iiit-b student
-
22 ఏళ్లు..రూ.1.2 కోట్ల వేతనం!
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ–బి)లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చదువుతున్న ఆదిత్య పలివాల్(22) సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో ఏడాదికి రూ.1.2 కోట్ల భారీ వేతనంతో కొలువు సాధించాడు. గూగుల్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పరీక్షలో ఆరువేల మంది పాల్గొనగా 50 మంది ఎంపికయ్యారు. వారిలో ఆదిత్య ఒకడు. ఈ నెల 16న న్యూయార్క్‌లో గూగుల్ కృత్రిమ మేథ, పరిశోధనా విభాగంలో ఉద్యోగంలో చేరనున్నాడు. -
ఐఐఐటీ-బి విద్యార్థి ఆత్మహత్య
బొమ్మనహళ్లి: ఐఐఐటీ-బీలో ఎంటెక్ 4వ సెమిస్టర్ చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి కళాశాల భవనం 7వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఎలక్ట్రానిక్ సిటీలో చోటు చేసుకుంది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసుల కథనం మేరకు..హైదరాబాద్ నగరానికి చెందిన సాయి శరత్ (22) ఎలక్ట్రానిక్ సిటీ మొదటి ఫేజ్‌లో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ-బీ)లో బెంగళూరు సంస్థలో ఎంటెక్ 4వ సెమిస్టర్ చదువుతూ క్యాంపస్‌లోని వసతి గృహంలో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో సాయిశరత్ క్యాంపస్ 7వ అంతస్తుకు చేరుకొని కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు దారితీసిన కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.