వారఫలాలు (25-12-2016 to 31-12-2016)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. చేపట్టిన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీల్లో చికాకులు తొలగుతాయి. కొన్ని విషయాలలో కార్యోన్ముఖులై ముందడుగు వేస్తారు. ఉద్యోగయోగం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు అనుకూలం. నీలం, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
బంధువుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. కళాకారులకు సన్మానయోగం. లేత ఎరుపు, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వారం మొదట్లో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం మందగిస్తుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. కొంత నిరుత్సాహంగా ఉన్నా క్రమేపీ అనుకూల పరిస్థితి ఉంటుంది. రాబడికి లోటు ఉండదు. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులు అందుతాయి. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. లేత పసుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన కొన్ని పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆదాయం కొంత సంతృప్తికరంగా ఉంటుంది. ఒక సమస్య నేర్పుగా పరిష్కరించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఎరుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
రాబడికి మించి ఖర్చులు ఎదురవుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయటా ఒత్తిడులు తప్పకపోవచ్చు. అయినవారే సమస్యలు సృష్టించే పరిస్థితులు ఉండవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. ఆకుపచ్చ, లేత గులాబీరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులో ఆనందంగా గడుపుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సన్మానాలు. నీలం, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృపిక్తరం. కొన్ని రుణాలు తీరతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఎరుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో సమస్యలు సర్దుబాటు కాగలవు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయులు,బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. పారిశ్రామికవర్గాలకు అరుదైన సన్మానాలు. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు శ్రమకు ఫలితం పొందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. నలుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుందరకాండ పారాయణ చేయండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఇంటిలో శుభకార్యాలు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. నీలం, లేత ఆకుపచ్చరంగులు, శివపంచాక్షరి పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వారం ప్రారంభంలో స్వల్ప అవాంతరాలు ఎదురైనా అనుకున్న పనులు పూర్తి చే స్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాలు తీరి ఊరట చెందుతారు. కొన్ని సమస్యలను సమయస్ఫూర్తితో చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు కలసివస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు అనుకూల సమాచారం. కళాకారులకు పురస్కారాలు. గులాబీ, తెలుపు రంగులు, నృసింహ స్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు
టారో (25 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్, 2016 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
ఈ వారమంతా అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆస్వాదిస్తారు. మనసు చెప్పినట్లు నడచుకోండి.
కలిసి వచ్చే రంగు: మబ్బురంగు
వృషభం (ఏప్రిల్ 20 – మే 20)
కాలంతో పోటీగా పరుగెత్తుతూ పని చేసే మిమ్మల్ని అర్థం చేసుకోవడం మీ సహ^è రుల వల్ల కాదు. పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. ఏ సమస్య వచ్చినా, తగిన పరిష్కారం కనుగొనడంలో మీకు మీరే సాటి. ప్రకృతి ఉత్పాదనల వాడకంతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
కలిసివచ్చే రంగు:ఆకుపచ్చ
మిథునం (మే 21 – జూన్ 20)
భద్రతకు, విజయానికి ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. సొంత వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. మీ రుగ్మతలకు సంగీత చికిత్స ఉపకరిస్తుంది.
కలిసివచ్చే రంగు: లేత వంకాయంగు
కర్కాటకం (జూన్ 21 – జూలై 22)
మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ప్రకృతి ఒడిలో మీకు మంచి స్వాంతన లభిస్తుంది.
కలిసి వచ్చే రంగు: వెండి
సింహం (జూలై 23 – ఆగస్ట్ 22)
ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకోవడంలో బిజీగా ఉంటారు. ఆఫీసులో పనులు చురుగ్గా జరుగుతాయి. ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. సహోద్యోగులకు మీ ఆలోచనలు నచ్చకపోతే వినమని బలవంతపెట్టకండి. గొంతునొప్పి బాధించవచ్చు.
కలిసి వచ్చే రంగు: నారింజ
కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22)
ఇంటాబయటా కూడా మంచి మార్పులు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. శాలరీ పెరగవచ్చు. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో బిజీగా ఉంటారు.
కలిసి వచ్చే రంగు: లేత అరిటాకు
తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22)
మీ వాక్చాతుర్యం, ప్రజాసంబంధాల సాయంతో మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రేమలో విజయాన్ని అందుకుంటారు. మీరు అనుకున్న పనులను చేయడానికి ఇది తగిన సమయం. పనిలో కొన్ని ప్రతిబంధకాలు ఎదురు కావచ్చు.
కలిసి వచ్చే రంగు: గులాబీ
వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21)
మీ వ్యాపార భాగస్వాములు మీపట్ల పూర్తి సానుకూల ధోరణిలో ఉంటారు. పనిలో ఆందోళనలను, అవరోధాలను అధిగమిస్తారు. మీ ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. మీ పనిలో ఉత్పాదకతను సాధించేందుకు ఇది తగిన సమయం. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త.
కలిసి వచ్చే రంగు: బూడిద రంగు
ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21)
కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. మీ కోరికలకూ, ఆదాయానికీ, తాహతుకూ సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది.
కలిసి వచ్చే రంగు: నిండు ఎరుపు
మకరం (డిసెంబర్ 22 – జనవరి 19)
సన్నిహితులు, బంధువులకు సరైన సమయంలో సరైన సలహాలనిచ్చి వారిని కాపాడతారు. వారి మనసును గెలుచుకుంటారు. మిమ్మల్ని చూసి చెవులు కొరుక్కునేవాళ్ల గురించి పట్టించుకోకండి. కరుణ, సానుభూతితో మెలగండి. మీరు చేపట్టిన ప్రాజెక్టులో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. కొత్తదుస్తులు కొనుగోలు చేస్తారు.
కలిసి వచ్చే రంగు: నారింజ
కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఈ వారం మీకు చాలా అదృష్టకరంగా ఉంటుంది. విజయాల బాటలో నడుస్తారు. ఇతరుల ప్రేమను గెలుచుకుంటారు. మీ ఆధ్యాత్మికత, భక్తిభావం, పరోపకార గుణాలే మిమ్మల్ని కాపాడుతూ వున్నాయని గ్రహించండి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్మే వాటి విషయంలో. మీకు ఇష్టమైన వారితోనూ, మిమ్మల్ని ఇష్టపడేవారితోనూ ఎక్కువ సమయం గడపండి.
కలిసి వచ్చే రంగు: గోధుమ
మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
వృత్తిపరంగా విజయం సాధించాలంటే దానికి అనుగుణంగా నడుచుకుంటూ, కష్టపడి పని చేస్తేనే సాధ్యమని గ్రహించండి. ప్రేమించిన వారికోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. పురాతన నగలు, వస్తువులు, అలంకరణ సామగ్రిని కొనుగోలు చేస్తారు. అందరితో కలసి మెలసి ఉండటం ద్వారా సానుకూల భావనలను నింపుకోండి. వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.
కలిసి వచ్చే రంగు: లేత ఆకుపచ్చ
టారో ఇన్సియా అనలిస్ట్