illegal adoption
-
దత్తతకు చట్టబద్ధత కరువు..
ఆడపిల్లే ఇంటికి దీపం.. ఇంటి మహాలక్ష్మీ.. ఓపిక, సహనం.. సాహసానికి ప్రతిరూపం.. ఎక్కడ చూసినా ఆడవాళ్లదే పై చేయి. రంగం ఏదైనా పురుషులతో సమానంగా పోటీ పడుతున్న సమయంలో అక్కడక్కడా ఆడపిల్లను అంగడిలో సరుకును చేస్తున్న సంఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఆడ పిల్లలు భారం కావద్దని భవిష్యత్‌కు ఆధారం కావాలని ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొంత మంది డబ్బులకు ఆశపడి అమ్మకానికి, అక్రమ దత్తతలకు ఇస్తున్నారు. దత్తతను ఇస్తున్నట్లు నాన్ జ్యుడీషియల్ పేపర్ల మీద రాసుకుని ఇస్తున్నారు. ఇందుకు ఇటీవల నర్సంపేటలోని లక్నెపల్లిలో జరిగిన సంఘటనే ఉదాహరణ.. సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామానికి చెందిన దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగో సంతానంలో ఆడపిల్ల పుట్టింది. దీంతో దుగ్గొండి మండలం మహ్మదాపురంకు చెందిన దంపతులకు ఆడపిల్లను దత్తత ఇచ్చారు. ఈ దత్తత తీసుకున్న దంపతులకు వివాహమై 15 సంవత్సరాలవుతోంది. అయినా పిల్లలు పుట్టకపోవడంతో దత్తతను తీసుకుంటున్నామని, దత్తత తీసుకున్న దంపతులు ఆ పాప పేరు మీద ఇల్లు, 0.20గుంటల పొలాన్ని రాసిచ్చారు. దత్తతను ఇచ్చిన వారు ఎక్కడా తమ పాప అని చెప్పవద్దని నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌పేపర్‌పై దత్తత పత్రం రాసుకుని సెప్టెంబర్ 19న దత్తతను తీసుకున్నారు. ఈ దత్తత విషయం ఈ నోట ఆ నోట పడి ఈ నెల 1న జిల్లా చైల్ట్ వైల్ఫేర్ అధికారులకు చేరింది. దీంతో చుట్టు పక్కల వారిని విచారించగా నిజమేనని తెలింది. దత్తత ఇచ్చిన పాపను తీసుకుని శనివారం చైల్డ్ వేల్ఫెర్ కమిటీ ఎదుట హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు 127 మంది దత్తత.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారా ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2007 నుంచి ఇప్పటివరకు 127 మందిని దంపతులు దత్తత తీసుకున్నారు. అందులో అబ్బాయిలు 30 మంది, అమ్మాయిలు 97 మందిని తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆడ శిశువుల విక్రయాలు సాగుతున్నాయి. శిశు సంక్షేమ శాఖ తనిఖీల్లో బయటకు వస్తున్నాయి. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల సంరక్షణ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న తల్లితండ్రులు బాలికలమీద అదే వివక్ష కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు బాలికలకు ఉచిత విద్యా అందిస్తున్న సైతం శిశువు అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. దత్తత ఇలా తీసుకోవాలి పిల్లలు లేని దంపతులు తమ బంధువుల పిల్లలను దత్తత తీసుకున్న సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం తీసుకోవాలి. అక్రమ దత్తత చట్టరీత్యా నేరం. కేంద్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ విధానాన్ని 2014 నుంచి అమలు చేస్తున్నారు. ఠీఠీఠీ.ఛ్చిట్చ. nజీఛి.జీ n లో దరఖాస్తు చేసుకోవాలి. దత్తత విషయంలో దంపతులకు సంబంధించిన ప్రధానమైన మూడు అంశాలను సంతృప్తికరంగా ఉంటేనే బాలల సంరక్షణ కమిటీ అనుమతి మంజూరు చేస్తుంది. దంపతులు ఆరోగ్యం సామాజికపరమైన అంశాలు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. సంక్రమిత తదితర వ్యాధులతో అనారోగ్యం కలిగి ఉండడం, ఇతర పోలీసు కేసులు ఉండడం కనీస ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేనట్లయితే దత్తత ఇవ్వరు. దత్తతకు సిద్ధమైన దంపతులు కౌన్సెలింగ్ తర్వాత దరఖాస్తు చేయడం పూర్తయ్యాక చివరి దశలో అంటే ఆరోగ్యం పోలీసులు కేసులు ఆర్థిక పరిస్థితుల ఆధారంగా అనుమతి మంజూరవుతుంది. కన్నవారే కాదంటున్నారు.. తండాల్లో ఎక్కువగా శిశు విక్రయాలు, అక్రమ దత్తతలు జరుగుతున్నాయి. ఒక కుటుంబానికి ఇద్దరు ఆడ పిల్లలుండగా మగ బిడ్డ కోసం వేచి చూడగా మళ్లీ ఆడ పిల్ల పుట్టడటంతో వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్పత్రిలోనే ఆడ పిల్ల పుట్టిందని వద్దు అని కుటుంబసభ్యులు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు మళ్లీ ఆడపిల్లనే పుట్టింది వద్దని ఎవరైనా కావాలంటారా అని సమాచారం ఇస్తున్నారు. దీంతో ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది మద్యవర్తిగా వ్యవహరించి ఆ ఆడ శిశువును విక్రయిస్తున్నారు. వివాహమై పిల్లలు లేని వారు ముందుగా ఆసుపత్రి సిబ్బందికి చెప్పి పెడుతున్నారు. ఎవరైనా ఆడపిల్లను ఇస్తే పెంచుకుంటామని పిల్లలు లేని తల్లితండ్రులు చెబుతున్నారు. అక్రమంగా దత్తత తీసుకోవద్దు అక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కారా నిబంధనల ప్రకారం దత్తతను తీసుకోవాలి. అక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవద్దు. విక్రయించినా, కొనుగోలు చేసినా శిక్షార్హులు. ఆడపిల్లలను అక్రమంగా విక్రయించినా, కొనుగోలు చేసినా, బ్రూణ హత్యలు చేసినా, బాల్య వివాహాలు చేసినా చట్టరీత్యా కేసులు నమోదు చేస్తాం. – మహేందర్‌రెడ్డి, జిల్లా బాలల సంరక్షణ అధికారి -
స్వరూప దగ్గరికే చిన్నారి తన్విత
-
‘తన్విత’ను దక్కించుకున్న స్వరూప
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి తన్విత ఉదంతంలో పెంచిన తల్లికి ఊరట లభించింది. ఓ వైపు కన్నపేగు, మరోవైపు పెంచిన మమకారం... తన్విత కోసం ఇద్దరు తల్లులు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. చివరకు పెంపుడు తల్లి స్వరూప దగ్గరే తన్విత ఉండాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుది తీర్పు వచ్చేవరకూ స్వరూప వద్దే తన్విత ఉండాలని కొత్తగూడెం 5వ అదనపు జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పుట్టిన రోజు నుంచి తన్విత తనవద్దనే పెరిగిందని స్వరూప కోర్టులో తన వాదనలు వినిపించింది. మరోవైపు తన్విత కన్నతల్లి ఉమ సమర్పించిన అఫిడవిట్ పరిశీలించిన అనంతరం కోర్టు పెంపుడు తల్లికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం ప్రస్తుతం ఖమ్మం బాలల సదనం ఉన్న తన్వితను తన వెంట తీసుకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే..వివరాలివీ.. మహబుబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిస్టాపురం గ్రామానికి చెందిన మాలోతు భావు సింగ్, ఉమ దంపతులు తమ కూతురు తన్వితను రెండేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ స్వరూపలకు దత్తత ఇచ్చారు. భర్త తనకు తెలియకుండా దత్తత ఇచ్చాడని ఉమ గత నెలలో ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పోలీసులు ఈ కేసులో దర్యాప్తును చేపట్టి తన్విత ఖమ్మంలోని శిశు గృహంలో ఉంచారు. ఈ క్రమంలో తల్లి ఉమ తనకే అప్పగించాలని, పెంచిన తల్లి తనకే ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. ఇదిలా ఉండగా తన్విత మహబూబాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించిందని, అక్కడే దత్తత తంతు జరిగిందని భద్రాద్రి జిల్లా పోలీసులు దర్యాప్తులో తెలపడంతో కేసును మహబూబాబాద్ జిల్లా పోలీసులకు అప్పగించారు. ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఇరువర్గాల వారిని పిలిపించి మాట్లాడారు. పోలీసులు కూడా ప్రైవేట్ ఆస్పత్రిలో విచారణ జరిపారు. చివరకు తన్విత కన్నతల్లి ఉమకు తెలిసే దత్తత వ్యవహారం జరిగిందని, దత్తత ఒప్పంద పత్రంలో ఉన్న సంతకం కన్నతల్లి ఉమదేనని నిర్ధారించారు. బాగా చూసుకోవడం లేదనే భావుసింగ్ , ఉమలకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందని లింగ నిర్ధారణ పరీక్షల్లో గ్రహించిన భావు సింగ్ ఆబార్షన్ కోసం ప్రయత్నించాడు. అది తల్లికి, బిడ్డకు ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. ఇదే సమయంలో ఆడపిల్ల కోసం ప్రయత్నిస్తున్నరాజేంద్రప్రసాద్ స్వరూపలకు వారి విషయం తెలిసింది. ఇందులో ఓ ఆర్ఎంపీ డాక్టర్ మధ్యవర్తిత్వం వహించాడు. తన్విత జన్మించాక వారికి అప్పగించాలని ఒప్పంద పత్రం రాసుకున్నారు. దీనిపై పోలీసులు ఆర్ఎంపీ డాక్టర్‌తో పాటు భావు సింగ్ పై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఉమ కేసు వాపసు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. గుంటూరుకు చెందిన ఉన్నత కుటుంబానికి దత్తత ఇస్తున్నట్లు తనకు చెప్పారని.. కాని దత్తత తీసుకున్న వారు బాగా చూసుకోవడం లేదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఉమ వాంగ్మూలం ఇచ్చింది. కోర్టు తీర్పు మేరకే అప్పగింత దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు మహబూబాబాద్ కోర్టులో నివేదించారు. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం ఖమ్మం గృహంలో ఉన్న తన్వితను పెంపుడు తల్లి స్వరూపకు అప్పగించారు. -
అంగట్లో ఆడబిడ్డ..!
తల్లి ఒడిలో ఓలలాడాల్సిన చంటి‘పాప’.. అంగట్లో సరుకుగా మారుతోంది. ఆడ పిల్లగా ఈ దాత్రిపైకి రావడమే పాపమన్నట్లు ఈ సమాజం చిన్నచూపు చూస్తోంది. కుటుంబం గడవని స్థితిలో తల్లిదండ్రులు సైతం కన్నపేగును అంగట్లో బేరానికి పెడుతూ తమ బంధాన్ని తెంచుకుంటున్నారు. జిల్లాలో పెరిగిపోతున్న ఆడ శిశువుల విక్రయాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, వరంగల్ రూరల్: ఆడ పిల్ల ఇంటికి దీపం. ఓపిక.. సహనం.. సాహసానికి ప్రతిరూపం. ఎక్కడ చూసినా ఆడవాళ్లదే పైచేయి. రంగం ఏదైనా పురుషులతో సమానంగా పోటీ పడుతున్న నేటి సమాజంలో అక్కడక్కడా ఆడ పిల్లలను అంగడిలో సరుకును చేస్తున్న ఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా కన్నవారే ఆడబిడ్డలను దూరం చేసుకుంటున్నారు. ముఖ్యంగా లంబాడా తండాలు ఆడ పిల్లల విక్రయాలకు అడ్డాలుగా మారుతున్నాయి. నాలుగు నెలల్లో.. నాలుగు ఘటనలు జిల్లాలో నాలుగు నెలల్లో నలుగురు ఆడ శిశువుల విక్రయాలు జరిగాయి. శిశు సంక్షేమ శాఖ తనిఖీల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లోని ఓ కుటుంబానికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మళ్లీ ఆడ పిల్ల పుట్టడంతో మధ్యవర్తి ద్వారా 2017 సెప్టెంబర్ 25న విక్రయించారు. విషయం ఆ నోట ఈ నోట బయటపడడంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు