hussaini alam
-
హుస్సేనీఆలం ఎస్బీఐ బ్యాంకు మూసివేత
సాక్షి, చార్మినార్ : మూసాబౌలీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. హుస్సేనీఆలంలోని తన బ్రాంచ్‌ను మూసివేసింది. ఈ నెల 14వ తేదీ వరకు బ్యాంక్ సిబ్బంది అందుబాటులో ఉండని కారణంగా బ్యాంక్‌ను మూసివేసినట్లు సంబంధిత అధికారులు బ్యాంక్ వద్ద నోటీసు బోర్డు ఏర్పాటు చేసారు. బ్యాంక్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో బ్యాంక్‌లోని సిబ్బందిని హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా పంజేషా యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రానా తబస్సుం ఆదేశించారు. బ్యాంక్‌లోని మేనేజర్‌తో పాటు మొత్తం సిబ్బందిని హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించడంతో బ్యాంక్ లావాదేవీలు స్తంభించిపోయాయి. బ్యాంక్ మూత పడినప్పటికీ..ఆన్లైన్ బ్యాంకింగ్, యునోతో పాటు ఏటీఎంలు పని చేస్తాయని.. అవసరమైన ఖాతాదారులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని నోటీసు బోర్డులో సూచించారు. అత్యవరమైన సేవల కోసం దగ్గర్లోని కోట్ల అలీజా, మీరాలంమండిలలోని బ్రాంచ్‌లను సంప్రదించవచ్చన్నారు. (ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా.. హైకోర్టుకు తాళం) భయాందోళనలో బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు బ్యాంక్ ఉద్యోగి కరోనా వైరస్ బారిన పడడంతో ఇప్పటి వరకు ఈ బ్యాంక్‌లో లావాదేవీలు కొనసాగించిన ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ సిబ్బందితో దగ్గరగా మెలిగిన వారందరూ తమ పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు. వాస్తవానికి బ్యాంక్ ప్రాంగణంలోనికి ఎవరిని అనుమతించకుండా ప్ర«ధాన ద్వారం వద్ద నుంచే లావాదేవీలకు అనుమతించినప్పటికీ..ఖాతాదారుల్లో ఆందోళన తగ్గడం లేదు. బ్యాంక్ ఉద్యోగికి నిర్వహించిన రక్త పరీక్షల్లో ఈ నెల 3న కరోనా పాజిటివ్ అని రిపోర్టులు రావడంతో అటు తోటి ఉద్యోగులతో పాటు ఖాతాదారులు నివ్వెర పోయారు. బ్యాంక్‌లోని సిబ్బందిని పూర్తిగా హోమ్ క్వారంటైన్ చేసినప్పటికీ..కరోనా పాజిటివ్ లక్షణాలుంటే వెంటనే రక్త పరీక్షలు నిర్వహించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సిబ్బంది తమలో ఎంత మందికి ఈ వైరస్ సోకిందోనని ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది ఖాతాదారులు భౌతిక దూరం పాటించకుండా మాస్క్‌లు ధరించడం లేదని బ్యాంక్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. తాము మాస్క్‌లు, శానిటైజర్స్ వినియోగించినప్పటికీ.. తమలో ఒకరికి కరోనా వైరస్ సోకిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాతబస్తీలో కుప్పకూలిన భవనం..
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాతంలో హుస్సేనీ ఆలంలోని మహేశ్వరి సేవా ట్రస్ట్ భవనం శ్లాబ్ కూలిపోయిన ఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు శిథిలాల్లో చిక్కుకుపోయిన కూలీలను కాపాడే ప్రయత్నం చేశారు. చనిపోయిన కూలీలు నంద (32), వెంకటయ్య (40)లుగా గుర్తించారు. క్షతగాత్రులకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందినవారుగా గుర్తించారు. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారి మాట్లాడుతూ... ట్రస్ట్ నిర్వాహకులు అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ స్థల వివాదం కేసు కోర్టు విచారణలో ఉందన్నారు. దీనికి సంబంధించి ఆరు నెలల క్రితమే నోటీసులిచ్చినట్లు చెప్పారు. బిల్డర్, ఇంజినీర్, సూపర్వైజర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
హుస్సేనీఆలంలో కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం సౌత్‌జోన్ పోలీసులు కార్డన్‌సెర్చ్ (నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు. ఈ తనిఖీల్లో 12 మంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ కత్తి, మూడు డాగర్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే ఐదు మామిడిపళ్ల గోడౌన్లను సీజ్ చేశారు. ఆ క్రమంలో ఐదు బ్యాగుల కార్బైడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు రెండు బెల్ట్ షాపులను సీజ్ చేసి... 700 లిక్కర్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 300 మంది పోలీసులు పాల్గొన్నారు. సౌత్ జోన్ డీసీపీ కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. -
హుస్సేని ఆలంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు క్షణాల్లో ఓ ఇంటిని చుట్టు ముట్టడంతో.. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న అషఫ్బ్రీ అనే వృద్ధురాలిని కాపాడి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.