ఆ ఆలయంలో మళ్లీ దొంగలు పడ్డారు.. | Robbery In temple Again | Sakshi
Sakshi News home page

ఆ ఆలయంలో మళ్లీ దొంగలు పడ్డారు..

Published Mon, Mar 12 2018 11:25 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robbery In temple Again - Sakshi

దుండగులు పగులగొట్టిన హుండీని పరిశీలిస్తున్న ఎస్‌ఐ విజయభాస్కర్‌

కృష్ణగిరి:  చుంచుఎర్రగుడి గ్రామ శివారులోని అతిపురాతన  రామలింగేశ్వరస్వామి ఆలయంలో మళ్లీ దొంగలు పడ్డారు. పోలీసులు వివరాల మేరకు.. గుర్తు తెలియని దుండగులు  శనివారం రాత్రి ఆలయ ప్రధాన ద్వారానికి ఉన్న తాళం పగులగొట్టి హండీని ఎత్తుకెళ్లారు. తర్వాత దేవనకొండ మండలం బండపల్లె గ్రామానికి వెళ్లే దారిలో హుండీని పగులగొట్టి అందులోని కానుకలు(ఏడాదివి) ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ఓ. విజయభాస్కర్‌ ఆలయానికి చేరుకుని  ఘటన జరిగిన తీరుపై పూజారి నాగయ్య, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇదే ఆలయంలో  2016 జూలై 23న ఒకసారి, అదే ఏడాది అక్టోబర్‌ 4న మరోసారి చోరీ జరిగింది. ఆలయంలో వరుస చోరీలు జరుగుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement