స్ట్రాంగ్‌రూంలను పరిశీలించిన కమిషనర్
గ్రేటర్ ఎన్నికలకు ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ 8 డివిజన్లలో జరిగే ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలను భద్ర పరిచే విషయంపై ఐడీపీఎల్ కాలనీ స్కూల్‌ను మంగళవారం సికింద్రాబాద్ నార్త్ జోన్ కమిషనర్ హరిచందన దాసరి పరిశీలించారు. మొత్తం నాలుగు స్ట్రాంగ్ రూంలతో పాటు 8 వార్డులకు ఒకటి చొప్పున కౌంటింగ్ హాల్‌లను గుర్తించారు. ఈఈ పర్యవేక్షణలో స్థానికంగా ఏర్పాట్లు జరగాలని ఆమె ఆదేశించారు. సర్కిల్ పరిధిలో మొత్తం 4,53,100 ఓటర్లు ఉండగా 429 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఉప కమిషనర్ గీత రాధిక తెలిపారు.