![Murder For Hundread Rupees In Kukatpally Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/25/hundred.jpg.webp?itok=M8IDFZKK)
సయ్యద్ పాషా మృతదేహం
భాగ్యనగర్‌కాలనీ: వంద రూపాయల నోటు కోసం జరిగిన పెనుగులాట ఒకరి హత్యకు దారితీసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసాపేట జామామసీదు ప్రాంతానికి చెందిన సయ్యద్ పాషా (35) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు.
గురువారం అతను కటింగ్ చేయించుకునేందుకు వెళ్లగా మారుతీనగర్ వద్ద గుర్తు తెలియని స్నేహితుడు అతడిని రూ. 100 అడగడంతో పాషా నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుండగా రిజ్వాన్ అనే వ్యక్తి వారిని విడదీశాడు. కొద్దిసేపటి తర్వాత వెనక్కి వచ్చిన అతను సయ్యద్ పాషా తలపై కర్రతో బలంగా మోదటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రిజ్వాన్ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మృతుని భార్య చాంద్ బీ కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాన సాక్షి రిజ్వాన్‌ను విచారిస్తే నిందితుడి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment