వైద్యారోగ్య శాఖలోకి 11 వేల మంది వీవీపీ ఉద్యోగులు.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం
సాక్షి, హైదరాబాద్: డాక్టర్లు, నర్సులు, ఇతర మెడి కల్ స్టాఫ్ ప్రభుత్వం ద్వారా నియమించబడి.. ప్రభుత్వ ఆసుపత్రు ల్లోనే పనిచేస్తారు. వారికి జీత భత్యాల కోసం ప్రభుత్వమే నిధులిస్తుంది. పదవీ విరమణ తరువాత పెన్షన్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. కానీ, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.
ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించే ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ద్వారా జతభత్యాలు పొందుతూ.. ప్రభుత్వం తర ఫున పనిచేసే తెలంగాణ వైద్య విధాన పరిషత్ (వీవీపీ) ఉద్యోగులు వీరు. తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా వీరు ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటూనే ఉన్నారు.
ఇప్పుడు వారి కోరిక నెరవేర బోతున్నది. సుమారు 40 ఏళ్లుగా ప్రభుత్వంలో ప్రత్యేక కేటగిరీగా కొనసాగుతన్న వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వ శాఖగా గుర్తించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోకి వీవీపీని తీసుకొని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చాలని సంకల్పించింది. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.
సీహెచ్‌సీ నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వీవీపీ పరిధిలోనే..
రాష్ట్రంలో వీవీపీ పరిధిలో కింగ్‌కోఠి, కరీంనగర్, ఖమ్మం, సంగారెడ్డి, నల్లగొండ జిల్లా ఆసుపత్రులతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, మెటర్నల్ చైల్డ్ హెల్త్ సెంటర్లు సహా175 వరకు ఉన్నా యి.
ఈ ఆసు పత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్‌కు సాంకేతికంగా ప్రభుత్వం నుంచి నేరుగా జీతభత్యాలు అందవు. వీవీపీ కింద సుమారు 11 వేల మందికిపైగా ఉద్యో గులు పనిచేస్తు ండగా, వీరికి చెల్లించే జీతాలకు పే స్కేల్ కనిపించదు.
ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఏటా కేటాయించే మొత్తాన్ని నెలనెలా వేతనాల కోసం సర్దు బాటు చేస్తారు. తమను ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించాలని కొంతకాలంగా కోరుతున్నారు. కొద్దిరోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహను కలిసి ఈ మేరకు విన్నవించడంతో ఫైలు కదిలింది.
త్వరలో ఉత్తర్వులు..
వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా వైద్యారోగ్య శాఖలోకి తీసుకోవాలనే ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం.. ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అడ్మిని్రస్టేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి)ని కోరారు. ఆస్కి ఇటీవలే ప్రభు త్వానికి నివేదిక సమర్పించింది. మంత్రి రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ నివేదికపై ఇటీవల చర్చించారు.
ఆ తర్వాత వీవీపీని వైద్యారోగ్య శాఖలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలోకి తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రోగుల నుంచి వసూలు చేసే యూజర్ చార్జీల నుంచి జీతాలు చెల్లించే విధానాన్ని రద్దుచేసి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో వీవీపీ ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా జీతభత్యాలు చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఏపీలో ఇప్పటికే వీవీపీని ప్రభుత్వంలో విలీనం చేశారు.
మా పోరాటం ఫలించింది
వీవీపీని వైద్యారోగ్య శాఖ పరిధిలోకి తీసుకొని సాంకేతికంగా మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గత కొంతకాలంగా పోరాడుతున్నాం. రెండున్నరేళ్ల నుంచి అన్ని ఉద్యోగ సంఘాలతో జేఏసీగా ఏర్పడి పోరాటాన్ని తీవ్రతరం చేశాం.
రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసి 12 వేలకు పైగా ఉన్నాం. ప్రభు త్వం వైద్యారోగ్య శాఖలోకి విధాన పరిషత్‌ను తీసుకోవాలని భావిస్తుండడం శుభ పరిణామం. మా పోరాటానికి ఫలితం దక్కింది. – డాక్టర్ వినయ్ కుమార్, జేఏసీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment