icet results
-
టీఎస్‌ఐసెట్‌లో ఏపీ విద్యార్థుల జోరు
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–21 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్, టీఎస్ఐసెట్ చైర్మన్ ఆచార్య కె.రాజిరెడ్డితో కలిసి విడుదల చేశారు. మొత్తం 66,034మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 56,962 మంది పరీక్ష రాశారు. వారిలో 51,316 మంది (90.09) ఉత్తీర్ణత సాధించారని లింబాద్రి తెలిపారు. పురుషుల విభాగంలో 28,848 మందికిగాను 26,057 మంది ఉత్తీర్ణత (90.33శాతం) సాధించారు. మహిళా విభాగంలో 28,111 మందికిగాను 25,256 మంది (89.84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ, ఏపీ కలిపి నిర్వహించిన ఈ పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన ఆర్.లోకేష్ 155.36716 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొట్ల ఆనంద్‌పాల్–కృష్ణా జిల్లా(149.94369 మార్కులు), అర్వలక్ష్మి జాహ్నవి–తూర్పుగోదావరి జిల్లా(140.99397 మార్కులు), వినీల్‌రెడ్డి – కర్నూలు జిల్లా(140.06698 మార్కులు), ఎం.ధ్రువకుమార్‌రెడ్డి – వైఎస్సార్ జిల్లా(137.50799 మార్కులు) వరుసగా 5, 13, 16, 20 ర్యాంకులను సాధించారు. -
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్-2020 ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకతీయ వర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఫలితాలు విడుదల చేశారు. సెప్టెంబర్ 30, అక్టోంబర్ 1న నిర్వహించిన టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్షకు 45,975మంది హాజరు కాగా, 41,506 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 90.28 శాతం నమోదైందని పాపిరెడ్డి పేర్కొన్నారు. -
‘ఏపీ ఐసెట్’ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ 2020 పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఫలితాలను ప్రకటించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఏపీ ఐసెట్ ఫలితాల్లో తిరుపతికి చెందిన డి.ఫణిత్ మొదటి ర్యాంకు సాధించాడు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఏపీ ఎంసెట్ పరీక్షను ఈనెల 17వతేదీ నుంచి 25 వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించామని మంత్రి సురేష్ చెప్పారు. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ► ఈనెల 10, 11వ తేదీల్లో నిర్వహించిన ఏపీ ఐసెట్ పరీక్షలకు 64,884 మంది దరఖాస్తు చేయగా 51,991 మంది హాజరయ్యారు. పరీక్షల్లో 40,890 మంది (78.65 శాతం) అర్హత సాధించారు. మొత్తం 45 నగరాల్లో 75 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ► ఎంబీఏ కోర్సును 352 కాలేజీలు అందిస్తుండగా ఎంసీఏ కోర్సును 130 కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ► ఎంబీఏలో 44084 సీట్లు, ఎంసీఏలో 8,558 సీట్లు ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటాలో ఎంబీఏలో 31368 సీట్లు, ఎంసీఏలో 6,229 సీట్లు భర్తీ చేయనున్నారు. మిగతావి మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో భర్తీ కానున్నాయి. ► ఈసారి ఐసెట్‌ను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించింది. గతేడాది కంటే ఈసారి పరీక్షకు అభ్యర్థుల సంఖ్య పెరిగింది. అర్హుల కంటే సీట్లే అధికం యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): ఎస్వీయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న డి.ఫణిత్ నవంబర్‌లో జరిగే క్యాట్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతూ ఐసెట్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ► ఈ నెల 30 నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈసారి అర్హత సాధించిన వారి కన్నా 11,752 సీట్లు ఎక్కువగా ఉండటం విశేషం. -
విషాదంలోనూ విజయం..
