hundi break
-
ఆ ఆలయంలో మళ్లీ దొంగలు పడ్డారు..
కృష్ణగిరి: చుంచుఎర్రగుడి గ్రామ శివారులోని అతిపురాతన రామలింగేశ్వరస్వామి ఆలయంలో మళ్లీ దొంగలు పడ్డారు. పోలీసులు వివరాల మేరకు.. గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి ఆలయ ప్రధాన ద్వారానికి ఉన్న తాళం పగులగొట్టి హండీని ఎత్తుకెళ్లారు. తర్వాత దేవనకొండ మండలం బండపల్లె గ్రామానికి వెళ్లే దారిలో హుండీని పగులగొట్టి అందులోని కానుకలు(ఏడాదివి) ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఓ. విజయభాస్కర్ ఆలయానికి చేరుకుని ఘటన జరిగిన తీరుపై పూజారి నాగయ్య, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇదే ఆలయంలో 2016 జూలై 23న ఒకసారి, అదే ఏడాది అక్టోబర్ 4న మరోసారి చోరీ జరిగింది. ఆలయంలో వరుస చోరీలు జరుగుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
అంతా ఇష్టారాజ్యం
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో కొందరి సిబ్బంది, అర్చకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. క్షేత్రంలో వరుస సంఘటనలు జరుగుతున్నా అడిగే నాథుడే లేడు. ఈ నెల 15వ తేదీ నుంచి పార్వేట ఉత్సవాలు మొదలయ్యాయి. పల్లకి వెంట హుండీ పెట్టడం ఆనవాయితీ. ఈ హుండీ నిండిన వెంటనే సీలు చేసి భద్రపరిచి ఆ హుండీ స్థానంలో మరో హుండీ పెట్టాలి. జిల్లా స్థాయి అధికారుల అనుమతి తీసుకుని అధికారి పర్యవేక్షకుని సమక్షంలో హుండీ సీలు తీసి అందులోని కానుకలు లెక్కించి రికార్డులో నమోదు చేయాలి. ఈ విధానం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ విధానికి ఆదివారం ఆలమూరు గ్రామాంలో తూట్లు పొడిచారు. పార్వేట పల్లకి హుండీని పల్లకి వెంట ఉండే సిబ్బంది సీలు పగుల కొట్టి అందులోని కానుకలు వేరే డబ్బాలోకి మార్చుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అహోబిలేశుడి పార్వేట పల్లకి వెంట ఉండే సిబ్బంది పెత్తనం పెచ్చుమీరుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్ కుమార్ను వివరణ కోరగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని, హుండీ సీలు తీసిన విషయంపై విచారణ చేపడుతామన్నారు. -
ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ
హైదరాబాద్: నగరంలోని ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్న సోత్తుతో పాటు ఆలయంలో ఉన్న వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సోమవారం పూజ చేయడానికి వచ్చిన వారు ఇది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.