IAS race
-
Parvathy Gopakumar: ఒంటి చేత్తో విజయం
కారణాలు, సాకులు విజయానికి విరోధులు. లక్ష్యం ఉన్నవారు ఆకాశాన్ని, పాతాళాన్ని ఏకం చేసి అనుకున్నది సాధిస్తారు. 12వ ఏట కుడి చేతిని కోల్పోయిన పార్వతి గోపకుమార్ సివిల్స్ 2023లో 282వ ర్యాంక్ సాధించడానికి ఒంటి చేత్తో పోరాడింది. ‘మీరు సంతోషంగా ఉంటేనే సరిగ్గా చదవగలరు’ అంటున్న పార్వతి సమస్యలను జయించగల చిరునవ్వును సొంతం చేసుకుంది. పార్వతి గోపకుమార్ సంతోషంగా ఉంది. ఆమెకు కలెక్టర్ కావాలని ఉంది. సివిల్స్ 2023 ఫలితాలలో 282 ర్యాంక్ సాధించింది. కాని ఆ ర్యాంక్‌కు ఐ.ఏ.ఎస్. రాకపోవచ్చు. కాని దివ్యాంగ కోటాలో చూసినప్పుడు ఆమెది టాప్ ర్యాంక్. కనుక రావచ్చు.‘మాది అలెప్పి. బెంగళూరు నేషనల్ లా స్కూల్లో చదువుకున్నాను. ఆ సమయంలో అలెప్పి కలెక్టరేట్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నాటి కలెక్టర్ ఎస్.సుహాస్ పనిచేసే విధానం, కలెక్టర్ స్థానంలో ఉంటే ప్రజలకు చేయదగ్గ సేవ చూసి నాక్కూడా ఐ.ఏ.ఎస్. కావాలనిపించింది. ఆ విషయం తెలిశాక కలెక్టరేట్లో అందరూ నన్ను అందుకు కష్టపడమని ్రపోత్సహించారు. 2022లో మొదటిసారి సివిల్స్ రాసినప్పుడు ప్రిలిమ్స్ దాటలేకపోయాను. ఒక సంవత్సరం విరామం ఇచ్చి 2023లో రెండోసారి రాశాక ఈ ర్యాంక్ తెచ్చుకున్నాను’ అని తెలిపింది పార్వతి. ఇప్పుడు ఆమె వయసు 26 సంవత్సరాలు. 7వ తరగతిలో ప్రమాదం2010లో పార్వతి ఏడవ తరగతిలో ఉండగా కారు ప్రమాదంలో ఆమె కుడిచేయి మోచేతి వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ వయసులో అలాంటి నష్టం ఎవరికైనా పెద్ద దెబ్బగా ఉంటుంది. అయితే తండ్రి గోపకుమార్, తల్లి శ్రీకళ ఇచ్చిన ధైర్యంతో వెంటనే ఎడమ చేత్తో రాయడం ్రపాక్టీసు చేసింది పార్వతి. ఆ తర్వాత మూడు నెలల్లో వచ్చిన పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు సిలికాన్, ΄్లాస్టిక్లతో చేసిన కృత్రిమ హస్తాన్ని అమర్చుకుంది.‘నాకు దివ్యాంగులు అనే పదం నచ్చదు. అందులో ఏదో బుజ్జగింపు ఉంటుంది. వికలాంగులను వికలాంగులుగానే పిలుస్తూ సమాన గౌరవం ఇవ్వాలి. చేయి కోల్పోయాక నా జీవితమే మారిపోయింది. జనం వికలాంగులతో ఎంతో మొరటుగా వ్యవహరిస్తారు. నువ్వు బ్రా ఎలా వేసుకుంటావు, ΄్యాడ్ ఎలా పెట్టుకుంటావు అని అడిగినవారు కూడా ఉన్నారు’ అని చెబుతుంది పార్వతి.మహిళా దివ్యాంగుల కోసంఐ.ఏ.ఎస్ అయ్యాక దివ్యాంగుల కోసం, ముఖ్యంగా మహిళా దివ్యాంగుల కోసం పని చేయాలనుకుంటోంది పార్వతి. ‘ప్రేమలో పడి శారీరక వాంఛను వ్యక్తం చేసే దివ్యాంగుల సినిమాలు మీరెప్పుడైనా చూశారా? దివ్యాంగులకు ప్రేమ ఏమిటి అనే ధోరణి మనది. ఇక మహిళా దివ్యాంగులైతే పెళ్లి చేసుకుని భర్త ఎదుట ఆత్మన్యూనతతో ఉండేలా తయారు చేశారు. శారీరక లోపం శరీరానికి సంబంధించింది. మేము పొందాల్సిన ప్రేమ, గౌరవం, లైంగిక జీవితం పట్ల మాకు సమాన హక్కు ఉంది. కొందరు అబ్బాయిలు మమ్మల్ని ప్రేమించి ఉద్ధరిస్తున్నామనుకుంటారు. ఇందులో ఉద్ధరణ ఏమీ లేదు. మేము కూడా సమాన మనుషులమే. అందరిలాగే మేము కూడా’ అంటోందామె. -
Srishti Dabas: పగలు ఉద్యోగం... రాత్రి చదువు.. ఇప్పుడు ఐ.ఏ.ఎస్.
సృష్టి దబాస్ ముంబై ఆర్.బి.ఐ.లో హెచ్.ఆర్.లో పని చేస్తుంది. ఉద్యోగానికి రానూ పోనూ సమయం పని ఒత్తిడి ఇవేవీ ఆమె ఐ.ఏ.ఎస్. లక్ష్యానికి అంతరాయం కలిగించలేదు. కేవలం సొంతంగా చదువుకొని యు.పి.ఎస్.సి. 2023లో టాప్ 6 వ ర్యాంక్ సాధించింది. ఆమె పరిచయం. ముంబై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ స్థాయిలో హెచ్.ఆర్.లో పని చేస్తున్న సృష్టి దబాస్ నెల జీతం 2,80,000. బహుశా ఒక జిల్లా కలెక్టర్‌కు కూడా అంతే ఉండొచ్చు. లేదా దరిదాపుల్లో ఉండొచ్చు. 25 ఏళ్ల వయసులో అంత జీతం వస్తున్న ఉద్యోగం (కాంపిటిటివ్ ఎగ్జామ్ రాసి సాధించింది) వేరొకరికి ఉంటే చాలు ఈ జీవితానికి అనుకునేవారు. కాని సృష్టి అలా అనుకోలేదు. ముంబైలో తన రూమ్ నుంచి ఆఫీస్‌కు రోజూ తిరుగుతూనే, ఉద్యోగం చేస్తూనే ఐ.ఏ.ఎస్ కల నెరవేర్చుకోవాలనుకుంది. సాధించింది. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించడం అంటే మాటలు కాదు. ఆమె చెప్పినట్టుగా ‘దాని వెనుక చాలా కష్టం ఉంది’. అవును. కష్టం లేనిది ఏ విజయమూ దక్కదు. ముందు కుటుంబం ఢిల్లీలో పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సృష్టి వెంటనే ఉద్యోగం చేసి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంది. పోటీ పరీక్ష రాసి ‘సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్’మంత్రిత్వ శాఖ’లో ఉద్యోగం సంపాదించింది. మరో పోటీ పరీక్ష రాసి రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించి ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ‘నా కుటుంబం కుదురుకోవాలనుకున్నాను. అందుకే ఉద్యోగాలు చేశాను. నాకు చదువుకోవాలని ఉన్నా ఓపెన్ యూనివర్సిటీ ద్వారానే ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ చదివాను’ అని చెప్పిందామె. సృష్టి తండ్రి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏ.ఎస్.ఐ. స్థాయికి వచ్చిన మధ్యతరగతి ఉద్యోగి. తల్లి గృహిణి. సృష్టి బాల్యం నుంచి కూడా చదువులో చురుగ్గా ఉండేది. మొదటి అటెంప్ట్ టాప్ 10 ర్యాంకుల్లో స్థానం సంపాదించాలంటే చాలామంది రెండోసారి, మూడోసారి ప్రయత్నించి సాధిస్తుంటారు. కాని సృష్టి తన మొదటి ప్రయత్నంలోనే 6వ ర్యాంకు సాధించింది. అదీ ఉద్యోగం చేస్తూ. ‘ఇదెలా సాధ్యం’ అనడిగితే ‘ఉద్యోగం చేస్తూ చదవాలని నిశ్చయించుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా నా మనసుకు తర్ఫీదు ఇచ్చుకున్నాను. నా ఉద్యోగం ఐదు రోజులే. శని, ఆదివారాలు పూర్తిగా చదివేదాన్ని. తెల్లవారు జామున లేవడం నాకు అలవాటు. అప్పుడు చదివేదాన్ని. ఆఫీసు నుంచి తిరిగి వచ్చి అలసట ఉన్నా చదివేదాన్ని. మా అమ్మ నా కష్టం చూసి సతమతమయ్యేది. కాని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను. మా ఆఫీస్‌లో కూడా నాకు ్రపోత్సాహం దొరికింది. పనిలో కాసేపు విరామం దొరికినా ఆర్.బి.ఐ.