
పాఠం నేర్చుకున్నా!
.‘‘ఇప్పుడు నా కెరీర్‌కి ఏది వర్కవుట్ అవుతుంది? ఏది కాదు? అనే విషయంలో నాకు పూర్తి అవగాహన వచ్చేసింది. అందుకే, ఇకనుంచి సినిమాల ఎంపిక విషయంలో నేను మరింత జాగ్రత్తపడతా’’ అని తమన్నా అంటున్నారు. ఈ మిల్క్ బ్యూటీ ఇలా అనడానికి కారణం హిందీ చిత్రాలు. తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని తారగా కొనసాగుతున్న తమన్నా కెరీర్ హిందీ రంగంలో మాత్రం ఆశించిన విధంగా సాగలేదు. హిందీలో చేసిన ‘హిమ్మత్‌వాలా’, ‘హమ్ షకల్స్’, ‘ఎంటర్‌టైన్‌మెంట్’ చిత్రాలు తమన్నా కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. ఆ చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, ఉత్తరాదికన్నా దక్షిణాదినే తన కెరీర్ బాగుంటుందని తమన్నా భావిస్తున్నారట. ‘‘హిందీ చిత్రాలు చేయడం ద్వారా నేనో మంచి పాఠం నేర్చుకున్నాను. ఇకనుంచీ దక్షిణాది చిత్రాలపైనే ఎక్కువగా దృష్టి సారించాలనుకుంటున్నాను’’ అని తమన్నా స్పష్టం చేశారు.