హైదరాబాద్: పది నెలల క్రితం ఆ ఇంట్లో సంతోషాలు దూరమైనా.. ఆ విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. శుక్రవారం విడుదలైన టీఎస్ఐసెట్ ఫలితాల్లో మొదటి ర్యాంక్ సాధించి తన తల్లి ఆకాంక్షను నెరవేర్చాడు. హనుమాన్‌పేట్‌కు చెందిన రైల్వే ఉద్యోగి మండవ శ్రీనివాసరావు, కల్యాణి దంపతులు. వారికి కుమారుడు హనీస్ సత్య, కుమార్తె హర్షిత ఉన్నారు. తల్లి కల్యాణి 10 నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. హనీస్ గండిపేటలోని ఎంజీఐటీలో ఇంజనీరింగ్ చదువుతుండగా.. హర్షిత శ్రీకాకుళంలో ఎంబీబీఎస్ చదువుతోంది. గత నెల 23న ఐసెట్ పరీక్ష రాసిన హనీస్.. శుక్రవారం విడుదలైన ఐసెట్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించా డు. ఈ సందర్భంగా హనీస్ మాట్లాడుతూ.. ఎంబీఏ చేసి మంచి బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలనుందని, ఉస్మానియా వర్సిటీలో సీటు దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. హనీస్ కు చదువంటే మొదటి నుంచి ఇష్టమని, మొదటి ర్యాంక్ తెచ్చుకొని తల్లి కోరికను తీర్చాడని తండ్రి శ్రీనివాసరావు, నాయనమ్మ వెంకటమ్మ అన్నారు. -
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ : ఏపీ ఐసెట్2019 ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏపీఐసెట్ 2019 టెస్ట్‌ను నిర్వహించింది. ఏపీ ఐసెట్ 2019 ఫలితాలను బుధవారం విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, వెంకటేశ్వర వర్సిటీ వీసీ విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు52,736 మంది దరఖాస్తు చేసుకోగా, 48,445మంది విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాది కంటే ఐదువేల మంది అధికంగా దరఖాస్తు చేసుకోగా, కంప్యూటర్ బేసిడ్ కామన్ ఎంట్రన్స్ మొదటిగా ఏపీలో ప్రారంభించామని విజయరాజు అన్నారు. జులై మూడోవారం నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గుంటూరు జిల్లాకు చెందిన కారుమూరి నాగసుమంత్ తొలిర్యాంకు సాధించారు. తూర్పు గోదావరికి చెందిన కంటె కావ్యాశ్రీ రెండు, విజయవాడకి చెందిన నరహరిశెట్టి శివసాయి పవన్ మూడో ర్యాంకు సాధించారు. -
97.18 శాతం మందికి అర్హత
ఐసెట్ ఫలితాలు విడుదల - 25 వేల సీట్లు అందుబాటులో ఉండే అవకాశం - ఎంబీఏ కోసం 10 వేల మందికి పైగా బీటెక్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు - ఈ నెల 4 నుంచి వెబ్సైట్లో ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్–2017లో 97.18 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 77,422 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 71,097 మంది పరీక్షకు హాజ రయ్యారు. వారిలో 69,091 మంది (97.18 శాతం) విద్యార్థులు అర్హత సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. మే 18వ తేదీన నిర్వహించిన ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో బుధవారం ఆయన విడుదల చేశారు. టాప్–10 ర్యాంకుల్లో మొత్తంగా తెలంగాణ విద్యార్థులే ఉన్నట్లు వెల్లడించారు. టాప్–10లో 9 మంది బాలురు ఉండగా, ఒక్కరు బాలిక ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులతోపాటు ఇతర డిగ్రీ కోర్సుల్లోనూ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయని పాపిరెడ్డి వెల్లడించారు. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక కౌన్సెలింగ్ షెడ్యూలు జారీ చేస్తామన్నారు. ఈ ఐసెట్‌కు 40,610 మంది బాలురు హాజరు కాగా అందులో 39,486 మంది (97.23 శాతం) అర్హత సాధించారన్నారు. 30,487 మంది బాలికలు పరీక్షకు హాజరవగా 29,605 మంది (97.11 శాతం) అర్హత సాధించినట్లు వివరించారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, ఐసెట్ చైర్మన్ ప్రొఫెసర్ సాయన్న మాట్లాడుతూ గత మూడేళ్లుగా కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐసెట్‌ను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాష్ మాట్లాడుతూ గత ఏడాది 283 ఎంబీఏ కాలేజీల్లో 28,174 సీట్లు అందుబాటులో ఉండగా, 52 ఎంసీఏ కాలేజీల్లో 2,336 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అందులో కన్వీనర్ కోటాలో 24,557 సీట్లు అందుబాటు ఉన్నాయని పేర్కొన్నారు. ఈసారి మొత్తంగా దాదాపు 25 వేలకు పైగా సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీల నుంచి కాలేజీల అనుబంధ గుర్తింపు వచ్చాక కచ్చితమైన సీట్ల సంఖ్య తెలుస్తుందన్నారు. గత ఏడాది ఐసెట్‌కు 72,442 దరఖాస్తు చేసుకోగా ఈసారి 77,422 మంది దరఖాస్తు చేశారని, గతంలో కంటే 5 వేల మంది పెరిగారని వివరించారు. విద్యార్థులు ఈ నెల 4వ తేదీ నుం చి ర్యాంకు కార్డులను icet.tsche.ac.inవెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటాచలం, ప్రొఫెసర్ మల్లేశ్, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పరీక్షకు హాజరైన బీటెక్ విద్యార్థులు ఈసారి ఐసెట్ రాసేందుకు 10 వేల మందికి పైగా బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేయడం విశేషం. వారిలో బాలురు 6,203 మంది ఉండగా, 4,182 బాలికలు ఉన్నారు. వారిలో 5,157 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా 5,126 మంది అర్హత సాధించారు. బాలికలు 3,618 మంది పరీక్షకు హాజరు కాగా 3,596 మంది అర్హత సాధించారు. -
నేడు ఐసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను విద్యార్థులు www. sakshieducation.com, www.sakshi.comలో పొందవచ్చు. -
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణ ఐసెట్-2016 ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, కేయూ ఇన్చార్జ్ వీసీ టి.చిరంజీవులు మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలతో పాటు ఫైనల్ కీ విడుదలు చేశారు. అభ్యర్థులు (www.tsicet.org) డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్ఐసెట్-2016.ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.