అన్ని మతాల సారం ఒక్కటే
స్టేషన్ మహబూబ్‌నగర్ : అన్ని మతాల సారం ఒక్కటేనని ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం బక్రీద్‌ను పురస్కరించుకుని ఖౌమీ ఏక్తా కమిటీ కార్యదర్శి రఫీఖ్ పటేల్ నివాసంలో ఈద్ మిలాప్ నిర్వహించారు. ఇందులో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండడం అభినందనీయన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే భారతీయ సంస్కతి ప్రపంచ దేశాలకు అదర్శంగా నిలించిందన్నారు.
త్యాగాలకు ప్రతీకౖయెన బక్రీద్‌ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. జిల్లా ప్రజలకు వారు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అ«ధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, పాలమూరు మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్, టీడీపీ నాయకులు ఎన్పీ వెంకటేశ్, నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.