొనసాగే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. గత రెండేళ్లుగా పనుల్లో వేగం కారణంగా చాలా సెక్షన్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 151కి.మీ. పనులు పూర్తయ్యాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి ఆ మొత్తాన్ని కొంత సవరించే అవకాశం ఉంది.కాజీపేట– విజయవాడ మూడో లైన్ పనులకూ మోక్షం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఆ ప్రాజెక్టు ఎట్టకేలకు 2012–13లో మంజూరైంది. కానీ, పనుల నిర్వహణ మాత్రం మందకొడిగా సాగుతూ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. కానీ, గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుకు ఏకంగారూ.647 కోట్లçను కేటాయించటంతో ఎట్టకేలకు ప్రాజెక్టు ఓ రూపునకు వచి్చంది. పూర్తి నిడివి 219 కి.మీ. ఇప్పటివరకు 100కి.మీ. పనులు పూర్తయ్యాయి. దీని అంచనా వ్యయం రూ.1,952 కోట్లు.’మనోహరాబాద్–కొత్తపల్లి’.. వచ్చే ఏడాదికి కొలిక్కిసిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ. కాగా ఇప్పటి వరకు 76 కి.మీ. పనులు పూర్త య్యాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1375 కోట్లు. గతేడాది బడ్జెట్లో దీనికి రూ.185 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.350 కోట్లు ప్రతిపాదించారు. నిధులకు కొరత లేనందున వచ్చే ఏడాది కాలంలో పనులు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ’బీబీనగర్– గుంటూరు’ పనులు ఇక స్పీడే సికింద్రాబాద్–విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ లైన్ గా నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. రూ.2,853 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గత మధ్యంతర బడ్జెట్లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పను లు మొదలయ్యాయి. -
ఏపీలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు.. భారీగా నిధులు కేటాయింపు
సాక్షి, అమరావతి: ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రూ.309.87 కోట్లు కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్లైన్ల ఏర్పాటు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు వచ్చే 6 నెలలకు రూ.60 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. కోవిడ్ వైద్యానికి ఆక్సిజన్ సరఫరా కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని ఆయన పర్యవేక్షిస్తారు. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాపై కరికాల వలవన్ దృష్టిసారించనున్నారు. చదవండి: మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ ఏపీ: 9 మందితో ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ -
వచ్చే ఏడాదిలోనే అందరికీ వ్యాక్సిన్
న్యూయార్క్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిరోధించేందుకు పలు దేశాల్లో జరుగుతున్న వ్యాక్సిన్ పరీక్షలు కీలక దశకు చేరాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే కోట్లాది అమెరికన్లకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు అగ్రరాజ్యం భారీ కసరత్తు చేపట్టింది. మోడెర్నా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు భారీగా నిధులు సమకూర్చాలని అమెరికా నిర్ణయించింది. మానవులపై వ్యాక్సిన్ తుది దశ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవడంతో 7500 కోట్ల రూపాయల వరకూ ఈ వ్యాక్సిన్‌పై అమెరికా ప్రభుత్వం వెచ్చించనుందని మోడెర్నా బయాటెక్నాలజీ కంపెనీ వెల్లడించింది. దీంతో రెండు విడతలుగా ఈ వ్యాక్సిన్‌కు అమెరికా 7500 కోట్ల రూపాయలు సమకూర్చినట్లయింది. చదవండి : దేశంలో వ్యాక్సిన్ పరీక్షల జోరు గతంలో 483 మిలియన్ డాలర్ల నిధులను ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఆ నిధులను రెట్టింపు చేయడంతో మొత్తం పెట్టుబడులు రూ 7500 కోట్లకు చేరాయి. తమ వ్యాక్సిన్ మూడవ దశ పరీక్షలను ప్రభుత్వంతో కలిసి 30,000 మంది వాలంటీర్లపై నిర్వహించాలని నిర్ణయించిన క్రమంలో అదనపు నిధులు ఉపకరిస్తాయని మోడెర్నా తెలిపింది. గతంలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో మోడెర్నా వ్యాక్సిన్ వాలంటీర్లలో కరోనా వైరస్ యాంటీబాడీలను ప్రేరేపించినట్టు వెల్లడైంది. వారిలో ఈ వైరస్‌ను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించినట్టు తేలింది. ఇక సోమవారం నుంచి ప్రారంభమైన తుది దశ పరీక్షలో పాల్గొనే 30,000 మందిలో 15,000 మందికి వ్యాక్సిన్ 100 మెక్రోగ్రామ్ డోస్ ఇవ్వనుండగా, మిగిలిన వారికి ప్లాసెబో ఇస్తారు. కోవిడ్-19తో అమెరికా తీవ్రంగా ప్రభావితమవడంతో వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికాలో ఇప్పటికే 1,46,000 కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. -
బీసీలకు వెయ్యి కోట్లు కేటాయించాలి: ఆర్ కృష్ణయ్య
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో బీసీలకు రూ. 50వేల కోట్లు కేటాయించాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29 రాష్ట్రాలకు వెయ్యి కోట్లు ఏం సరిపోతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ను ప్రశ్నించారు. తాజాగా చేపట్టిన జనాభా లెక్కల సేకరణలో బీసీల గణనను కూడా చేర్చాలని కోరారు. చట్ట సభల్లో సాధారణ బీసీ రిజర్వేషన్లను 50శాతం పెంచాలని విజ్ఞప్తి చేశారు. తాజా జనాభా లెక్కల సేకరణ పత్రం నమూనా కాలమ్‌లో బీసీల వివరాలకు సంబంధించిన కాలమ్ ఎందుకు లేదని ప్రశ్నించారు. తమ 18 డిమాండ్లపై పార్టీలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని జేపీ నడ్డా, కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ హామీ ఇచ్చినట్లు బీసీ సంఘ నాయకులు తెలిపారు. -
మూడు హామీలు..ముక్కచెక్కలు
సాక్షి, గుంటూరు : రాష్ట్ర రాజధాని ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు సార్లు వచ్చి ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మారాయి. 2–10–2015న ఆస్పత్రికి వచ్చిన సీఎం మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ వార్డు(ఎంసీహెచ్ వార్డు) నిర్మాణానికి శిలాఫలకం వేశారు. మూడేళ్లపాటు ఎంసీహెచ్ వార్డు నిర్మాణం ప్రారంభం కాలేదు. మళ్లీ 2018 డిసెంబర్ 19న చంద్రబాబు రెండోసారి ఎంసీహెచ్ వార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పుడు కూడా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. భవనాల కోసం తవ్విన గోతులు మాత్రం పెద్ద అగాధంలా ప్రభుత్వ అసమర్థతను వెక్కిరిస్తున్నారు. మరో వైపు సీఎం ప్రారంభించిన శిలాఫలకాలు సైతం అదృశ్యమయ్యాయి. ఎంసీహెచ్ వార్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో బాలింతలు, గర్భిణులు నాలుగేళ్లుగా ఆస్పత్రిలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇలా సీఎం చేతుల మీదుగా రెండుసార్లు శంకుస్థాపనలు అయిన భవన నిర్మాణాలే నేటికీ ప్రారంభం కాకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం రూ. 20 కోట్లు 2014లో విడుదల చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు, గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో రూ.30 కోట్లు ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం ఇచ్చారు. సుమారు రూ.65 కోట్లు ఎంసీహెచ్ వార్డు నిర్మాణానికి సమకూరాయి. కానీ వార్డు పనుల్లో మాత్రం పురోగతి లేదు. పెద్దాస్పత్రికి కాన్పు కోసం వచ్చే గర్భిణులు, బాలింతలు మాత్రం మంచాలు చాలక అల్లాడిపోతున్నారు. మూడు హామీలు.. ఒక్కటీ నెరవేరలేదు... గుంటూరులోని జీజీహెచ్‌లో మాతాశిశు వార్డు నిర్మాణానికి 2015లో సీఎం చంద్రబాబు తొలిసారి శంకుస్థాపన చేశారు. వార్డు నిర్మాణం కోసం అప్పుడు తీసిన అగాధాలు.. మూడేళ్లపాటు సీఎం సారూ.. ఎక్కడ నిర్మాణమంటూ ప్రశ్నిస్తూనే ఉన్నాయి. మళ్లీ 2018లో శంకుస్థాపన చేశారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాదిలోపు భవనాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నడిబొడ్డున ఖాళీ స్థలంలో పెద్ద పెద్ద అగాధాలు చేశారు. అనంతరం నిర్మాణ పనులను మాత్రం అలాగే వదిలేశారు. వార్డు నిర్మాణానికి దాతలు ముందుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం అందింది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం దాటి ఎంసీహెచ్ వార్డు నిర్మాణానికి ఒక్క ఇటుకా పడలేదు. మాతా శిశు వార్డు కథ మారలేదు. గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే సహృదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా నాలుగు గుండె మార్పిడి ఆపరేషన్లను జీజీహెచ్‌లో నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబు ఆస్పత్రికి వచ్చి గుండె మార్పిడి ఆపరేషన్లను ఎన్టీఆర్ వైద్యసేవలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇది నమ్మిన గుండె జబ్బుల రోగులు జీజీహెచ్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం గుండె మార్పిడి ఆపరేషన్లకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు. దీంతో సహృదయ ట్రస్ట్‌కు కూడా తాము ఆపరేషన్లు చేయలేమని ప్రకటించింది. ఆపరేషన్లకు బ్రేక్ పడింది. జీజీహెచ్‌లో పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా నూతన భవన నిర్మాణాల కోసం గుంటూరులోని బొంగరాల బీడులో స్థలం కేటాయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తీరా చూస్తే ఆ స్థలాన్ని కార్మిక శాఖకు కేటాయిస్తున్నట్లు జీవో ఇచ్చారు. దీంతో నూతన వార్డుల నిర్మాణం అటకెక్కింది. ఇలా సవాలక్ష మెలికలు పెట్టి.. ఈ హామీకీ ఘోరీ కట్టారు. పేదల ఆస్పత్రి అభివృద్ధికి చంద్రబాబు ఇచ్చిన మూడు హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. రోగుల కష్టాలు ఒక్కటీ తీరలేదు. సీఎం తీరుపై జిల్లా వాసులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బొంగరాలబీడులో జీజీహెచ్ వార్డుల నిర్మాణానికి సీఎం ప్రకటించిన స్థలం గుండె మార్పిడి ఆపరేషన్లకు నిధులు లేవు గుంటూరు జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు నిధులు ఇస్తామని చంద్రబాబు 2015లో హామీ ఇచ్చారు. ఆస్పత్రికి వచ్చి గుండె జబ్బు రోగులను పరామర్శించి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా గుండె మార్పిడి ఆపరేషన్లు జీజీహెచ్‌లో ఉచితంగా చేస్తున్నారని, ప్రజలు వినియోగించుకోవాలని చెప్పారు. ఆయన మాటలు నమ్మి సుమారు 25 మంది గుండె జబ్బు రోగులు ఆపరేషన్ల కోసం గుంటూరు జీజీహెచ్‌లో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. సహృదయ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా 2016 నుంచి 2018 వరకు నలుగురికి గుండె మార్పిడి ఆపరేషన్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఆయన ఆపరేషన్లను నిలిపివేశారు. గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం పేర్లు నమోదు చేయించుకున్న వారు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో గుండె మార్పిడి ఆపరేషన్లకు రూ.15 లక్షలు ఇస్తున్నామని పోస్టర్లు ముద్రించి ప్రచారం చేసుకుంటున్నారు. జీజీహెచ్‌కు ప్రతి రోజూ ఓపీ : 4 వేలు ప్రస్తుతం ఉన్న పడకలు : 1177 కావాల్సిన పడకలు :560 జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు : 4 గుండె మార్పిడికి ఎదురు చూస్తున్న వారు : 25 మంది -
రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చిన్నగోల్కొండ రహదారి పనులను ప్రారంభం శంషాబాద్ రూరల్: రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తుందని, జిల్లాలో ఆర్అండ్బీ రోడ్ల కోసం రూ.4వేల కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని చిన్నగోల్కొండ రోడ్డు వెడల్పు, రీబీటీ పనులకు ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల అభివృద్ధి కోసం జిల్లాలో రూ.385 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. జిల్లాలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో సమృద్ధిగా వర్షాలు కురవడంలేదని, హరితహారంతో పచ్చదనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాలు కురిస్తే చెరువులు, కుంటల్లోకి వరదనీరు చేరి సాగునీటికి ఇబ్బందులు తొలగిపోతాయని మంత్రి తెలిపారు. చిన్నగోల్కొండ రోడ్డు కోసం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో రూ.4.07 కోట్లు మంజూరు అయినట్లు చెప్పారు. రోడ్డు పనులు పూర్తయితే వాహనదారులు, స్థానికులకు ఇబ్బందులు తప్పుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బూర్కుంట సతీష్, సర్పంచులు దౌనాకర్‌గౌడ్, సువర్ణ, సిద్దులు, ఎంపీటీసీ సభ్యురాలు మణెమ్మ, ఇస్తారి, నాయకులు చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే.. వెవ్వే..
- పుష్కరాలను పట్టించుకోని రైల్వే శాఖ - తరుముకొస్తున్న గడువు - పట్టించుకోని ఎంపీలు నరసాపురం అర్బన్ : గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నాయి. ఈ ఏడాది అంచనాలకు మించి భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడం కలవరపెడుతోంది. పుష్కరాలు సమీపిస్తున్నా రైల్వే శాఖలో అధికారుల్లో ఇంతవరకూ చలనం కనిపించడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఇబ్బంది కలగకుండా రైల్వే శాఖ ఏం చేయబోతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని ఎంపీల తీరు కూడా అదే చందంగా ఉంది. పుష్కర స్నానాలు ఆచరించేందుకు జిల్లాలోని కొవ్వూరు తరువాత నరసాపురం పట్టణానికి యాత్రికులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. కొవ్వూరు, నరసాపురం, పోలవరం, తాళ్లపూడి, పెనుగొండ, ఆచంట, యలమంచిలి మండలాల్లో పుష్కర స్నాన ఘట్టాలున్నాయి. ఈ ప్రాంతాలకు భక్తులు చేరుకోవాలంటే నిడదవోలు, కొవ్వూ రు, పాలకొల్లు, నరసాపురం ప్రాం తాలు ముఖ్యమైనవి. ఇంత ప్రాముఖ్యత గల ైరె ల్వే స్టేషన్లలో సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. సాధారణ రోజుల్లోనే అరకొర వసతులతో నెట్టుకొస్తున్న ఈ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుష్కర పర్వంలో అసంఖ్యాకంగా వచ్చే భక్తులకు ఇప్పుడున్న సౌకర్యాలను నాలుగైదు రెట్లు పెంచితేనే గాని సరిపోని పరిస్థితి. ఈ విషయంలో రైల్వే శాఖ ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తోంది. ఇతర శాఖల పుష్కరాల నేపథ్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, యాత్రికులకు సౌకర్యాల కోసం నిధులు మంజూరయ్యాయని, పనులు ప్రారంభిస్తున్నామని ప్రకటనలైనా ఇస్తున్నాయి. రైల్వే శాఖ నుంచి పుష్కరాలపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. మూడు నెలల క్రితం జిల్లాలోని వివిధ రైల్వే స్టేషన్లను పరిశీలించేందుకు వచ్చిన రైల్వే డీఆర్ఎం పుష్కరాల నేపథ్యంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేస్తామని ప్రకటించారు. ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అన్నీ సమస్యలే.. మెయిన్‌లైన్, బ్రాంచ్ లైన్లకు సంధానకర్తగా ఉన్న నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్లో సమస్యలు కూత పెడుతున్నాయి. జిల్లాలో ఇది కీలకమైన రైల్వే స్టేషన్. నిత్యం ఈ స్టేషన్ మీదుగా 200 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్లో విశ్రాంతి భవనం, టాయ్‌లెట్స్, మంచినీటి సదుపాయాలు అరకొరగా ఉన్నాయి. పుష్కరాల నేపథ్యంలో వీటి సంఖ్యను మూడు రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. స్టేషన్లో పార్కింగ్ సదుపాయం అంతంత మాత్రంగానే ఉంది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తామని ఎంతోకాలంగా రైల్వే శాఖ ఊరిస్తూ వస్తోంది. కొవ్వూరు రైల్వే స్టేషన్‌కు సంబంధించి ఒక ప్లాట్‌ఫామ్‌పై ఆరు, మరో ఫ్లాట్‌ఫాంపై మూడు టాయ్‌లెట్స్ ఉన్నా యి. స్టేషన్లో ఉన్న ఏకైక విశ్రాంతి భవనం మూతపడింది. స్టేషన్లో అదనంగా షెడ్లు, టాయ్‌లెట్స్, మంచినీటి వసతి కల్పించాల్సి ఉంది. ప్రతిరోజు ఈ స్టేషన్ నుంచి 40 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. పుష్కరాలకు జిల్లాలో కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేస్తారు. నరసాపురం రైల్వేస్టేషన్ ఒక విధంగా జిల్లాలోనే పెద్దది. విజయవాడ తర్వాత కోచ్‌ల నిర్వహణ ఈ స్టేషన్లోనే జరుగుతుంది. అభివృద్ది విషయంలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. స్టేషన్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. ఏడాది క్రితం నిర్మించిన టాయిలెట్స్ పనిచేయడం లేదు. పుష్కరాల నాటికి అదనంగా మరో రెండు టాయిలెట్స్ నిర్మించాల్సి ఉంది. ప్రతిరోజూ స్టేషన్లో 300కు పైగా రిజర్వేషన్లు జరుగుతుంటాయి. సింగిల్ రిజర్వేషన్ కౌంటర్ మాత్రమే పని చేస్తోంది. మంచినీటి సౌకర్యానికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్టేషన్లో మరో ప్రధాన సమస్య ఫిట్‌లైన్ విస్తరణ. ఇది చివరి స్టేషన్ కావటం వల్ల ఫిట్‌లైన్ విస్తరణ జరగకపోవడంతో రైళ్లను ట్రాక్ మీదకు తీసుకొచ్చేందుకు గంటల తరబడి షంటిగ్ చేయాల్సి వస్తోంది. ఫిట్‌లైన్ విస్తరణ చేయకపోతే ఇక్కడి నుంచి కొత్త రైళ్లు గానీ, తాత్కాలికంగా రైలు సర్వీస్‌లను పెంచడంగానీ కుదరదు. ఈ సమస్యలపై రైల్వేశాఖ నోరు మెదపటం లేదు. పట్టించుకోని ఎంపీలు రాజమండ్రికి సంబంధించి అక్కడి ఎంపీ మాగంటి మురళీమోహన్ రైల్వేశాఖ ద్వారా పుష్కర అబివృద్ధి పనులు చేయించుకోవడంలో మొదటి నుంచీ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఎంపీగా ఎన్నికైన నాటి నుంచే రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకువచ్చి భారీగా నిధులు రప్పించడంలో విజయవంతమయ్యారు. ఇప్పటికే రాజమండ్రి రైల్వే అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం కాగా, కొన్ని పనులు కూడా ప్రారంభమయ్యాయి. మన జిల్లా ఎంపీలు ఇంతవరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే జిల్లాలో రైల్వే శాఖ ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఈ వారంలో విజయవాడలో కీలక సమావేశం జరగనుందని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ సమావేశంలో అయినా జిల్లాలో రైల్వేశాఖ ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఓ ప్రణాళిక రూపొందే దిశగా జిల్లాలోని ఎంపీలు కృషి చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.