
ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ
హైదరాబాద్: నగరంలోని ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్న సోత్తుతో పాటు ఆలయంలో ఉన్న వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
సోమవారం పూజ చేయడానికి వచ్చిన వారు ఇది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.