hundred rupee note
-
వంద రూపాయల కోసం మాజీ వైస్ చాన్సలర్ దారుణ హత్య
భువనేశ్వర్: వంద రూపాయలు అడిగితే ఇవ్వలేదని మాజీ వైస్ చాన్సలర్‌ను దారుణ హత్య చేసిన ఘటన ఆదివారం ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాలు.. జార్సుగూడకు చెందిన ప్రొఫెసర్ ధూర్బరాజ్ నాయక్ సంబల్పూర్ యునివర్సిటీలో వైస్ చాన్సలర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. కాగా ఆదివారం ఉదయం నాయక్ పనిమీద ఆయన బయటికి వెళ్లారు. ఇంట్లో ఆయన భార్య, కూతురు, అల్లుడు వేరే గదుల్లో ఉన్నారు. కాగా మధ్యాహ్నం ఊళ్లో నుంచి కొంతమంది యువకులు వచ్చి నాయక్ ఇంట్లోకి చొరబడ్డారు. నేరుగా నాయక్ రూంకి వెళ్లి తనిఖీలు చేస్తుండగా.. నాయక్ పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. నాయక్‌ను చూసిన ఆ యువకులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అతను అందుకు ఒప్పుకోకపోవడంతో కనీసం వంద రూపాయలైనా ఇవ్వాలంటూ అతనిపై దౌర్జన్యం చేశారు. దీంతో నాయక్, ఆ యువకులు మధ్య తోపులాట జరగ్గా.. ఆ యువకుల్లో ఒక వ్యక్తి అక్కడే ఉన్న గొడ్డలిని తీసుకొని నాయక్ మెడపై నరికాడు. దీంతో నాయక్ అక్కడే కుప్పకూలగా.. వారు అక్కడినుంచి పారిపోయారు. వేరే గదిలో ఉన్న ఆయన భార్య వచ్చి నాయక్‌ను తన అల్లుడు సాయంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రికి తరలించిన కాసేపటకే ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జార్సుగూడ ఎస్పీ బీసీ దాస్ తెలిపారు. చదవండి: 57 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. రెండో భార్య ఏంచేసిందంటే.. హైటెక్ సిటీలో కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పై ఎగిరిపడ్డ ఆటో -
ఇండియన్ కరెన్సీని ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా!
డబ్బు.. గల్లీ నుంచి ప్రపంచ దేశాల వరకు ప్రతి ఒక్కరితో దీనితో అమితమైన సంబంధం ఉంటుంది. ఎన్ని చేతులు మారిన విలువ మారనిది డబ్బు ఒకటే. సంపాదిస్తే కానీ డబ్బు విలువ తెలీసిరాదంటారు. చాలామంది డబ్బు ద్వారానే విలువస్తుందని భావిస్తుంటారు. ఏ పని చేసినా దాని కోసమే. మనిషి జీవితాన్ని శాసించేది కూడా డబ్బే. డబ్బు సంపాదించడం కంటే దాన్ని పొదుపు చేయడం చాలా కష్టం. చూడటానికి కాగితం ముక్కే కావచ్చు కానీ ఓ వ్యక్తి జీవితాన్నే మార్చేయగలదు. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎన్నో విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి.మరి అలాంటి డబ్బులను ప్రింట్ చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా.. ఒక సాధారణ కాగితానికి 10,100.. నుంచి 2000 రూపాయల విలువ ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది. భారతీయ కరన్సీని ముద్రించడానికి అయ్యే ఖర్చు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. ► 2018 నాటి డేటా ప్రకారం.. 10 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది. ►20 రూపాయల నోటును ముంద్రించడానికి 1 రూపాయి ఖర్చు అవుతుంది. అంటే దీనికి 10 రూపాయల నోటు కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ► 50 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది. ►100 రూపాయల నోటును ముద్రించడానికి 1.51 పైసలు ఖర్చవుతుంది. ►200 రూపాయల నోటును ముద్రించడానికి 2.15 పైసలు ఖర్చవుతుంది. ►500 రూపాయల నోటును ముద్రించడానికి 2.57 పైసలు ఖర్చవుతుంది. ►2000 రపాయల నోటును ముద్రించడానికి 4.18 పైసలు ఖర్చు అవుతుంది. వీటితో పాటు ప్రభుత్వం రద్దు చేసిన పాత 500, 1000 రూపాయల నోట్ల ఖర్చు కూడా చూసుకుంటే.. ►పాత 500 రూపాయల నోటును ముద్రించడానికి 3.09 పైసలు ఖర్చు అవుతుంది. అంటే కొత్త 500 రూపాయల కంటే 52పైసలు అధికం. ►పాత 1000 రూపాయల నోటును ముంద్రించడానికి 3.54 పైసలు ఖర్చు అవుతుంది. అంతే కొత్త 2000 రూపాయల కంటే 64 పైసలు తక్కువ. -
వంద రూపాయల కోసం.
భాగ్యనగర్‌కాలనీ: వంద రూపాయల నోటు కోసం జరిగిన పెనుగులాట ఒకరి హత్యకు దారితీసిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసాపేట జామామసీదు ప్రాంతానికి చెందిన సయ్యద్ పాషా (35) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం అతను కటింగ్ చేయించుకునేందుకు వెళ్లగా మారుతీనగర్ వద్ద గుర్తు తెలియని స్నేహితుడు అతడిని రూ. 100 అడగడంతో పాషా నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుండగా రిజ్వాన్ అనే వ్యక్తి వారిని విడదీశాడు. కొద్దిసేపటి తర్వాత వెనక్కి వచ్చిన అతను సయ్యద్ పాషా తలపై కర్రతో బలంగా మోదటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రిజ్వాన్ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మృతుని భార్య చాంద్ బీ కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాన సాక్షి రిజ్వాన్‌ను విచారిస్తే నిందితుడి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. -
వంద నోటుకు ఎన్ని వంకలో..
హన్మకొండ: వరంగల్ జిల్లా నర్సంపేట ఎస్బీహెచ్ ఏటీఎంలో వింత వంద నోటు వచ్చింది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డ్రైవర్‌గా పని చేస్తున్న లైన్ వెంకటేశ్వర్లు స్వగ్రామం నర్సంపేట. అయితే బుధవారం నర్సంపేటలోని ఎస్బీహెచ్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయగా, అందులో ఈ వంద నోటు వచ్చింది. దీనికి రెండు సిరీస్ నంబర్లు ఉన్నాయని, 4యూఎల్ 266626, 4యూఎల్ 266726 నంబర్లు ముద్రించి ఉన్నాయని చెప్పాడు. రెండు నంబర్ల మధ్య తేడా 101 సంఖ్యగా ఉందని, ముద్రణలో లోపం వల్ల ఇలా వచ్చినట్లుంద ని తెలిపాడు.