సాక్షి, హైదరాబాద్: రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 18న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం: సరూర్‌నగర్(రంగారెడ్డి) 3 సెం.మీ., వరంగల్ అర్బన్ జిల్లాలోని నల్లబెల్లి, ధర్మసాగర్, భీమదేవరపల్లిలో 1 సెం.మీ వర్షపాతం నమోదైంది.
రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
Published Sun, Sep 16 2018 1:37 AM | Last Updated on Sun, Sep 16 2018 1:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment