IIT kharagpur student
-
‘వెయిటింగ్’ వెతలకు చెక్
కోల్‌కతా: రైలు ప్రయాణాలు చేయాలంటే ముందుగా బుకింగ్ చేసుకోవాల్సిందే. ఆన్లైన్లో బుక్ చేసుకుందామనుకునే సరికి అప్పటికే వెయిటింగ్లో ఉంటే..! వేరే స్టేషన్ నుంచి బెర్త్‌లు ఖాళీగా ఉండే వీలుంది కదా..! మరి ఖాళీగా ఉండే స్టేషన్లను ఎలా కనుక్కోవాలి? కష్టపడి కనుక్కున్నా అప్పటిలోగా ఆ స్టేషన్లో బెర్త్‌లు ఖాళీగా ఉంటాయన్న నమ్మకం లేదు. ఈ బాధలు లేకుండా సులువుగా ఈ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇద్దరు విద్యార్థులు కొత్త మొబైల్ యాప్ కనిపెట్టారు. ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి జాజు, జంషెడ్పూర్ ఎన్ఐటీలో చదివిన అతని సోదరుడు శుభం బల్దావా కలసి ‘టికెట్ జుగాద్’ అనే యాప్‌ను రూపొందించారు. రైలు బయలుదేరిన స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను యాప్ చెప్తుంది. మనం టికెట్ బుక్ చేసుకునే సమయానికి ఏ స్టేషన్లో ఎన్ని బెర్తులు ఖాళీగా ఉన్నాయో వెల్లడిస్తుంది. ఒక స్టేషన్ నుంచి బెర్తులు లేకపోయినా వేరే స్టేషన్ నుంచి బుక్ చేసుకోవచ్చు. దీంతో వెయిటింగ్ లిస్ట్ బాధ పోతుంది. టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అంటూ ప్రతి రోజూ చెకింగ్ అనవసరం. యాప్ డౌన్లోడ్, బెర్తుల వివరాలు పూర్తిగా ఉచితం. ఆన్లైన్ ఇంధన నిర్వహణ వ్యవస్థ! న్యూఢిల్లీ: ఇంధన వినియోగంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఆన్లైన్ ఇంధన నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ఇంధన నిర్వహణ వ్యవస్థ గురించి ఈ నెల 25న ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్లో మంత్రి ప్రకటించనున్నారు. -
రూ.2 కోట్ల ప్యాకేజీతో గూగుల్ లో జాబ్!
పుణే: ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థి అభిషేక్ పంత్ భారీ ఆఫర్ దక్కించుకున్నాడు. సెర్చ్ ఇంజిన్ దిగ్గజ సంస్థ గూగుల్ లో స్టాక్ ఆప్షన్ తో సహా భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. 22 ఏళ్ల అభిషేక్.. కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో కాలిఫోర్నియాలోని గూగుల్ ఆఫీస్ లో మూడు నెలల ఇంటర్న్ షిప్ పూర్తి చేశాడు. ఇటీవల అతడిని డిజైన్ సొల్యూషన్ సెల్ లోకి తీసుకున్నారు. పుణేకు చెందిన అభిషేక్ సీబీఎస్ టెన్త్ పరీక్షలో 97.6 శాతం మార్కులతో నగరంలో టాపర్ గా నిలిచాడు. గూగుల్ సంస్థలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం రావడం పట్ల అభిషేక్ ఆనందం వ్యక్తం చేశాడు. పుణే నుంచి ఖరగ్ పూర్ కు, అక్కడి నుంచి కాలిఫోర్నియాకు తన జర్నీ చాలా ఆసక్తికరంగా సాగిందని పేర్కొన్నాడు. అమెరికాలో పుట్టి పెరిగిన అభిషేక్ తన కుటుంబ సభ్యులతో కలిసి 2006లో పుణేకు వచ్చాడు. అయితే గూగుల్ లో ఉద్యోగం రావడంతో మళ్లీ కాలిఫోర్నియాకు వెళ్లనున్నాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో అతడు జాబ్ లో చేరనున్నాడు. ఇప్పటివరకు అతడికి ఎటువంటి ప్రాజెక్టు కేటాయించలేదు. కాగా, తమ విద్యార్థుల్లో అభిషేక్ పంత్ కు దక్కిన ప్యాకేజీయే అత్యధికమో, కాదో ఇప్పుడే చెప్పలేమని ఖరగ్ పూర్ ఐఐటీ పేర్కొంది. -
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ
కోల్‌కతా: ఖరగ్‌పూర్ ఐఐటీ విద్యార్థికి బంపర్ ఆఫర్ తగిలింది. క్యాంపస్ ప్లేస్మెంట్లలో భాగంగా ఆ విద్యార్థికి రూ.1.5 కోట్ల వార్షిక వేతనం ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకువచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఓ విద్యార్థికి ఇంత భారీ ప్యాకేజీ లభించడం ఇదే మొదటిసారి అని ఖరగ్‌పూర్ ఐఐటీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సదరు విద్యార్థికి కలిగే ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని అతని పేరు కానీ, ఆఫర్ ఇచ్చిన సంస్థ పేరు కానీ వెల్లడించడం లేదని తెలిపాయి.