
హుండీ సీలు తొలగించి కానుకలు వేరే డబ్బాలోకి వేస్తున్న దృశ్యం
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో కొందరి సిబ్బంది, అర్చకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. క్షేత్రంలో వరుస సంఘటనలు జరుగుతున్నా అడిగే నాథుడే లేడు. ఈ నెల 15వ తేదీ నుంచి పార్వేట ఉత్సవాలు మొదలయ్యాయి. పల్లకి వెంట హుండీ పెట్టడం ఆనవాయితీ. ఈ హుండీ నిండిన వెంటనే సీలు చేసి భద్రపరిచి ఆ హుండీ స్థానంలో మరో హుండీ పెట్టాలి. జిల్లా స్థాయి అధికారుల అనుమతి తీసుకుని అధికారి పర్యవేక్షకుని సమక్షంలో హుండీ సీలు తీసి అందులోని కానుకలు లెక్కించి రికార్డులో నమోదు చేయాలి.
ఈ విధానం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ విధానికి ఆదివారం ఆలమూరు గ్రామాంలో తూట్లు పొడిచారు. పార్వేట పల్లకి హుండీని పల్లకి వెంట ఉండే సిబ్బంది సీలు పగుల కొట్టి అందులోని కానుకలు వేరే డబ్బాలోకి మార్చుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అహోబిలేశుడి పార్వేట పల్లకి వెంట ఉండే సిబ్బంది పెత్తనం పెచ్చుమీరుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్ కుమార్‌ను వివరణ కోరగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని, హుండీ సీలు తీసిన విషయంపై విచారణ చేపడుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment