Ian Chappel
-
పాపం బాబర్.. పాకిస్తాన్‌కు ఇదేమి కొత్త కాదు! ఆస్ట్రేలియాలో వారికి చుక్కలే
వన్డే ప్రపంచకప్-2023లో పేలవ ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా వెటరన్ షాన్ మసూద్‌ను ఎంపిక చేయగా.. టీ20 కెప్టెన్‌గా షాహీన్ షా అఫ్రిదిని నియమించింది. ఇంకా తమ వన్డే సారథిని మాత్రం పీసీబీ ఎంపిక చేయలేదు. ఇక వన్డే ప్రపంచకప్-2023 అనంతరం పాకిస్తాన్ తొలి ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్దమవుతోంది. షాన్ మసూద్ సారథ్యంలోని పాక్ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 14న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ రెడ్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు ఇప్పటినుంచే తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి ఆస్ట్రేలియా లెజెండ్ ఇయాన్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్లను మార్చడం పాకిస్తాన్‌కు ఇదేమి కొత్తకాదని చాపెల్ విమర్శించాడు. "పాపం బాబర్. అతడు అద్భుతమైన ఆటగాడు. పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి బాబర్ తనంతట తను తప్పుకోలేదు. అతడి కంటే బెటర్ కెప్టెన్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దొరికి ఉంటాడు. అందుకే అతడిని తప్పించారు. కెప్టెన్లను తరుచుగా మార్చడం పాకిస్తాన్‌కు అలవాటే అని ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాపెల్ పేర్కొన్నాడు. అదే విధంగా ఆసీస్‌తో టెస్టు సిరీస్ గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు జట్టుకు ఆస్ట్రేలియాలో మంచి రికార్డు లేదు. పాకిస్తాన్ అత్యుత్తమ జట్టు అయినప్పటికీ ఆస్ట్రేలియా పిచ్‌లపై ఇప్పటివరకు బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచలేకపోయారు. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై ఆడటానికి చాలా కష్టపడతారు. పాకిస్తాన్ జట్టు కంటే ఆస్ట్రేలియా అన్ని విధాల బలంగా ఉంది. వార్నర్, హెడ్ వంటి బ్యాటింగ్ ఎటాక్.. స్టార్క్, కమ్మిన్స్, హాజిల్ వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ పేసర్లు ఉన్నారని చాపెల్ చెప్పుకొచ్చాడు. చదవండి:రోహిత్ అలా.. కోహ్లి ఇలా.. ఎవరు మాత్రం టెంప్ట్ కాకుండా ఉంటారు?: ఆశిష్ నెహ్రా -
నోరు మూసుకొని ఆడండి.. ఆ విషయం మర్చిపోయారా? ఆసీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు!
India vs Australia, 3rd Test: ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరజాయం చవి చూసిన సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్‌పై పూర్తి అధిపత్యం చెలాయించిన భారత్.. మూడో టెస్టులో మాత్రం స్మిత్ వ్యూహాల ముందు చేతులెత్తేసింది. ఆసీస్ చేతిలో ఓటమిపాలైన రోహిత్ సేనపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సంచలన వాఖ్యలు చేశాడు. అనవసరపు మాటలు మాట్లాడకుండా.. క్రికెట్ పైన మాత్రమే దృష్టిపెట్టండని భారత జట్టు గురించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆటపై దృష్టి పెట్టండి "ఇండోర్ టెస్టులో టీమిండియా తాము చేసిన తప్పిదాలను ముందు తెలుసుకోవాలి. ఈ సిరీస్‌లో భారత జట్టుకు సరిపోయే పిచ్‌లను తయారు చేస్తున్నారని ఇంతకుముందే నేను చెప్పాను. ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు సిరీస్‌లను గెలిచిన విషయాన్ని భారత్ మర్చిపోయిందా? అయినా.. పిచ్ గురించి క్యూరేటర్‌కి కాకుండా నిర్వాహకులు, ఆటగాళ్ళు, కోచ్‌లకు ఏంటి సంబంధం? పిచ్‌ను తయారు చేసే పనిని క్యూరేటర్ చూసుకుంటాడు. అతడు ఏది మంచి ట్రాక్ అనుకుంటే అదే సిద్దం చేస్తాడు. ఆ ట్రాక్‌పైనే ఇరు జట్లను ఆడనివ్వండి. భారత్ తమకు కావాల్సినట్లుగా పిచ్ లను తయారు చేయమని అడిగితే మాత్రం నాకు ఆ జట్టుపై ఎటువంటి సానుభూతి ఉండదు. ఇప్పటికైన పిచ్‌ను తయారు చేసే పనిని క్యూరేటర్‌కు వదిలేయండి. భారత జట్టు నోరు మూసుకొని క్రికెట్‌పై దృష్టి సారిస్తే మంచిది. అప్పుడు గెలిచారు కదా! ఆస్ట్రేలియా పిచ్‌లపై వాళ్లు మంచి ఆల్‌రౌండ్ క్రికెట్‌తో ఏ విధంగా గెలిచారో మార్చిపోయారు అనుకుంటా. అందుకే ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. అయితే రిషబ్ పంత్ లేకపోవడం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. అతడు జట్టుకు ఎంత కీలకమో ఇప్పుడు భారత్‌కు తెలుస్తోంది" అని ఈఎస్ప్పీన్తో చాపెల్ పేర్కొన్నాడు. కాగా ఇండోర్ పిచ్‌కు ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్స్ విధించింది. పిచ్‌ను మరీ నాసిరకంగా తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆసీస్-భారత్ మధ్య ఆఖరి టెస్టు అహ్మదాబాద్ వేదికగా మార్చి9 నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. చదవండి: PSL 2023: ఆజాం ఖాన్ విధ్వంసం.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో! పాపం వసీం -
క్రికెట్లో 'ఆ' స్వరం ఇక వినపడదు..!
ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ సుదీర్ఘ కాలం తర్వాత తన క్రికెట్ వ్యాఖ్యానానికి ముగింపు పలికారు. ఇకపై తాను కామెంటరీ చేయబోనని ఆయన ప్రకటించారు. ఆరోగ్యపరమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇయాన్ వెల్లడించారు. 78 ఏళ్ల చాపెల్ ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత ప్రతిష్టాత్మక చానల్ 9 ద్వారా తన కామెంటరీని మొదలు పెట్టారు. తన అద్భుత వ్యాఖ్యానంతో క్రికెట్ ప్రపంచంపై ప్రత్యేక ముద్ర వేశారు. సూటి విమర్శలు, సునిశిత విశ్లేషణతో అత్యుత్తమ వ్యాఖ్యాతగా ఎదిగిన చాపెల్ 45 ఏళ్ల పాటు ఈ రంగాన్ని శాసించారు. ఆస్ట్రేలియా తరఫున 75 టెస్టులు ఆడి 5345 పరుగులు చేసిన ఇయాన్ చాపెల్ ఇందులో 30 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించారు. 16 వన్డేల్లో కూడా ఆయన ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించారు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సార్లు స్టార్ ఆటగాళ్లనుంచి విమర్శలు ఎదుర్కొన్నానని...అయితే ఏనాడూ తాను సూటి వ్యాఖ్యానం విషయంలో వెనక్కి తగ్గలేదన్న చాపెల్, క్రికెట్ బాగు కోసమే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. -
ఇయాన్ చాపెల్‌పై ఎదురుదాడి!
