రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
చిన్నగోల్కొండ రహదారి పనులను ప్రారంభం
శంషాబాద్ రూరల్: రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తుందని, జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్ల కోసం రూ.4వేల కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని చిన్నగోల్కొండ రోడ్డు వెడల్పు, రీబీటీ పనులకు ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల అభివృద్ధి కోసం జిల్లాలో రూ.385 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. జిల్లాలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో సమృద్ధిగా వర్షాలు కురవడంలేదని, హరితహారంతో పచ్చదనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాలు కురిస్తే చెరువులు, కుంటల్లోకి వరదనీరు చేరి సాగునీటికి ఇబ్బందులు తొలగిపోతాయని మంత్రి తెలిపారు. చిన్నగోల్కొండ రోడ్డు కోసం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో రూ.4.07 కోట్లు మంజూరు అయినట్లు చెప్పారు. రోడ్డు పనులు పూర్తయితే వాహనదారులు, స్థానికులకు ఇబ్బందులు తప్పుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బూర్కుంట సతీష్, సర్పంచులు దౌనాకర్‌గౌడ్, సువర్ణ, సిద్దులు, ఎంపీటీసీ సభ్యురాలు మణెమ్మ, ఇస్తారి, నాయకులు చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.