పది రోజులే మిత్రమా!
సమయం లేదు మిత్రమా... సరిగ్గా పదంటే పది రోజులు మాత్రమే! ‘శరణమా? రణమా?’ అనే ప్రచార చిత్రంలో డైలాగులు, తర్వాత పాటలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా విడుదల తేదీ ప్రకటించారు. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ వందో చిత్రం సంక్రాంతి బరిలో సందడి చేయడానికి వచ్చేస్తోంది. క్రిష్ దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.