ICC Player Rankings
-
బ్రియన్ లారా రికార్డ్ బ్రేక్
జొహన్నెస్‌బర్గ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనత సాధించాడు. ఆల్‌టైమ్ టెస్ట్ కెరీర్-హై ప్లేయర్ ర్యాంకింగ్స్ లిస్టులో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారాను అధిగమించాడు. 912 పాయింట్లతో ఈ జాబితాలో 26వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన చివరి టెస్టు ద్వారా 12 ర్యాంకింగ్ పాయింట్లు సాధించాడు. అంతకుముందు అతడి ఖాతాలో 900 పాయింట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లో విరాట్ 54, 41 పరుగులు చేశాడు. దీంతో 12 ర్యాంకింగ్ పాయింట్లు జతకావడంతో 912 పాయింట్లతో 31వ స్థానం నుంచి 26వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో లారా(911), కెవిన్ పీటర్సన్(909), హషిమ్ ఆమ్లా(907), శివనారాయణ్ చంద్రపాల్(901), మైకేల్ క్లార్క్(900)లను అధిగమించాడు. మరో ఐదు పాయింట్లు సాధిస్తే సునీల్ గవస్కర్(916)ను కూడా అధిగమిస్తాడు. ఆల్‌టైమ్ టెస్ట్ కెరీర్- హై ప్లేయర్ ర్యాంకింగ్స్ లిస్టులో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ 961 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 947 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. -
ఉమ్మడిగా కొట్టారు: అశ్విన్, జడేజా అరుదైన ఘనత!
ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న భారత టెస్టు బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఐసీసీ టెస్టు బౌలర్ ర్యాంకింగ్స్‌లో టాప్ స్థానాన్ని తొలిసారి ఈ ఇద్దరూ కలిసి ఉమ్మడిగా పంచుకున్నారు. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇలా ఇద్దరు భారత బౌలర్లు ఉమ్మడిగా టాప్ ర్యాంకింగ్‌ను పంచుకోవడం ఇదే తొలిసారి. గతంలో 2008 ఏప్రిల్‌లో డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్ ఇలా ఉమ్మడిగా టెస్టు టాప్ బౌలర్ ర్యాంకును పంచుకున్నారు. ఇప్పటికే అశ్విన్ టెస్టుల్లో టాప్ బౌలర్‌గా కొనసాగుతుండగా.. తాజాగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో అద్భుతంగా ఆడిన జడేజా కూడా అతనితోపాటు ట్యాప్ ర్యాంకును అందుకున్నాడు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో జడేజా 63 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. మొత్తంగా రెండో టెస్టులో అతను ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక బెంగళూరు టెస్టులో భారత్ 75 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన అతడు ఈ టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆసిస్‌తో రెండో టెస్టు విజయంతో భారత్ టెస్టుల్లో తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో భారత్ కొనసాగుతోంది. ఇక ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకోగా, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన రెండో స్థానాన్ని ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్‌కు కోల్పోయాడు. కోహ్లి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 10 టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకు - ఆటగాడు జట్టు పాయింట్లు-సగటు 1 స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా 936 - 59.32 2 జో రూట్ ఇంగ్లాండ్ 848 - 52.80- 3 విరాట్ కోహ్లీ ఇండియా 847 - 49.90 4 కే విలియమ్సన్ న్యూజిల్యాండ్ 823 - 50.07 5 డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా 794 - 48.27 6 సి పుజారా ఇండియా 793 - 49.84 7 హషీమ్ ఆమ్లా దక్షిణాఫ్రికా 787 - 49.99 8 అజర్ ఆలీ పాకిస్థాన్ 779 - 47.07 9 యూనిస్ ఖాన్ పాకిస్థాన్ 772 - 53.06 10 డీ కాక్ దక్షిణాఫ్రికా 760 - 51.04 టాప్ 10 టెస్టు బౌలర్లు ర్యాంకు ఆటగాడు జట్టు- పాయింట్లు- సగటు 1 అశ్విన్ ఇండియా- 892- 24.79 ఆర్ జడేజా ఇండియా- 892- 23.44 3 హజెల్‌వుడ్ ఆస్ట్రేలియా- 863- 24.38 4 ఆర్ హెరాత్ శ్రీలంక-827- 28.31 5 రబడా దక్షిణాఫ్రికా-821 21.76 6 డేల్ స్టెయిన్ దక్షిణాఫ్రికా- 819- 22.30 7 జే అండర్సన్ ఇంగ్లాండ్- 810- 28.50 8 స్టువర్ట్ బ్రాడ్ ఇంగ్లాండ్- 803- 28.54 9 ఫిలాండర్ దక్షిణాఫ్రికా-798- 21.40 10 మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా- 757- 28.35 నీల్ వాగ్నెర్ న్యూజిల్యాండ్- 757- 28.58