humshakals
-
పాఠం నేర్చుకున్నా!
.‘‘ఇప్పుడు నా కెరీర్‌కి ఏది వర్కవుట్ అవుతుంది? ఏది కాదు? అనే విషయంలో నాకు పూర్తి అవగాహన వచ్చేసింది. అందుకే, ఇకనుంచి సినిమాల ఎంపిక విషయంలో నేను మరింత జాగ్రత్తపడతా’’ అని తమన్నా అంటున్నారు. ఈ మిల్క్ బ్యూటీ ఇలా అనడానికి కారణం హిందీ చిత్రాలు. తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని తారగా కొనసాగుతున్న తమన్నా కెరీర్ హిందీ రంగంలో మాత్రం ఆశించిన విధంగా సాగలేదు. హిందీలో చేసిన ‘హిమ్మత్వాలా’, ‘హమ్ షకల్స్’, ‘ఎంటర్టైన్మెంట్’ చిత్రాలు తమన్నా కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. ఆ చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, ఉత్తరాదికన్నా దక్షిణాదినే తన కెరీర్ బాగుంటుందని తమన్నా భావిస్తున్నారట. ‘‘హిందీ చిత్రాలు చేయడం ద్వారా నేనో మంచి పాఠం నేర్చుకున్నాను. ఇకనుంచీ దక్షిణాది చిత్రాలపైనే ఎక్కువగా దృష్టి సారించాలనుకుంటున్నాను’’ అని తమన్నా స్పష్టం చేశారు. -
మళ్లీ నిరాశే!
ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ తమన్నా అంటే గోల్డెన్ లెగ్. ఆమె చేసిన సినిమాలు ఎక్కువ శాతం హిట్లే. కానీ, హిందీ చిత్రసీమలో మాత్రం తమన్నా జాతకం తిరగబడింది. ఎన్నో కలలతో ‘హిమ్మత్వాలా’ ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయమయ్యారు తమన్నా. అయితే, ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ విషయం గురించి తమన్నాను ఎవరడిగినా.. ‘‘దక్షిణాదిన పాతిక సినిమాలకు పైగా చేశాను. జయాపజయాలు నాకు కొత్త కాదు. ఓ సినిమా హిట్ కానంత మాత్రాన నేను హర్ట్ అయిపోను’’ అని ధీమాగా సమాధానం చెప్పారు. హిందీ రంగంలో తన రెండో చిత్రం ‘హమ్‌షకల్స్’పై బోల్డన్ని ఆశలు పెంచుకున్నారు ఈ మిల్క్ బ్యూటీ. ఈ మధ్యకాలంలో ఏ సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ తమన్నా అంత విస్తృతంగా పాల్గొని ఉండరేమో. ‘హమ్‌షకల్స్’ని భారీ స్థాయిలో ప్రచారం చేసింది ఈ చిత్రబృందం. దాంతో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైంది. కానీ, సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. ప్రచారం చేసినంత బ్రహ్మాండంగా సినిమా లేదని ప్రేక్షకులు పెదవి విరిచేశారు. మళ్లీ తమన్నాకు నిరాశ తప్పలేదు. అయితే.. ఈ సినిమా బాగాలేదనే టాక్ వచ్చినా.. మొదటి మూడు రోజులు వసూళ్లు బాగానే ఉన్నాయట. ఆ విధంగా కొంతలో కొంత ఊరట లభించి ఉంటుంది. తొలి, మలి సినిమాలు ఇలా సక్సెస్‌పరంగా చేదు అనుభవాన్ని మిగిల్చిన నేపథ్యంలో తమన్నా నటించిన మూడో చిత్రం ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ ఆమెకు ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో కాలమే చెప్పాలి. ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది. -
కామెడీ క్యారెక్టర్లతో బోర్ కొట్టింది: రితేష్
న్యూఢిల్లీ: కామెడీ క్యారెక్టర్లు చేసి బోర్ కొట్టిందని బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ పేర్కొన్నాడు. 35 ఏళ్ల రితేష్.. హౌస్‌ఫుల్, గ్రాండ్ మస్తీ సినిమాల్లో హాస్యాపాత్రల్లో అలరించాడు. మంచి టైమింగ్ తో కామెడీ పండించి పలు అవార్డులు కూడా అందుకున్నాడు. హాస్యపాత్రలు చేసి విసుగొచ్చిందని రితేష్ అన్నాడు. కొత్తగా ఏం చేయాలో తెలియడం లేదన్నాడు. ప్రేక్షకులు తనను కామెడీ పాత్రల్లో చూడడానికే ఇష్ట పడుతున్నారని తెలిపాడు. నాచ్, రన్ సినిమాల్లో విభిన్న పాత్రలు చేసినా ప్రేక్షకులు ఆదరించలేదని వాపోయాడు. త్వరలో విడుదలకానున్న సాజిద్ ఖాన్ సినిమా 'హమ్షాకాల్స్'లో రితేష్ నటించాడు. -
అతనితో సంబంధాలు అంటగట్టడం బాధేసింది: తమన్నా
ముంబై: బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ సంబంధాలను అంటగట్టడం చాలా బాధేసిందని సినీ నటి తమన్నా భాటియా అన్నారు. సాజిద్ నాకు సోదరుడిలాంటి వాడని తమన్నా తెలిపింది. దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందిన తమన్నా.. అజయ్ దేవగణ్ సరసన 'హిమ్మత్ వాలా' చిత్రంలో నటించింది. సాజిద్, తమన్నాల సంబందాలపై బాలీవుడ్ లో ప్రచారం జోరందుకుంది. సాజిద్ నా సోదరుడు. నేను రాఖీ కూడా కట్టాను. రూమర్లు చాలా వినిపిస్తున్నాయి. ఓ యాక్టర్ ను డైరెక్టర్ నమ్మితే.. సంబంధాలను అంటగడుతారా? అంటూ తమన్నా ఓ ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేశారు. సైఫ్ ఆలీ ఖాన్, రితేష్ దేశ్ ముఖ్, రామ్ కపూర్, బిపాసా బసు, ఇషా గుప్తాలతో కలిసి 'హమ్ షకల్స్' చిత్రంలో నటించింది. తమన్నా పాత్రతో పోల్చితే తన పాత్రకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణపై బిపాసా బసు ఈ చిత్రం ప్రచారానికి దూరంగా ఉండటంపై మరో రూమర్ కూడా మీడియాలో ప్రచారం జరుగుతోంది. బిపాసా ప్రచారంలో పాల్గొనకపోవడానికి కారణం తనకు తెలియదని తమన్నా వెల్లడించింది. హాస్య చిత్రాలను రూపొందించడంలో దిట్ట సాజిద్ పై పొగడ్తలని తమన్నా గుమ్మరించింది. -
బికినీలు, ముద్దులకు నో
వెండితెరపై ఇప్పటి వరకు బికినీలు ధరించడం, ముద్దు సన్నివేశాలు వంటివాటిలో నటించలేదని భవిష్యత్తులో కూడా నటించనని మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా స్పష్టం చేశారు. తమన్నా, ఇషా గుప్తా, బిపాసా బసులు నటించిన బాలీవుడ్ చిత్రం 'హమ్ షకల్స్' త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తమన్నా ముంబైలో మాట్లాడింది. 'హమ్ షకల్స్' చిత్రంలోని ఓ సన్నివేశంలో హీరోయిన్లు బికినీ ధరించి నటించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఆ సన్నివేశంలో తాను మాత్రం షార్ట్స్ ధరించి నటించానని చెప్పారు. 'హమ్ షకల్స్' చిత్రంలో సైఫ్ అలీఖాన్ సరసన, అలాగే 'ఇట్స్ ఎంటర్టైన్మెంట్' చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్నానని తెలిపారు. ఇద్దరు ఎంతో పరిణితి చెందిన మంచి నటులని తెలిపారు. అలాగే ఇద్దరికి నటనలో ఎంతో తేడా ఉందన్నారు. ఓంకార, హమ్‌తుమ్, ఏజెంట్ వినోద్ చిత్రాలలో సైఫ్ నటన ఆమోఘమని తమన్నా వెల్లడించింది. -
