అలరించిన ఐఫా ఉత్సవం
►జనతా గ్యారేజ్‌కు అవార్డుల పంట
►ఉత్తమ నటుడు ఎన్టీఆర్.. ఉత్తమ నటి సమంత
హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఫా) –2017 సెకండ్ ఎడిషన్ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు చెందిన సెలబ్రిటీలంతా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో పలువురిని ఐఫా పురస్కారాలతో సత్కరించారు. మార్చి 29న తెలుగు భాషకి సంబంధించి అవార్డుల వేడుకని నిర్వహించగా, ఈ కార్యక్రమానికి రానా, నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అఖిల్, సాయిధరమ్ తేజ్, సమంత, రాయ్‌లక్ష్మీ స్టెప్పులతో అలరించారు. ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్‌కి ఉత్తమ నటుడి అవార్డును అందుకోగా, సమంత ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. అల్లు అర్జున్ రుద్రమదేవి చిత్రానికిగాను బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు అందుకున్నాడు.
►బెస్ట్ మూవీ: జనతా గ్యారేజ్ – యలమంచిలి రవిశంకర్
►బెస్ట్ స్టోరీ: క్రిష్ – కంచె
►బెస్ట్ డైరెక్షన్: కొరటాల శివ – జనతా గ్యారేజ్
► బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ లీడింగ్ రోల్ (మేల్): జూ.ఎన్టీఆర్ – జనతా గ్యారేజ్
► బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ లీడింగ్ రోల్ (ఫిమేల్): సమంత – అ..ఆ..
► బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ సపోర్టింగ్ రోల్ (మేల్): అల్లు అర్జున్ – రుద్రమదేవి
► బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ సపోర్టింగ్ రోల్ (ఫిమేల్): అనుపమ పరమేశ్వరన్ – ప్రేమమ్
► బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ కామిక్ రోల్: ప్రియ దర్శి – పెళ్లి చూపులు
►బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ నెగిటివ్ రోల్: జగపతి బాబు – నాన్నకు ప్రేమతో
► బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవీశ్రీ ప్రసాద్ – జనతా గ్యారేజ్
►బెస్ట్ లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి (వస్తానే – సోగ్గాడే చిన్నినాయనా)
► బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): హరిచరణ్ శేషాద్రి (నువ్వంటే నా నవ్వు – కృష్ణగాడి వీరప్రేమ గాథ)
► బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్): గీతా మాధురి (పక్కా లోకల్ – జనతా గ్యారేజ్)
►ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా అవార్డ్: కే రాఘవేంద్ర రావు
ఐఫా స్టార్స్.. ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి