hyderabad metrological department
-
నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు
-
రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుం చి 40 కి.మీ. వేగంతో) పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ది పేట, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 24 గంటలలో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణించి మంగళవారం తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో పాంజిమ్ (గోవా)కు పశ్చిమ దిశగా 280 కి.మీ., ముంబైకు దక్షిణ నైరుతి దిశగా 450 కి.మీ., సూరత్ (గుజరాత్)కు దక్షిణ నైరుతి దిశగా 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 12 గంటలలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
16న అండమాన్‌లోకి నైరుతి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు ఈ నెల 16న నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. గతేడాది ఇదే నెల 18న అండమాన్‌లోకి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. అంటే ఈసారి రెండ్రోజులు ముందుగానే అండమాన్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణకు జూన్ 8న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. కేరళకు, తెలంగాణ, ఇతర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణశాఖ ఒకట్రెండు రోజుల్లో బులెటిన్ విడుదల చేసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. 13న అల్పపీడనం...: ఇదిలావుంటే తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న సుమత్రా తీర ప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తుకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం ప్రాంతాల్లో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. (చదవండి: వైరస్‌పై యుద్ధం.. ఇలా చేద్దాం) -
తెలంగాణ: రాగల మూడు రోజులు వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా తెలంగాణలో రాగల మూడురోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ శనివారం తెలిపింది. ఈ రోజు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో ఈరోజు, రేపు అక్కడక్కడా గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. (చదవండి: వైద్యురాలికి ఘన స్వాగతం.. భావోద్వేగం) ‘దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. తదుపరి 48 గంటలలో అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి క్రమంగా మే 6 వరకు ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈశాన్య మరఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది’అని వాతావరణ శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు. (చదవండి: ప్రమాద ఘంటికలు) -
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..!
సాక్షి, హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో ఇది కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధముగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని చెప్పింది. రాగల మూడురోజులకు వాతావరణ సూచనలు చేసింది. అల్పపీడనం కారణంగా తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు (మంగళవారం), రేపు చాలాచోట్ల, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడిచింది. ఈరోజు, రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాయలసీమలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. -
రెండ్రోజులపాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం నుంచి రెండ్రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 40 నుంచి 50 కి.మీ) కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండ్రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో అధిక ఉష్ణోగ్రతలతో పాటు చెదురుముదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వివిధ ప్రాంతాలలో నమోదైన వర్షపాతం హిందూమహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో నేడు పలు చోట్ల 2 నుంచి 3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఘన్పూర్ (జనగాం) 3 సెం.మీ, చౌటుప్పల్(యాదాద్రి భువనగిరి) 2 సెం.మీ, నర్మెట్ట(జనగాం) 2 సెం.మీ, యాచారం(రంగారెడ్డి) 2 సెం.మీ, పాలకుర్తి(జనగాం) 2 సెం.మీ, యాదగిరి గుట్ట(యాదాద్రి భువనగిరి) 2 సెం.మీ, మర్రిగూడ(నల్గొండ) 2 సెం.మీ, బెజ్జంకి(సిద్దిపేట) 2 సెం.మీ, ధర్మసాగర్(వరంగల్ అర్భన్) 2 సెం.మీ, కాగజ్‌నగర్(కుమరం భీం) 2 సెం.మీ, మహబూబాబాద్ 2 సెం.మీ, జఫర్‌గఢ్(జనగాం) 2 సెం.మీ, వర్గల్(సిద్దిపేట) 1 సెం.మీ 30 వేల ఎకరాల్లో పంట నష్టం అకాల వర్షాలు, వడగండ్ల వానలతో ఈ నెల 3 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో దాదాపు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసిందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నాలుగు రోజుల్లోనే 14,848 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఇందులో 95% అత్యధికంగా కోతదశకు వచ్చిన వరి పంటే ఉండటంతో చేతికి వచ్చిన పంట నీటి పాలైందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంటల బీమా చేసుకున్న రైతులకు పరిహారం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ, ఉద్యానాధికారులను ఆదేశిస్తూ లేఖ రాశారు. రైతులకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయని, వాటికి ఫోన్ చేసి కంపెనీలకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. బీమా కంపెనీల టోల్ ఫ్రీ నంబర్లు 18005992594, 18002095959 లకు ఫోన్లు చేయాలని కోరారు. -
రానున్న 3 రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో(గంటకు 40 నుంచి 50 కి.మీ) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరఠ్వాడా నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. -
నైరుతి సాధారణమే
