అంపైర్‌గా ఇదే చివరిది..
లీడ్స్: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ తర్వాత ఇంగ్లిష్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ తన 13 ఏళ్ల అంపైరింగ్ కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకోబోతున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘ అంపైర్‌గా ఇయాన్ గౌల్డ్ కు భారత్-శ్రీలంక మ్యాచే చివరిది’ అని తన సందేశంలో పేర్కొంది.
2006లో సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో అంపైర్‌గా అరంగేట్రం చేసిన గౌల్డ్... నాలుగు వరల్డ్‌కప్‌ల్లో అంపైర్‌గా వ్యవహరించారు. 2007, 2011, 2015, 2019 వరల్డ్‌కప్‌లో అంపైర్‌గా వ్యవహరించారు. 2011 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌కు సైతం ఇయాన్ గౌల్డ్ అంపైర్‌గా సేవలందించారు. ఆ మ్యాచ్ గౌల్డ్ అంపైరింగ్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక ఆటగాడిగా ఇంగ్లండ్ తరఫున గౌల్డ్ 18 అంతర్జాతీయ వన్డేలు ఆడారు. 1983 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ఆటగాడిగా ఆయనకు చివరిది.