మెల్బోర్న్:ఆడటం రాకపోతే.. ఇంట్లో కూర్చోండి. అసలు ఆడటం చేతకాని జట్టును ఆస్ట్రేలియా పర్యటనకు ఎందుకు ఆహ్వానిస్తున్నారు. పాకిస్తాన్ ను ఆసీస్ ఆహ్వానించడం మానితే మంచిది'అని ఇటీవల ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ తీవ్ర విమర్శలు చేశాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా వరుస మూడు టెస్టుల్లో పాకిస్తాన్ ఓటమి అనంతరం చాపెల్ పై విధంగా మండిపడ్డాడు. అయితే ఆదివారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. దీంతో సిరీస్‌ను 1-1 తో సమం చేసి పోరులో నిలిచింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎట్టుకేలకు గెలుపొందడంతో ఆ దేశ క్రికెటర్లు ఇయాన్ చాపెల్‌పై ఎదురుదాడికి దిగారు. 'పాక్ గెలుపులో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ హాఫీజ్ కు అభినందనలు. పాక్ గెలిచింది కదా.. ఇయాన్ చాపెల్ ఇప్పుడేమంటావ్?, అసలు పాకిస్తాన్ గెలిచిన మ్యాచ్‌ను చూశావా?, ఇప్పుడు చాపెల్ ఏం చేస్తున్నాడో?అని షాహిద్ ఆఫ్రిది వ్యంగ్యస్త్రాలు సంధించాడు. మరొకవైపు పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బా వుల్ కూడా తీవ్రంగా చాపెల్ పై మండిపడ్డాడు. 'అదొక బాధ్యాతరాహిత్యమైన ప్రకటనే కాదు.. ఎటువంటి ఉపయోగంలేని స్టేట్మెంట్. శ్రీలంకపై ఇటీవల ఆస్ట్రేలియా వైట్ వాష్ కాలేదా?, భారత్ పై సిరీస్‌ను ఘోరంగా ఓడిపోలేదా? మా చేతిలో యూఏఈలో మీ వైట్‌వాష్ కాలేదా? మరి దాన్ని ఏమంటారు'అని మిస్బా నిలదీశాడు. ఆసీస్ జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు ఆడటం రాకపోతే ఇంట్లోనే కూర్చుంటే మంచిదని ధ్వజమెత్తాడు.దాంతో పాటు ఆసీస్ జట్టుకు చాపెల్ సలహా ఇచ్చేశాడు. కనీసం పోరాడని పాకిస్తాన్ క్రికెట్ జట్టును పర్యటనలకు పిలవడం ఆపితే మంచిదంటూ చాపెల్ అభిప్రాయపడ్డాడు. -
'క్రిస్ గేల్‌ను ప్రపంచవ్యాప్తంగా నిషేధించండి'
బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్ సందర్భంగా టీవీ జర్నలిస్టు మెల్ మెక్‌లాలిన్‌తో అసభ్యంగా మాట్లాడిన వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌పై ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఒక ప్రతిపాదన చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. గేల్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని, దానిపై సహనంతో ఉండాల్సిన అవసరం లేదని చాపెల్ అన్నాడు. ఆస్ట్రేలియాలోని ఏ క్లబ్బూ అతడితో ఇక కాంట్రాక్టు కుదుర్చుకోకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయిస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, అలాగే ఐసీసీకి ఈ మేరకు లేఖ రాసినా పర్వాలేదని తెలిపాడు. లేని పక్షంలో విడివిడిగా అన్ని దేశాలకు ఈ విషయం చెప్పాలని కోరాడు. గేల్‌కు ఇప్పటికే రూ. 6.66 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. బీబీఎల్ తదుపరి సీజన్లో తాను ఆడే అవకాశం ఉండొచ్చని గేల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మెక్‌లాలిన్‌తో తాను కేవలం జోక్ చేశాను తప్ప అంతకంటే ఏమీ అనలేదంటూ క్షమాపణలు చెప్పాడు. అయితే.. క్రిస్‌గేల్ తరచు ఇలా చేస్తూనే ఉంటాడని, అందువల్ల అతడిపై ప్రపంచవ్యాప్త నిషేధం విధిస్తే అది యువ క్రికెటర్లకు గట్టి సందేశం పంపినట్లు అవుతుందని చాపెల్ అన్నాడు. కేవలం రూ. 6 లక్షల జరిమానాతో సరిపెడితే సరిపోదని అభిప్రాయపడ్డాడు. గేల్ గురించి తాను ఏ మహిళతో మాట్లాడినా ఒకేలాంటి సమాధానం వచ్చిందని, అందరూ అతడిపై నిషేధం విధించాలనే అడిగారని చెప్పాడు.