సాక్షి, హైదరాబాద్: ఈసారి నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని, సాధారణ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈసారి ఎలా ఉంటాయన్న దానిపై మొదటి ముందస్తు అంచనాలను వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి సోమవారం వెల్లడించారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల కాలం ఉంటుందని, 50 ఏళ్ల సరాసరి అంచనాల ప్రకారం ఈసారి 96 శాతం వర్షపాతం రాష్ట్రంలో నమోదవుతుందని తెలిపారు. 96 శాతానికి అటుఇటుగా ఐదు శాతం తేడా ఉంటుందని ఆయన తెలిపారు. సాంకేతికంగా చూస్తే సాధారణానికి కాస్తంత తక్కువగానే నమోదవుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే జూన్ మొదటి వారంలో విడుదల చేయబోయే రెండో అంచనా నివేదిక ఇంకా స్పష్టంగా, ప్రాంతాల వారీగా ఉంటుందని, అప్పుడు కచ్చితమైన సమాచారం వస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈసారి నైరుతి రుతుపవనాల ద్వారా పడే వర్షపాతం అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉంటుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇలాగే ఉంటుందన్నారు. దీనివల్ల రైతులకు ప్రయోజకరంగా ఉంటుందన్నారు. నైరుతిలో 717 మి.మీ.వర్షం.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ద్వారా సాధారణంగా 755 మిల్లీమీటర్ల (మి.మీ.) వర్షపాతం నమోదుకావాల్సి ఉందని, అయితే వచ్చే నైరుతి సీజన్లో 717 మి.మీ. వర్షం కురుస్తుందని వై.కె.రెడ్డి తెలిపారు. గతేడాది 97 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా, 91 శాతానికే పరిమితమైందని చెప్పారు. రాయలసీమలో ఏకంగా 37 శాతం లోటు కనిపించిందన్నారు. ఈ విషయంలో వాతావరణశాఖ సరిగా అంచనా వేయలేకపోయిందని అంగీకరించారు. ఈసారి నైరుతి రుతుపవనాలు తెలంగాణలో జూన్ 5–7 తేదీల మధ్య ప్రవేశిస్తాయని చెప్పారు. రాయలసీమలో 3–4 తేదీల మధ్య ప్రవేశించే అవకాశముందన్నారు. తమ వాతావరణ కేంద్రానికి చెందిన సబ్ డివిజన్లలో 60 శాతం చోట్ల వర్షాలు కురిస్తే రుతుపవనాలు వచ్చినట్లుగా ప్రకటిస్తామన్నారు. గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తే కూడా రుతుపవనాలుగా గుర్తిస్తామన్నారు. నైరుతి రుతుపవనాల కాలంలో ఆదిలాబాద్‌లో అత్యధికంగా 999 ఎంఎంలు వర్షపాతం నమోదవుతుందన్నారు. అత్యంత తక్కువగా మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో నమోదవుతుందని అన్నారు. ఎల్‌నినో బలహీనం.. ఎలినినో, లానినోలపైనా వర్షాలు ఆధారపడి ఉంటాయని వై.కె.రెడ్డి తెలిపారు. అయితే ఒక్కోసారి వాటితో సంబంధం లేకుండా కూడా వర్షాలు వస్తాయని చెప్పారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎల్‌నినో మరింత బలహీనంగా ఉంటుందన్నారు. పసిఫిక్ మహా సముద్రంలో భూమధ్య రేఖ దగ్గర సముద్రంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ఎల్‌నినో అంటారు. అంతకంటే తక్కువగా ఉంటే దాన్ని లానినో అంటారు. ఎల్‌నినో ఉంటే వర్షాలు తక్కువగా కురుస్తాయని, లానినో వల్ల వర్షాలు అధికంగా కురుస్తాయన్నారు. వచ్చే వారం నుంచి ఎక్కువ ఎండలు.. రాష్ట్రంలో వచ్చే వారం నుంచి ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వై.కె.రెడ్డి తెలిపారు. నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. వారం తర్వాత ఉత్తర, తూర్పు తెలంగాణల్లో ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఉంటుందన్నారు. -
రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 18న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం: సరూర్‌నగర్(రంగారెడ్డి) 3 సెం.మీ., వరంగల్ అర్బన్ జిల్లాలోని నల్లబెల్లి, ధర్మసాగర్, భీమదేవరపల్లిలో 1 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
మరో నాలుగు రోజులు వడగళ్ల వాన
- నగరంలో ఈదురుగాలుల బీభత్సం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఓ వైపు మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు వడగాడ్పులు కూడా కొనసాగుతున్నాయి.. బుధవారం హన్మకొండలో అత్యధికంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 4 రోజుల పాటు రాష్ట్రంలో అనేక చోట్ల వడగళ్లు, ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. నిజామాబాద్ జిల్లా దోమకొండలో 4 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా ధర్మసాగర్, శాయంపేట, కొత్తగూడెంలలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. బుధవారం హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడటంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఎల్లారెడ్డిగూడలో ఓ దుకాణంపై భారీ వృక్షం విరిగిపడటంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన ఎండవేడిమిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు సేదతీరారు. రాష్ర్టంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు వడదెబ్బతో మొత్తం 48 మంది మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లాలో ఐదుగురు, ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు, కరీంనగర్ జిల్లాలో ముగ్గురు, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు, వరంగల్ జిల్లాలో 8 మంది మరణించారు. పాలమూరు జిల్లాలో ఆరుగురు, నల్లగొండ జిల్లాలో 14 మంది, మెదక్ జిల్లాలో నలుగురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు చనిపోయారు. ఈదురు గాలులు.. వడగండ్లు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు, ఆ తర్వాత కురిసిన వడగండ్ల వానతో మార్కెట్ యూర్డులు, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి వచ్చిన ధాన్యం తడిసిపోరుుంది. పలుచోట్ల పిడుగులు పడటంతో ఐదుగురు వ్యక్తులతోపాటు, పదుల సంఖ్యలో పశువులు మృతి చెందారుు. గాలికి ఇళ్ల పైకప్పులు లేచిపోవడంతో ఆస్తినష్టం సంభవించింది. చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత హన్మకొండ 43.6 రామగుండం 43.0 ఆదిలాబాద్ 42.3 నిజామాబాద్ 41.9 ఖమ్మం 41.8 ప్రాంతం ఉష్ణోగ్రత మెదక్ 41.0 భద్రాచలం 40.6 హైదరాబాద్ 40.6 మహబూబ్‌నగర్ 40.3 నల్లగొండ 40.2