నిరాశపడలేదు
దక్షిణాదిన అగ్రస్థానంలో తారగా కొనసాగుతున్న తరుణంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తొలిప్రయత్నంలోనే పరాజయాన్ని చవిచూసినా తాను నిరాశ పడలేదని అంటోంది తమన్నా. తెలుగు, తమిళ చిత్రాలు చేతినిండా ఉన్నప్పుడే బాలీవుడ్‌లోకి అడుగపెట్టి అజయ్ దేవ్‌గణ్‌తో ‘హిమ్మత్వాలా’ సినిమా చేసిన విషయం తెలిసిందే. 80వ దశకంలో శ్రీదేవి, జితేంద్ర నటించిన సినిమాను అదే పేరుతో దర్శకుడు సాజిత్‌ఖాన్ రీమేక్ చేసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ విషయమై తమన్నా మాట్లాడుతూ... ‘రీమేక్ చిత్రాలను బాలీవుడ్ అభిమానులు ఆదరిస్తున్నప్పటికీ 1980 నాటి చిత్రాలను రీమేక్ చేయడం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా కూడా అదే రీతిలో సాగడాన్ని ప్రేక్షకులు స్వాగతించలేకపోయారు. ‘హిమ్మత్వాలా’లో నటించడం ద్వారా ఓ పెద్ద అడుగు వేశానని భావించాను. సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయినా నేను నిరాశపడలేదు. సినిమా ఎంపిక ఎలా ఉండాలనే విషయమై ఓ పాఠం నేర్చుకున్నాననిపించింది. ప్రతి నటుడికి, నటికి ఇలాంటి అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. కెరీర్లో ఎన్నో విజయాలు, అపజయాలు ఎదుర్కొన్నాను. దీనిని కూడా అదేవిధంగా భావించాన’ని చెప్పింది. మళ్లీ సాజిద్‌ఖాన్ దర్శకత్వంలోనే ‘హమ్షకల్’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా జూన్ 20 విడుదల కానుంది. మళ్లీ సాజిద్తోనే ఎందుకు పనిచేస్తున్నారు? అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... చేసిన దర్శకుడితోనే మళ్లీ సినిమా చేయడం తప్పేమీ కాదే... ఆయనతో పనిచేయడంలో నాకెలాంటి భయం, ఇబ్బందీ లేద’ని చెప్పింది. జీవితంలో ఎవరైనా ఎత్తుపల్లాలను ఎదుర్కొనక తప్పదని, ఈసారి మా ప్రయత్నం తప్పక సత్ఫలితాలనిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. -
మిల్క్ బ్యూటీ పై గుర్రుగా ఉన్న బ్లాక్ బ్యూటీ...
-
బికినీ వేసుకోవడం నాకిష్టం లేదు!
ఉత్తరాది నుంచి వచ్చి, దక్షిణాది చిత్రాలతో పెద్ద తారగా ఎదిగిన నటి - తమన్నా భాటియా. ఆ మధ్య ‘హిమ్మత్వాలా’ రీమేక్ ద్వారా మళ్ళీ హిందీలో ప్రయత్నించి, విజయాన్ని అందుకోలేకపోయిన ఈ మిల్కీ బ్యూటీ తాజాగా మరో హిందీ సినిమాలో నటిస్తున్నారు. సాజిద్ ఖాన్ ‘హమ్‌షకల్స్’లో కథానాయికలు బిపాసా బాసు, ఈషా గుప్తాలతో కలసి వెండితెరపై కనువిందు చేస్తున్నారు. ‘‘ఇలాంటి మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్నప్పుడు మనదైన ప్రత్యేక ముద్ర వేయడం పెనుసవాలు. కానీ, అలాంటి సవాలును తలకెత్తుకొని, ఇలా మరో ఇద్దరు తారలతో ఆరోగ్యకరంగా పోటీ పడడం నాకు కూడా ఇష్టమే’’ అన్నారు