లోని లైబ్రరీకి వెళ్లి చదువుకునేదాన్ని. నాకున్న సెలవులని పొదుపుగా వాడి ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు, ఇంటర్వ్యూకు ముందు ఉపయోగించుకున్నాను’ అని తెలిపింది సృష్టి. చట్ట ప్రకారం సృష్టి అటెండ్ అయిన మాక్ ఇంటర్వ్యూల్లో ‘మీ నాన్న పోలీస్ కదా. నువ్వు పోలీసు వారి పని స్వభావంలో ఎటువంటి మార్పు తెస్తావ్’ అని అడిగితే ‘ముందు ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. ఖాళీల వల్ల పని ఒత్తిడి పోలీసులకు ఎక్కువ. అలాగే సాంకేతికంగా వారికి ఆధునిక ఆయుధాలు, ఎక్విప్మెంట్ సమకూర్చాలి’ అని చెప్పింది. ‘ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్కౌంటర్లను ఎలా చూస్తావ్’ అనంటే ‘అది చట్టసమ్మతం కాదు. నేనైతే ఎన్కౌంటర్లను కేవలం ఆత్మ రక్షణకు మాత్రమే ఉపయోగిస్తాను’ అని తెలిపింది. ‘బుల్డోజర్లతో ఆక్రమణల తొలగింపు పై నీ అభి్రపాయం ఏమిటి?’ అనడిగితే ‘కూల్చడం కన్నా అక్కడ ఉన్నవారికి పునరావాసం కల్పించడం కీలకం’ అంది. అంతర్జాతీయల వ్యవహారాలను తన ప్రధాన ఆసక్తిగా చెప్పిన సృష్టి మన దేశ అంతర్జాతీయ వ్యవహారాలపై లోతైన అవగాహన కలిగి ఉంది. ఆమె కథక్ డాన్సర్ కూడా. ‘భారతదేశంలో ఎన్ని క్లాసికల్ డాన్సులున్నాయి?’ అనే ప్రశ్నకు ‘మన సంగీత నాటక అకాడెమీ 8 డాన్సులను గుర్తించింది. కాని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చౌవ్ డాన్స్‌ను కూడా క్లాసికల్‌గా పేర్కొంది. కాబట్టి సరైన ఆన్సర్ 8 కావచ్చు. 9 కూడా కావచ్చు’ అంది సృష్టి. ఆమె సక్సెస్ స్టోరీ చాలామందికి తప్పకుండా స్ఫూర్తి అవుతుంది -
ఐఏఎస్ కలని చిదిమేసిన నగ్న వీడియో
బెంగళూరు: ఎంబీఏ పూర్తి చేశాడు. మంచి ప్యాకేజితో ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వచ్చాయి. కానీ అతడి దృష్టి మాత్రం కలెక్టర్ జాబ్ మీదనే. ఐఏఎస్ సాధించి ప్రజలకు సేవ చేయాలని భావించాడు. దీక్షగా చదవడం ప్రారంభించాడు. ఇలానే మరికొంత కాలం చదువు కొనసాగిస్తే.. అతడి కల సాకారమయ్యేది. కానీ ఫేస్బుక్ అతడి జీవితాన్ని, కలని చిదిమేసింది. ఓ యువతి పేరుతో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ అతడి జీవితానికి ఎండ్ కార్డ్ వేసింది. ‘ఆమె’ మాయలో పడి నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాడు. దాన్ని రికార్డు చేసిన సైబర్ నేరగాళ్లు డబ్బుల కోసం అతడిని బెదిరించడం ప్రారంభించారు. అప్పటికే బాధితుడు వారికి కొంత డబ్బు ఇచ్చాడు. కానీ వేధింపులు ఆగకపోవడంతో.. ధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చాడు. ఆ వివరాలు.. బాధితుడు భట్టరహళ్లి సమీపంలోని కేఆర్ పురంలో నివాసం ఉంటున్నాడు. ఎంబీఏ పూర్తి చేసి.. ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం అతడు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. అయితే బాధితుడి ఫేస్‌బుక్‌కి వచ్చిన సందేశాలను బట్టి అతడి సోదరి.. సైబర్ నేరగాళ్ల బెదిరింపులు తట్టుకోలేకనే తన సోదరుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని గ్రహించింది. అసలు సైబర్ సైకోగాళ్లు తన అన్నను ఏ విషయంలో బెదిరిస్తున్నారో తెలుసుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలో బాధితుడు మరణించిన రెండు రోజుల తర్వాత నేహా శర్మ అనే అకౌంట్ నుంచి ‘‘నీ ఫోన్ నంబర్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది’’ అంటూ హెచ్చరిస్తూ ఓ సందేశం వచ్చింది. దాంతో బాధితుడి సోదరి సైబర్ నేరగాళ్లకు తన బంధువు నంబర్ సెండ్ చేసింది. ఆ తర్వాత తేజాస్ మరేష్ భాయ్ అనే వ్యక్తి నుంచి తన బంధువు నంబర్‌కి మెసేజ్ వచ్చింది. తేజాస్ తమకు డబ్బులు ఇవ్వాలని బెదిరించడం ప్రారంభించాడు. దాంతో మృతుడి సోదరి దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం బాధితుడికి నేహా శర్మ అనే ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. యాక్సెప్ట్ చేశాడు. మెసేజ్‌లతో ప్రారంభం అయిన వారి పరిచయం నగ్నంగా వీడియో కాల్ చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ రోజు యువతి బాధితుడికి కాల్ చేసి.. తన దుస్తులు తొలగించి పూర్తి నగ్నంగా మారింది. ఆ తర్వాత అతడిని కూడా దుస్తులు తొలగించాల్సిందిగా కోరింది. ఆమె కోరిక మేరకు బాధితుడు నగ్నంగా మారి ఫోన్ మాట్లాడటం ప్రారంభించాడు. దాంతో సైబర్ నేరగాళ్లు బాధితుడి వీడియో రికార్డ్ చేశారు. ఆ తర్వాత అతడికి ఫేస్బుక్ ద్వారా ఈ నగ్న వీడియో పంపారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. ఈ వీడియోని అతడి స్నేహితులకు సెండ్ చేస్తానని బెదిరించారు సైబర్ నేరగాళ్లు. దాంతో బాధితుడు తన ఫ్రెండ్స్ వద్ద అప్పు చేసి మరి 36 వేల రూపాయలు వారికి పంపించాడు. ఆ తర్వాత కూడా బెదిరింపులు ఆగకపోవడంతో.. బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: నేను పక్కా పల్లెటూరి వాడిని: ఐఏఎస్ ‘ఆమె’గా వల.. న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్ -
సింహపురి సివిల్స్ తేజాలు
సింహపురిలో ప్రతిభావంతులకు కొదవలేదనే విషయాన్ని గురువారం వెల్లడైన యూపీఎస్సీ ఫలితాలు మరోసారి నిరూపించాయి. జిల్లాలోని వెంకటగిరి వాసి వంశీకృష్ణ 103, నెల్లూరుకు సమీపంలోని గుడిపల్లిపాడుకు చెందిన అంచిపాక సునీల్ 426, నాయుడుపేట నివాసి ఎద్దల బాలాజీకిరణ్ 846వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. వీరిలో వంశీకృష్ణ డెంటిస్ట్. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ రేసులో నిలిచారు. దివంగత ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం స్వగ్రామం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన సునీల్ మె రుగైన ర్యాంకు సాధించడం విశేషం. నాయుడుపేట నివాసి బాలాజీకిరణ్ సైతం ప్రతిభ కనబరి చారు. ఈ ముగ్గురూ జిల్లా యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఒక యువకుడు కలలు కన్నాడు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు కఠోర శ్రమ చేశాడు. శ్రమ వృథాకాలేదు. లక్ష్యాన్ని సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆ యువకుడే వెంకటగిరికి చెందిన దంతవైద్యుడు కోనా వంశీకృష్ణ. విద్యార్థుల జీవితాశయమైన సివిల్స్‌లో మొదటి ప్రయత్నంలోనే 103వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికై జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారు. వెంకటగిరిటౌన్ : వెంకటగిరికి చెందిన కోనా వెంకటేశ్వరరావు, పద్మావతి దంపతుల కుమారుడు వంశీకృష్ణ. వెంకటేశ్వరరావు పట్టణంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నారు. తన కుమారుడు వంశీకృష్ణను చదువులో రాణిస్తుండటం తో ప్రోత్సహించేవారు. వంశీకృష్ణ పట్టణంలోని సెయిం ట్ ఫ్రాన్సిస్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు. తిరుపతిలో వికాస్ జూ నియర్ కళాశాలలో ఇంటర్ (బైపీసీ) పూర్తి చేశారు. అనంతరం నెల్లూరు నారాయణ వైద్యశాలలో దంతవైద్య కోర్సులో చేరి గోల్డ్‌మెడల్ సాధించారు. వంశీకృష్ణ తమ్ముడు సాయి బి.టెక్ పూర్తి చేశాడు. ఏదో సాధించాలనే తపనతో.. డెంటిస్ట్‌గా వంశీకృష్ణ సంతృప్తి చెందలేదు. జీ వితంలో ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల అతనిలో రోజురోజుకూ పెరిగాయి. బిడ్డ ఆశయాన్ని, లక్ష్యాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వంశీకృష్ణను వెన్నుతట్టి ప్రోత్సహించారు. డెంటిస్ట్‌గా తక్కువ మందికి సేవచేసే అవకాశం ఉంటుందని భావించి ఐఏఎస్ సాధించాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని వాజీరామ్ అండ్ రవి ఐఏఎస్ అకాడమీలో సివిల్స్‌కు 16 నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. గురువారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 103వ ర్యాంక్ సాధించారు.తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి యువతకు ఆదర్శంగా నిలిచారు. పలువురు అభినందనలు వంశీకృష్ణ జాతీయస్థాయి పరీక్షల్లో ప్రతిభచూపడంతో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు అభిందనలు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ విశ్రాంత రీజనల్ డెరైక్టర్ నాగం శేషమనాయుడు సివిల్స్ విజేత వంశీకృష్ణ ఇంటికి వచ్చి కేక్ తినిపించి అభినందనలు తెలిపారు. అలాగే పలువురు ప్రముఖులు ఫోన్‌ద్వారా అభినందించారు. లక్ష్యంను సాధించేందుకు శ్రమే మార్గం పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు. మారుమూల గ్రామాల్లో ప్రతిభగల విద్యార్థులు అనేక మంది ఉన్నారు. వారిలో యూపీఎస్సీ, గ్రూప్స్ పంటి పరీక్షలపై అవగాహన లేదు. జాతీయస్థాయి పరీక్షలకు ఎంపిక కాలేమన్న భావన విడనాడాలి. ఆశావహ దృక్పథం అలవరుచుకోవాలి. ప్రతిరోజూ 12 గంటలు కష్టపడి చదివితే విజయం సాధించవచ్చు. యూపీఎస్సీ పరీక్షకు హాజరుకావాలనే ఆశయం ఉన్నవారు నన్ను సంప్రదిస్తే తప్పక సలహాలు అందిస్తాను. వెంకటగిరిలో ఉన్నప్పుడల్లా వారి అనుమానాలను నివృత్తి చేసి దిశా నిర్దేశం చేస్తాను. కె వంశీకృష్ణ