IBS
-
సొంత హోటల్లో టాటా చేసిన పనికి ఫిదా!
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఐబీఎస్ సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వీకే మాథ్యూస్.. టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర సంఘటలను పంచుకున్నారు.రతన్ టాటా వ్యక్తిత్వంలో తనకు బాగా నచ్చేది ఆయన మానవత్వం అని, దీంతోపాటు ఆయనలో హాస్య చతురత కూడా ఉందని మాథ్యూస్ చెప్పారు. రతన్ టాటా ఉన్నారంటే ఎంతటి సీరియస్ వాతావరణాన్ని అయినా తన హాస్యంతో తేలికపరచగలరని పేర్కొన్నారు.తానెవరో తెలియకుండా..“యూఎస్ పర్యటనలో రతన్ టాటాతో కొంత సమయం గడిపే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంగా జరిగిన రెండు సంఘటనలు నాకు ఎప్పుడూ గుర్తంటాయి” అని వాటి గురించి వెల్లడించారు మాథ్యూస్.ఒక రోజు న్యూయార్క్‌లోని టాటా సొంత హోటల్లో వీరిద్దరూ అల్పాహారం చేశారు. అయితే రతన్ టాటా ఓనర్‌గా తన దర్పం ప్రదర్శించలేదని, అసలు తానెవరో అక్కడి సిబ్బందికి చెప్పలేదని మాథ్యూస్ గుర్తుచేసున్నారు. ఇదే ఆయన నిరాడంబరతకు నిదర్శనమని చెప్పారు.“అదే రోజు తరువాత నేను, నా కుటుంబం మరొక రెస్టారెంట్‌కి వెళ్లగా అక్కడ రతన్ టాటా కనిపించారు. ఆయన బిల్లును స్వయంగా తన క్రెడిట్ కార్డ్‌తో చెల్లించడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. అది ఆయన ఎంత సింపుల్‌గా ఉంటారో తెలియజేసింది” అని మాథ్యూస్ గుర్తుచేసున్నారు.మరో కోణంఇక రతన్ టాటాలో ఉన్న మరో కోణం ఆయన హాస్య చతురత. "తన ట్రేడ్‌మార్క్ హాస్యంతో రతన్ టాటా నన్ను, 'నేను నిన్ను వెంటాడుతున్నానా, లేక నువ్వు నన్ను వెంటాడుతున్నావా?' అన్నారు. ఆ తేలికైన వ్యాఖ్య పరిస్థితితో సంబంధం లేకుండా ఇతరులతో కనెక్ట్ అయ్యే ఆయన స్వభావాన్ని తెలియజేసింది” అని మాథ్యూస్ వివరించారు. -
ఐబీఎస్ సాఫ్ట్వేర్ చేతికి ఏఎఫ్‌ఎల్‌ఎస్
తిరువనంతపురం: యాక్సెంచర్ ఫ్రైట్ అండ్ లాజిస్టిక్స్ సాఫ్ట్వేర్ (ఏఎఫ్‌ఎల్‌ఎస్)ను కొనుగోలు చేసినట్లు ఐబీఎస్ సాఫ్ట్వేర్ తెలిపింది. అయితే డీల్ విలువ మాత్రం వెల్లడి కాలేదు. ఈ ఒప్పందంతో తాము ఆకాశ, సముద్ర మార్గంలో రవాణా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు టెక్నాలజీ సర్వీసులు అందించడానికి సాధ్యపడనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వీకే మాథ్యూస్ తెలిపారు. తమ కార్గో, లాజిస్టిక్స్ వ్యాపారాన్ని అలాగే కార్యకలాపాలను అంతర్జాతీయంగా మరింత విస్తరించుకునేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ పరిశ్రమకు సాఫ్ట్వేర్ సర్వీసులను (ఎస్ఏఏఎస్) ఐబీఎస్ అందిస్తోంది. ట్రావెల్, రవాణా, లాజిస్టిక్స్ కోసం చెన్నైలో కొత్తగా డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది భారత్‌లో తమకు నాలుగోదని వివరించింది. -
మహిళ ప్రాణం తీసిన కారు రేసింగ్
మణికొండ: అతిగా మద్యం సేవించి మూడు కార్లతో రేసింగ్ పెట్టుకున్న విద్యార్థులు ఓ మహిళ ప్రాణం తీసిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని జన్వాడ వద్ద మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శాంతమ్మ (55) అనే మహిళ భర్త నర్సింహులుతో కలిసి స్కూటీపై మంగళవారం సాయంత్రం ఇంటికి వెళుతుంది. అదే సమయంలో వెనకనుంచి వచ్చిన ఓ కారు వేగంగా ఢీ కొనడంతో ఆమె ఎగిరి పడింది. ఆమెకు తీవ్ర గాయాలు కావటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఐబీఎస్ కళాశాల విద్యార్థులు అతిగా మద్యం తాగి మూడు కార్లతో ప్రధాన రోడ్డుపై రేసింగ్ పెట్టుకున్నారు. అందులో భాగంగా అతివేగంగా వెళుతున్న ఓ కారు స్కూటీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శాంతమ్మ భర్త నర్సింహులు స్వల్పగాయాలయ్యాయి. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన వ్యక్తులను ఇంకా గుర్తించలేదని ఎస్సై కృష్ణయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామన్నారు. -
ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన ఐబీఎస్ కళాశాల ర్యాగింగ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ మతాన్ని కించపరుస్తూ బాధిత విద్యార్ధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ గొడవ మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు శంకర్పల్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేయగా.. మరో అయిదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహ్మద్ ఇమాద్, సోహైల్, వర్షిత్, గణేష్, వాసుదేవ్ వర్మ నే విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇంత జరిగిన నిర్లక్ష్యంగా వ్యవహరించినా కాలేజీ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారు. కాగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి(ఐబీఎస్) కళాశాలలో విద్యార్థి హిమాంక్ బన్సాల్‌పై సీనియర్లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీన జరిగిన ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక్క విద్యార్థిని లక్ష్యంగా చేసుకొని దాదాపు 10 మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. హాస్టల్ గధిలో బంధించి బాధితుడిపై కూర్చొని, పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా గాయపరిచారు. ఈ దృశ్యాలను వీడియో తీయగా.. బాధిత విద్యార్థి దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కళాశాల యాజమాన్యం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దాడికి పాల్పడిన 12 మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. కారణం అదేనా! అయితే ఐసీఎఫ్ఏఐ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. కొంతకాలం లవ్ చేసుకున్నాక వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని అవమానిస్తూ పోస్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తన బంధువైన సీనియర్ విద్యార్థికి చెప్పింది. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. అతడు తన స్నేహితులను వెంటబెట్టుకుని హాస్టల్లో ఉన్న యువకుడిపై దాడి చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ 15 నుంచి 20 మంది సీనియర్లు తన హాస్టల్ గదిలోకి చొరబడి కొట్టారని బన్సల్ ఫిర్యాదులో పేర్కొన్నారు -
IBS ర్యాగింగ్ కేసులో వెలుగు చూస్తున్న మరిన్ని నిజాలు
-
ఐబీఎస్ విద్యార్థుల మధ్య గొడవ.. కేటీఆర్‌కు వీడియో పోస్టు
సాక్షి, హైదరాబాద్: ఓ కళాశాలలో విద్యార్థుల చాటింగ్ వ్యవహారం గొడవలకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. అయితే జూనియర్‌పై సీనియర్లు ర్యాగింగ్ చేశారని, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌కు, సైబరాబాద్ కమిషనర్‌కు షేర్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి (ఐబీఎస్) కళాశాలలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 1న ఇక్ఫాయి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. ఇద్దరూ తమ స్నేహితులకు విషయం చెప్పారు. రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. ఈ విషయం ఇరువర్గాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు కళాశాల యాజమాన్యంతో చర్చించారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం శంకర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ గొడవ పడొద్దని రాజీ కుదిర్చి పంపారు. అయితే.. ఓ విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు.దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాత గొడవ వైరల్ చేస్తున్నారు: సీఐ ఇక్ఫాయి కళాశాల విద్యార్థుల మధ్య ఈ నెల ఒకటో 1న గొడవ జరిగింది. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి.. వారి సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇచ్చి పంపాం. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. అయితే.. కావాలని ఎవరో విద్యార్థులు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. చదవండి: మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..! -
జూనియర్‌పై సీనియర్ విద్యార్థుల దాడి
-
ఆదుకోండి
దిల్సుఖ్నగర్: చదువు కోవాలనే తపన ఉన్నా అమ్మానాన్నలు లేకపోవటంతో అనాథ అయి ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు మణిదీప్ రెడ్డి. వరంగల్ జిల్లా బచ్చన్న పేట మండలం, కేశిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన మణిదీప్, అతని సోదరుడు శశిధర్ రెడ్డిల తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోగా వారిని ఎల్బీనగర్లోని అనాథ విద్యార్థి గృహం నిర్వాహకుడు మార్గం రాజేశ్ చేరదీసి వారి బాగోగులు చూస్తున్నారు. మణిదీప్ రెడ్డి టెన్త్ లో 80 శాతం మార్కులతో ఉప్పల్ సెయింట్ మార్క్స్ స్కూల్, ఇంటర్ 81 శాతంతో దిల్సుఖ్నగర్ ప్రణతి కాలేజీలో, డిగ్రీని 87 శాతంతో చిక్కడపల్లి అరోరా కళాశాలలో ఉత్తీర్ణుడయ్యాడు. అనంతరం నారాయణగూడ ఐఎంఎస్ అకాడమీ ఉచిత కోచింగ్‌లో ఎంబీఏ కోర్స్ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 90.8 శాతం మార్కులతో మహారాష్ట్ర పూనెకు చెందిన ఐబీఎస్ క్యాంపస్‌లో రెండేళ్ల కోర్స్‌కు సీట్ సాధించాడు. ప్రస్తుతం అనాథ విద్యార్థి గృహం మణిదీప్‌కు అండగా నిలిచినా.. కోర్స్ పూర్తి చేసేందుకు మొత్తం రూ.11.31 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. దాతలు సహకరించి మణిదీప్‌కు అండగా నిలవాలని విద్యార్థి గృహం నిర్వాహకుడు మార్గం రాజేశ్ విన్నవిస్తున్నారు. -
లో ఫోడ్మ్యాప్ ఆహారంతో ఇవీ ప్రయోజనాలు...
పరిపరి శోధన కొందరిని ఐబీఎస్, కింది నుంచి గ్యాస్ పోవడం సమస్యలు విపరీతంగా బాధిస్తుంటాయి. ఈ రెండు సమస్యలను చాలావరకు ఆహారంతోనే నివారించవచ్చు అంటున్నారు అధ్యయన వేత్తలు. తిన్న వెంటనే విరేచనానికి వెళ్లాల్సి రావడం, కడుపునొప్పిగా అనిపించడం వంటి సమస్య అయిన ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ , నలుగురిలో చాలా ఇబ్బందిగా అనిపించే కింది నుంచి మాటిమాటికీ గ్యాస్ పోతుండటం వంటి సమస్యలకు ‘లో ఫోడ్మ్యాప్’ డైట్ సమర్థంగా పనిచేస్తుందంటున్నారు పరిశోధకులు. ‘ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్ , డైశాకరైడ్స్ , మోనో శాకరైడ్స్ అండ్ పాలీయాల్స్ ’ అనే రకాల ఆహార పదార్థాల మొదటి అక్షరాలను (ఇంగ్లిష్‌లోని) చేర్చడం ద్వారా ‘ఫోడ్మ్యాప్’ అనే మాటను రూపొందించారు. ఆయా పోషకాల నిర్మాణాన్ని బట్టి, వాటిలోని చక్కెర పదార్థాలను బట్టి ఆ ఆహారాలను అలా పిలుస్తుంటారు. లో ఫోడ్ మ్యాప్ ఆహారం అంటే ఫర్మెంటబుల్ ఆలిగోశాకరైడ్స్, డై శాకరైడ్స్, మోనోశాకరైడ్స్, పాలీయాల్స్ తక్కువగా ఉండే ఆహారాలు అన్నమాట. ఐబీఎస్, కింగడినుంచి గ్యాస్ పోయేవారికోసం ఫోడ్మ్యాప్ తక్కువగా ఉండేలా డైట్ చార్ట్ రూపొందించారు ఆస్ట్రేలియా మెల్బోర్న్కు చెందిన మోనాష్ యూనివర్సిటీ ఆహార నిపుణులు. ఫోడ్మ్యాప్ డైట్ చార్ట్ ప్రకారం... మనం అసలు తీసుకోకూడని ఆహారాలు... పాస్తా, కేక్స్, బిస్కెట్లు, పండ్లలో పీయర్స్, ప్రూన్, పీచెస్, చెర్రీస్ వంటివి, ఆకుకూరలలో బ్రకోలీ, కాలీఫ్లవర్, ఉల్లి, వెల్లుల్లి, బీట్రూట్, పప్పులలో బీన్స్, సోయాబీన్స్ మొదలైనవి. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు... వరి అన్నం, ఓట్స్, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ (ఇక్కడ గ్లూటెన్ ఫ్రీ అంటే లో ఫోడ్మ్యాప్ అని పొరబడకూడదు); పండ్లలో అరటి, నేరేడు, ద్రాక్ష, కీవీ, నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి, పైనాపిల్, స్ట్రాబెర్రీలు; ఆకుకూరలలో క్యారట్, దోస, అల్లం, మిరియాలు, లెట్యూస్, ఆలూ, పాలకూర, టొమాటో వంటివి. ప్రోటీన్లలో చికెన్, ఫిష్, టోఫూ, నట్స్‌లో పల్లీలు, వాల్నట్స్ తీసుకోవచ్చు. ఐబీఎస్, కింది నుంచి గ్యాస్పోవడం ద్వారా బాధపడేవారిని ఎంపికచేసిన ఆస్ట్రేలియా పరిశోధకులు పైన పేర్కొన్న ‘లో-ఫోడ్మ్యాప్ డైట్’ ఇవ్వడం వల్ల 74 శాతం మందిలో మంచి ఫలితాలు కనిపించాయని పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు లండన్ కింగ్స్ కాలేజీ నిపుణులనూ ప్రభావితం చేయడంతో బ్రిటన్‌లోని చాలా మందికి సైతం లో ఫ్యాడ్మ్యాప్ ఆహారం సిఫార్సు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ నిర్వహించిన మరో అధ్యయనంలో సైతం కూడా పై సమస్యలకు లో ఫాడ్‌మ్యాప్ మంచి రిలీఫ్‌ను ఇచ్చిందని తేలింది. ఈ డైట్‌ప్లాన్‌ను అనుసరించడంతో పాటు ఎక్కువ మొత్తాలలో అదేపనిగా తినడం, కెఫిన్, ఆల్కహాల్‌ను తగ్గించడం అవసరమని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘జర్నల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురిత మయ్యాయి. -
‘సహకారం’తో సామాజిక ప్రయోజనం
క్రమబద్ధమైన మార్కెట్లు, గ్రేడింగ్, ప్రామాణీకరణ, సరైన తూనికలు,కొలతలు, గిడ్డంగులు, నిల్వ సౌకర్యాలు, మార్కెట్ సమాచారం లభ్యత,సేకరణ, మద్దతు ధరల నిర్ణయం, మార్కెటింగ్ పర్యవేక్షణ డెరైక్టరేట్ ఏర్పాటు లాంటి ప్రభుత్వ చర్యలు వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపర్చడానికి దోహదపడుతున్నాయి. పెద్ద రైతులకు విక్రయించిన తర్వాత మిగులు అధికంగా ఉంటోంది. ప్రభుత్వ చర్యల కారణంగా వీరే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే వాదన కూడా ఉంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు తమ ఉత్పత్తిలో అధిక భాగాన్ని పరపతి అవసరాల కోసం ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లకు విక్రయిస్తున్నారని అనేక అనుభవ పూర్వక ఆధారాలు తెలియజేస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందే క్రమంలో సహకార మార్కెటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. రైతులు సహకార ప్రాతిపదికపై మార్కెటింగ్ సంఘాలుగా ఏర్పడి వస్తువులను విక్రయించుకునే విధానమే సహకార మార్కెటింగ్. సహకార మార్కెటింగ్ భారత్‌లో సహకార మార్కెటింగ్ వ్యవస్థ రెండు రకాలుగా ఉంది. మొదటి రకంలో సహకార మార్కెటింగ్ వ్యవస్థ రెండంచెల్లో ఉంది. దీనిలో భాగంగా కిందిస్థాయిలో ప్రాథమిక సంఘాలు, అత్యున్నత స్థాయిలో రాష్ట్ర సొసైటీ ఉంటాయి. రెండో రకంలో సహకార మార్కెటింగ్ వ్యవస్థ మూడంచెలుగా ఉంటుంది. ఈ విధానంలో.. గ్రామీణ స్థాయిలో ప్రాథమిక సంఘాలు, జిల్లా స్థాయిలో కేంద్ర మార్కెటింగ్ సంఘాలు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార సంఘం ఉంటాయి. ఆల్ - ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ సిఫారసుల ఆధారంగా రెండో పంచవర్ష ప్రణాళికలో సహకార మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధికి చర్యలు ప్రారంభించారు. వీటిని మూడో ప్రణాళికలో విస్తరించారు. ప్రస్తుతం సహకార మార్కెటింగ్ వ్యవస్థలో భాగంగా మండి స్థాయిలో 2633 సాధారణ అవసరాలకు సంబంధించిన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘాలు, నూనె గింజలకు సంబంధించి 3290 ప్రత్యేక ప్రాథమిక మార్కెటింగ్ సంఘాలు, 172 జిల్లా లేదా కేంద్ర మార్కెటింగ్ సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. జాతీయ స్థాయిలో సహకార మార్కెటింగ్ వ్యవస్థకు శిఖరాగ్ర సంస్థగా ‘నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటీవ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ూఅఊఉఈ)’ను ఏర్పాటు చేశారు. సేకరణ, పంపిణీ, ఎంపిక చేసిన వ్యవసాయ వస్తువుల ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలను ‘నాఫెడ్’ నిర్వహిస్తోంది. ఇది ప్రభుత్వానికి కేంద్ర నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ త్వరగా పాడవని పప్పు ధాన్యాలు, నూనె గింజలు తదితర ఉత్పత్తులకు సంబంధించి మద్దతు ధర కార్యకలాపాలను నిర్వహిస్తోంది. త్వరితంగా కుళ్లిపోయే బంగాళాదుంప, ఉల్లిపాయలు, ద్రాక్ష, ఆరెంజ్, గుడ్లు, ఆపిల్స్, మిరపకాయలు, బ్లాక్ పెప్పర్ లాంటి విషయంలో మార్కెట్ జోక్యాన్ని చేపడుతుంది. సహకార వ్యవస్థ ద్వారా మార్కెటింగ్ చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల విలువలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. కానీ సహకార మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లో ఒకేవిధంగా లేదు. అనేక రాష్ట్రాల్లో సహకార మార్కెటింగ్ సంఘాల ఆర్థిక ప్రగతి సంతృప్తికరంగా లేకపోవడం వల్ల ఇవి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఆహార ప్రాసెసింగ్: ప్రపంచంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తుల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం పండ్ల ఉత్పత్తిలో భారత్ వాటా 10% కాగా, కూరగాయల ఉత్పత్తిలో 13%. నేషనల్ హార్టికల్చర్ బోర్డ గణాంకాల ప్రకారం 2012-13లో భారత్‌లో పండ్ల ఉత్పత్తి 81.285 మిలియన్ మెట్రిక్ టన్నులు, కూరగాయల ఉత్పత్తి 162.19 మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదైంది. పండ్ల ఉత్పత్తి విస్తీర్ణం 6.98 మిలియన్ హెక్టార్లు, కూరగాయల ఉత్పత్తి విస్తీర్ణం 9.21 మిలియన్ హెక్టార్లు. 2013-14లో పండ్లు, కూరగాయల ఎగుమతుల విలువ రూ. 8760.96 కోట్లకు చేరుకుంది. దేశంలోని మొత్తం పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 35% వృథా కావడానికి అవస్థాపనా సౌకర్యాలైన శీతల గిడ్డంగులు, గిడ్డంగులు, రిఫ్రిజిరేటేడ్ ట్రక్ల కొరత లాంటివి కారణమవుతున్నాయి. దేశంలో ఇటీవల ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధి ప్రాధాన్యం పెరిగింది. భారత్‌లో సహకార సంఘాల్లా ఏ ఇతర రంగం కూడా రైతులకు చేరువ కాలేదు. ఈ నేపథ్యంలో ఆహార ప్రాసెసింగ్ విషయంలో సహకార సంఘాలు దృష్టి సారించడం ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. సహకార సంఘాలు గిడ్డంగి వసతి, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు, త్వరగా పాడయ్యే వస్తువుల రవాణా కోసం రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులను సమకూర్చుకోవాలి. సహకార సంఘాలు - సామాజిక ప్రయోజనం 1. సహకార సంఘాల ఉత్పత్తులకు సంబంధించి కామన్బ్రాండ్లను అభివృద్ధి చేసి వాటిని వినియోగదారులకు చేరువ చేయడం ద్వారా సమాజానికంతటికీ ప్రయోజనం కలుగుతుంది. సహకార సంఘం సభ్యులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. తద్వారా వారి ఆదాయస్థాయి పెరుగుతుంది. ఉదా: ప్రాసెసింగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే ఆయా ప్లాంట్లలో సహకార సంఘ సభ్యులకు ప్రత్యక్షంగా, ప్రాసెస్డ్ ఫుడ్ (్కటౌఛ్ఛిటట ఊౌౌఛీ) తయారు చేయడానికి అవసరమైన ముడిసరుకులను సరఫరా చేసే రైతులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 2. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో సహకార సంఘాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. మార్కెట్లో ధరల స్థిరీకరణకు సహకార సంఘాల ఉత్పత్తులు దోహదపడుతున్నాయి. ప్రైవేట్ డెయిరీలు పాల ప్యాకెట్ల సరఫరా విషయంలో సహకార డెయిరీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నందువల్ల ధరలు కొంతమేర నియంత్రణలో ఉంటున్నాయి. 3. వ్యవసాయ ఆధారిత సహకార సంఘాలు వాటి ఉత్పత్తుల మార్కెటింగ్‌లో విజయవంతమైతే వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు అవకాశం ఉంటుంది. ఫార్మింగ్ కో-ఆపరేటివ్స, సర్వీస్ సొసైటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఫెర్టిలైజర్ కో-ఆపరేటివ్స, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ పనిముట్ల తయారీ యూనిట్లు మొదలైనవి వ్యవసాయ ఉత్పత్తులు, ఉపాధి పెంపుదలలో ప్రధాన భూమిక పోషిస్తాయి. 4. స్వదేశీ మార్కెట్లో సహకార ఉత్పత్తుల కామన్బ్రాండ్లు అభివృద్ధి చెందితే ఆయా ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం పెరిగి విదేశీ వాణిజ్యం వృద్ధి చెందుతుంది. భారత్‌లోని డెయిరీ, టెక్స్టైల్స్, తోలు ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ఉత్పత్తులకు సంబంధించి మొదటగా స్వదేశీ డిమాండ్ పెరుగుదలపై సహకార సంఘాలు దృష్టి సారించాలి. 5. సహకార సంఘాల అభివృద్ధి ద్వారా పటిష్టమైన, విలువ ఆధారిత సమాజం రూపుదిద్దుకుంటుంది. తద్వారా సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల్లో సాధికారత సాధించవచ్చు. 