తమన్నా. అయితే, ‘‘ఎవరికి వాళ్ళం మా పాత్రలు బాగా చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. సినిమా కూడా బాగా ఆడాలి. కాబట్టి, అందరం కలసికట్టుగా పని చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది’’ అని ఆమె తనదైన విశ్లేషణ చెప్పారు. తాజా చిత్రంలో సైఫ్ అలీ ఖాన్‌తో కలసి నటిస్తున్న తమన్నా, ‘‘ఆయనతో కలసి పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. పెపైచ్చు, నిజజీవితంలో కూడా సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లాంటి చక్కటి జంటను నేను చూడలేదంటే నమ్మండి’’అని వ్యాఖ్యానించారు. సినిమా గురించి, దర్శకుడు సాజిద్ ఖాన్ గురించి పాజిటివ్‌గా ఇన్ని కబుర్లు చెబుతున్న తమన్నా ఈ చిత్రంలో ఓ సన్నివేశానికి మాత్రం నో చెప్పారు. బిపాసా బాసు, ఈషా గుప్తాలు బికినీలు ధరించి కనిపిస్తే, మన మిల్కీ బ్యూటీ మాత్రం షార్ట్స్‌లో దర్శనమిచ్చారు. ఆ మాటే అడిగితే, ‘‘నిజానికి, మేము ముగ్గురమూ బికినీలు వేసుకొని, నీళ్ళలో నుంచి బయటకు నడుచుకుంటూ వస్తుంటే, ఆ దృశ్యాన్ని చిత్రీకరించాలని దర్శకుడు సాజిద్ అనుకున్నారు. కానీ, బికినీ వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎప్పటి లానే ఆ మాట మీదే నిలబడ్డాను. చివరకు షార్ట్స్ వేసుకొని, పైన షార్ట్ టాప్ వేసుకొని ఆ దృశ్యంలో నటించాను’’ అని తమన్నా చెప్పారు. తారలంతా బికినీ డ్రెస్సులు, అధర చుంబన సన్నివేశాల్లో నిరభ్యంతరంగా పనిచేస్తుంటే, తమన్నా మాత్రం బికినీకి ఒప్పుకొనేది లేదు కాక ఒప్పుకొనేది లేదనడం విచిత్రమే. -
బికినీకి నో చెప్పని మిల్క్ బ్యూటీ
-
ఆయనను ఆమెగా చూసి... ఒకటే నవ్వులు
వెండితెరపై వీరోచిత పోరాట దృశ్యాలు చేస్తూ, మగధీర అనిపించుకునే హీరోలు సన్నివేశం డిమాండ్ మేరకు అప్పుడప్పుడు ఆడవేషంలో కూడా కనిపించాల్సి వస్తుంది. ఈ గెటప్ అందరికీ నప్పదు. ముఖ్యంగా మంచి దేహదారుఢ్యం గల సైఫ్ అలీఖాన్ వంటి హీరోలు లేడీ గెటప్ వేసుకుంటే నవ్వు రావడం ఖాయం. ఆయన ఈ గెటప్‌లో కనిపించనున్న సినిమా ‘హమ్ షకల్స్’. ఇటీవల సైఫ్ ఆడ వేషానికి సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తన భర్త లేడీ గెటప్ వేసుకుంటున్నాడని తెలిసి కరీనా కపూర్ ఆ షూటింగ్ లొకేషన్‌కి వెళ్లారు. మేకప్ రూమ్‌లో ఈ వేషం వేసుకుని, బయటికొచ్చిన సైఫ్‌ని చూసి కరీనా నవ్వాపుకోలేకపోయారట. పరిసర ప్రాంతాలను మర్చిపోయి తనివి తీరా నవ్వేశారని సమాచారం. ఆ నవ్వుకి కరీనా మొహం ఎర్ర మందారంలా కందిపోయిందని, చూడముచ్చటగా అనిపించిందని చిత్రం బృందం అంటున్నారు. కరీనా అలా నవ్వడం చూసి, మొహం కందగడ్డలా పెట్టుకున్నారట సైఫ్. ఆ తర్వాత విషయాన్ని తేలిగ్గా తీసుకుని, ఆయన కూడా హాయిగా నవ్వేశారట. రేపు ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు కూడా సైఫ్ గెటప్ చూసి, పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారని ఊహించవచ్చు.