6. {పజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు తగిన సేవలు అందించడంలో సహకార సంఘాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. బియ్యం, గోధుమ, పంచదార, గోధుమ పిండి, కిరోసిన్‌ను సబ్సిడీ ధర వద్ద పంపిణీ చేయగలుగుతాయి. ప్రభుత్వ ఉచిత పంపిణీ పథకమైన చేనేత వస్త్రాల (చీరలు, దోవతిలు) పంపిణీని సహకార సంఘాల ద్వారా చేపడుతున్నారు. మాదిరి ప్రశ్నలు 1. 1915లో తొలి సహకార మార్కెటింగ్ సంఘాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? 1) ఆంధ్రప్రదేశ్ 2) కర్ణాటక 3) తమిళనాడు 4) పంజాబ్ 2. గిరిజనుల అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను ప్రైవేట్ వ్యాపారుల నుంచి రక్షించడానికి ఏర్పాటైన సంస్థ? 1) ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2) ఐఎఫ్ఎఫ్సీవో 3) ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 4) ఏదీకాదు 3. కేంద్ర గిడ్డంగుల సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1) 1957 2) 1963 3) 1964 4) 1969 4. నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? 1) హైదరాబాద్ 2) కోల్‌కతా 3) న్యూఢిల్లీ 4) ముంబయి 5. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని సూచించిన కమిటీ? 1) రంగరాజన్ కమిటీ 2) వై.కె. అలఘ్ కమిటీ 3) పద్మనాభయ్య కమిటీ 4) వై.వి. రెడ్డి కమిటీ 6. నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం? 1) 1961 2) 1962 3) 1963 4) 1964 సమాధానాలు: 1) 2 2) 3 3) 1 4) 4 5) 2 6) 3. సహకార మార్కెటింగ్ ప్రయోజనాలు: 1. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అంతిమ కొనుగోలుదార్లతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడతాయి. 2. రైతులకు తమ ఉత్పత్తుల విక్రయంలో బేరమాడే శక్తి పెరుగుతుంది. 3. సహకార మార్కెటింగ్ సంఘాల నుంచి రైతులు తగినంత పరపతి పొందగలుగుతారు. తద్వారా గిట్టుబాటు ధరలు లభించే వరకు రైతులు తమ ఉత్పత్తులను విక్రయించకుండా వేచి ఉండవచ్చు. ఫలితంగా వారికి లభించే ప్రతిఫలాల్లో పెరుగుదల ఉంటుంది. 4. సహకార మార్కెటింగ్ సంఘాలకు సొంత రవాణా సాధనాలు ఉండటం వల్ల రవాణా వ్యయంలో తగ్గుదల ఏర్పడుతుంది. 5. సహకార సంఘాలు గిడ్డంగి సౌకర్యాలను కల్పిస్తున్నందు వల్ల గిట్టుబాటు ధర లభించే వరకు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చు. 6. {శేణీకరణ, ప్రామాణీకరణ ఉంటుంది. 7. మార్కెట్ ధరలు, డిమాండ్, సప్లయ్, ఇతర మార్కెట్ సమాచారం ఎప్పటికప్పుడు సహకార సంఘాలకు లభిస్తుండటం వల్ల తదనుగుణంగా తగిన ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. 8. సహకార మార్కెటింగ్ సంఘాలు ఉత్పాదితాలైన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, వినియోగ వస్తువులను అధిక పరిమాణంలో తక్కువ ధరలకే కొనుగోలు చేసి సభ్యుల మధ్య పంపిణీ చేసుకోగలుగుతారు. 9. సహకార మార్కెటింగ్ సంఘాలు ప్రాసెసింగ్ కార్యకలాపాలను చేపట్టవచ్చు. 10. రైతుల్లో ఆత్మవిశ్వాసం, సమష్టి కృషికి సంబంధించిన అవగాహన వల్ల వ్యవసాయాభివృద్ధి సాధించవచ్చు. 11. సమగ్రమైన ప్రణాళికల ద్వారా పంటల తీరులో మార్పు చేపట్టవచ్చు. 12. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి విక్రయం అయిన మిగులులో పెరుగుదల ద్వారా ద్రవ్యోల్బణ పరిస్థితులను అరికట్టవచ్చు. 13. సహకార సంఘాలు చట్టబద్ధంగా గుర్తింపు పొందిన సంస్థలు. వీటికి ప్రభుత్వ మద్దతు ఉంటుంది. డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్