వెళ్లి పరిశీలించగా నిజమని తేలింది. రాయపర్తి మండలం పెరికవేడు గ్రామానికి చెందిన వారికి ఆడ పిల్ల పుట్టడంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన వారికి 2017 అక్టోబర్ 20న విక్రయించారు. చెన్నారావుపేట మండలంలో ఖాదర్‌పేట గ్రామ శివారు గొల్లబామ తండాకు చెందిన ఓ దంపతులు ఆడ శివువును మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లికి చెందిన దంపతులకు 2017 నవంబర్ 28న అమ్మారు. వర్ధన్నపేట మండలం డీసీ తండాకు చెందిన దంపతులకు మూడో సంతానంగా ఆడ శిశువు జన్మించింది. దీంతో 2018 ఫిబ్రవరి 14న మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన వారికి విక్రయించారు. కన్నవారే కాదనుకుంటున్నారు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల సంరక్షణ కోసం అ నేక పథకాలు అమలు చేస్తున్నా.. బాలికలపై వివక్ష కొ నసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు బాలికలకు ఉచిత విద్య అందిస్తామన్నా.. శిశువు అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి తండాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక కుటుంబానికి ఇద్దరు ఆడ పిల్లలుండగా మగ బిడ్డ కోసం వేచి చూస్తున్నారు. మళ్లీ ఆడ పిల్లే పుట్టడటంతో వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. డెలివరీకి వెళ్లిన ఆస్పత్రులో ఉండగానే కు టుంబ సభ్యులు బేరం పెడుతున్నారు. ఇందుకు ఆస్పత్రుల్లోని కొంతమంది సిబ్బంది మధ్యవర్తులుగా వ్యవహరించి విక్రయాలకు సహకరిస్తున్నారు. వివాహం అయి ఏళ్ల తరబడి పిల్లలు కాని వారి గురించి ఆరా తీసిపెట్టుకుంటుని ఎవరైనా ఆడపిల్లను ఇస్తామని చెప్పగా నే పిల్లలు లేని వారికి సమాచారం చేరవేస్తున్నారు. అక్రమంగా దత్తత తీసుకోవద్దు ఆక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారమే తీసుకోవాలి. ఆడపిల్లలను అక్రమంగా విక్రయించిన, కొనుగోలు చేసినా, బ్రూణ హత్యలు చేసినా, బాల్య వివాహాలు చేసిన శిక్షార్హులే. చట్టరీత్యా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. – మహేందర్‌రెడ్డి, డీసీపీఓ -
ఒక శిశువు.. ఇద్దరు తల్లులు
ఒంగోలు టౌన్: ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో ఓ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు తక్కువ బరువు ఉండటంతో వైద్యుల సూచన మేరకు వెంటనే రిమ్స్‌లోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించింది. శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్న ఆ బిడ్డను ఎత్తుకొని బయటకు వచ్చింది. అదే రోజు కొన్ని గంటల తరువాత మరో మహిళ అదే శిశువును నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చింది. అంతకు ముందు తక్కువ బరువుతో చేరిన శిశువు, ఆ తర్వాత తన బిడ్డేనంటూ మరో మహిళ తీసుకొచ్చిన శిశువు ఒక్కరే కావడంతో వైద్యుడు అవాక్కయారు. అనుమానం వచ్చిన ఆయన వెంటనే ఐసీపీఎస్ డీసీపీఓకు సమాచారం అందించారు. దీంతో అక్రమ దత్తత వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. టంగుటూరుకు చెందిన ఒక మహిళ ఈనెల 13వ తేదీ మాతా శిశు వైద్యశాలలో మగ బిడ్డను ప్రసవించింది. అప్పుడా బిడ్డ బరువు ఒక కిలో 750 గ్రాములు. తక్కువ బరువు ఉన్న ఆ శిశువును వెంటనే రిమ్స్‌లో చేర్పించాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె వెంటనే ఆ శిశువును తీసుకొని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించింది. వైద్యం పొందుతున్న శిశువును ఎత్తుకుంటున్నట్లుగా చెప్పి బయటకు వచ్చేసింది. అప్పటికే ఆ మహిళ ఒంగోలుకు సమీపంలోని పేర్నమిట్టకు చెందిన దంపతులతో అక్రమ దత్తత ఒప్పందం కుదుర్చుకొని కన్న పేగును తెంచుకొని ఆ బిడ్డను ఇచ్చేసింది. పేర్నమిట్టకు చెందిన దంపతులు ఆ శిశువును రిమ్స్‌లోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించడంతో అక్కడి వైద్యుడు గుర్తించి, ఐసీపీఎస్ డీసీపీఓ జ్యోతిసుప్రియకు సమాచారం ఇచ్చారు. ఆమె పేర్నమిట్టకు చెందిన దంపతులను విచారించగా వారికి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వారి కుమారుడు పుట్టుకతోనే మంచానికి పరిమితమయ్యాడు. ప్రస్తుతం 13 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. ఆ దంపతులకు 12 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ నేపథ్యంలో మగ పిల్లాడు కావాలన్న ఆశతో దత్తత తీసుకున్నట్లు పేర్నమిట్టకు చెందిన దంపతులు అంగీకరించారు. గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ ఇంటి యజమాని మరో బిడ్డను అక్రమంగా దత్తత తీసుకున్నట్లు గుర్తించి వెంటనే ఐసీపీఎస్ డీసీపీఓ ఆ శిశువును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ పీడీ సరోజిని దృష్టికి తీసుకువెళ్లి బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు తమ ఆధీనంలోకి తీసుకొని రిమ్స్‌లోని నవజాత శిశు సంక్షరణ కేంద్రంలో చికిత్స నిమిత్తం ఉంచారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమ దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీఓ జ్యోతిసుప్రియ స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. -
ముళ్ల ఒడి తల్లడిల్లుతోంది
ఢిల్లీలో రోజుకు 29 ఫైట్లు జరుగుతుంటాయి. అవి రాష్ట్రాలవి. ఢిల్లీలోనే 8 ఏళ్లుగా ఓ ఫైట్ జరుగుతోంది. అది ఓ తల్లిది! ఢిల్లీ నుంచి తన పల్లెకు చేరాలని ఆమె ఆరాటం. వెళ్లొచ్చుగా.. ఏముంది ఢిల్లీలో? ఢిల్లీలో ఆమె ప్రాణం ఉంది. ఆ ప్రాణం.. ఎనిమిదేళ్ల ఆమె కూతురిలో ఉంది. ఆ కూతురు.. ‘ఇల్లీగల్ అడాప్షన్’లో ఉంది! బతుకు చీకటిని తప్పించుకోడానికి చీకటి బతుకులోకి జారిపడి.. ఒడిలోని కూతుర్ని చేజార్చుకున్న ఈ ‘రెడ్‌లైట్’ బాధితురాలు ఎదుగుతున్న ఆ కూతుర్ని దక్కించుకునేందుకు... న్యాయపోరాటం చేస్తోంది. పిల్ల లేనిదే ఢిల్లీ కదలనంటోంది. ఢిల్లీలోని రెడ్‌లైట్ ఏరియా. ‘నువ్వు నాకు నచ్చావ్! పెళ్లి చేసుకుంటా.. ఈ కూపంలోంచి బయటకు తీసుకెళ్తా!’ చెప్పాడు అతను. ‘హు..’ పేలవంగా నవ్వింది ఆమె. ‘నిజం.. ఒట్టు ... నన్ను నమ్ము’ ఆమె తల మీద చెయ్యేసి చెప్పాడు నమ్మకంగా! ‘ఆడవాళ్లనే నమ్మలేను నీ మాటెలా నమ్మాలి’.. తల మీదనుంచి చేయి తీసేస్తూ అన్నది ఆమె నిర్లిప్తంగా. ‘కానీ నన్ను నమ్ము’ నమ్మించే ప్రయత్నం చేస్తూ అతను. ‘నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే బ్రోతల్ హౌజ్ వాళ్లకు డబ్బు కట్టాలి.. పైగా నన్ను నీ భార్యగా మీ ఇంట్లోవాళ్లు ఒప్పుకుంటారా?’ అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఆమె. ‘వాళ్లు అడిగినంత డబ్బు కట్టే నిన్ను విడిపించుకు వెళ్తా.. ఇక మా ఇంట్లోవాళ్ల సంగతి అంటావా... ఇది నా పెళ్లి.. నా ఇష్టం’ అని సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె పేరు సారిక.. అతని పేరు రాకేశ్! (గోప్యత దృష్ట్యా ఇద్దరి పేర్లూ మార్చాం) ఆమెది ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామం. అందరి అమ్మాయిల్లాగే పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని హాయిగా సంసారం చేయాలని కలలు కన్నది. అనుకున్నట్టే చక్కటి భర్త దొరికాడు. యేడాది తిరక్కుండానే పండంటి బిడ్డ పుట్టింది. ఏ చింతా లేకుండా సాగిపోతున్న కాపురం ఒక్కసారిగా కల్లోలంలో పడింది. సారిక ఎనిమిదినెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె భర్తకు పాము కాటుకు చనిపోయాడు. అత్తింట, పుట్టింట ఆదరణ లేక.. అనాథయింది సారిక. చేతిలో బిడ్డతో ఆ నిండుచూలాలికి దిక్కు తోచలేదు. దమ్మిడీ ఆదాయం లేక ఆ పిల్లనెలా సాకేది? ఇంకో బిడ్డనెలా కనేది? అప్పుడు వచ్చింది పక్కింటామె. పొట్టకూటికోసం ఢిల్లీ వెళ్లి చుట్టపుచూపుగా సొంతూరుకి వచ్చిపోతూ ఉంటుంది. సారిక గురించి తెలిసి పరామర్శించడానికి ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టింది. ఆప్యాయంగా పలకరించింది. ఆ కాసింత ప్రేమకే కదిలిపోయింది సారిక. ఆమె ఒళ్లో తలపెట్టి వెక్కివెక్కి ఏడ్చింది. ‘పిచ్చిదానా...ఎందుకలా బాధపడ్తావ్? నేను లేనా?’ అని ఓదార్చింది. తనతోపాటు ఢిల్లీ వస్తే అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చింది. ఆశపడ్డ సారిక అంతలోనే అనుమానంతో పొట్ట మీద చేయి వేసుకుంది అనుమానంగా. సారిక ఆంతర్యం గ్రహించిన ఆమె ‘అక్కడ మంచి ఆసుపత్రిలో క్షేమంగా డెలివరీ చేయించే బాధ్యత నాది’ అంది సారిక చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ! గుండె నిండా ఊపిరిపీల్చుకుంది సారిక. కూతురు పుట్టిన నెలకు.. అలా పక్కింటామె భరోసా మీద నాలుగేళ్ల బిడ్డతో ఢిల్లీలో ఏపీ ఎక్స్‌ప్రెస్ దిగింది సారిక. పక్కింటామె ఇంట్లోనే బసచేసింది. ఇదిగో రేపే ఓ బట్టల దుకాణంలో సేల్స్ ఉమన్‌గా ఉద్యోగంలో పెట్టించబోతున్నా. అయిదువేల రూపాయల జీతం’ అని చెప్పింది. ఏరోజుకారోజే రేపు అంటూ పదిహేనురోజులు దాటవేసింది. ‘తర్వాత డెలివరీ కానివ్వు..’ అంది. ఆ మాట అన్న పదిహేను రోజులకి సారికకు పురుడొచ్చింది. కూతురు పుట్టింది. నెలయ్యాక నెమ్మదిగా తన అసలు రంగు బయటపెట్టింది పక్కింటామె. ‘నీకు ఏ బట్టల షాపులో ఉద్యోగం లేదు. నేను చెప్పిన చోట పనిచేయాలి. నెలకు అయిదు వేలు నాకే ఇవ్వాలి ఎందుకంటే నీ పిల్లల్లిదర్నీ నేను చేసుకోవాలి కాబట్టి’ అంటూ ఆమెను తీసుకెళ్లి ఓ బ్రోతల్హౌజ్లో పెట్టింది. సారిక పెద్ద కూతురిని గుర్గావ్లో ఉన్న ఓ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించింది. రెండో కూతురిని సారిక తన ఇష్టం మీదే దత్తత ఇస్తున్నట్టు దత్తత కాగితాల మీద బలవంతంగా సంతకాలు చేయించుకుంది. అలా సారిక బలవంతంగా వ్యభిచార కూపంలోకి వచ్చిపడింది. వారానికి ఒకసారి గుర్గావ్ వెళ్లి పెద్దకూతురిని చూసొస్తూ ఉండేది సారిక. కానీ ఢిల్లీలోని జీబీ రోడ్లో ఉన్న చిన్న కూతురి దగ్గరకే మొదట్లో రానిచ్చినా తర్వాత ఆ పిల్లను చూడనివ్వడం మానేశారు. సారిక బలవంతంగా వస్తే.. తమ మాట వినకపోతే పిల్లలిద్దర్నీ కూడా వ్యభిచారంలోకి దింపుతామని బెదిరించేవారు. ఆ భయానికి చిన్న కూతురు దగ్గరకి వెళ్లడమే మానేసింది. ఆ సమయంలోనే పరిచయమయ్యాడు రాకేశ్. ముందు విటుడుగా.. తర్వాత ప్రేమికుడిగా! అనుకున్నట్టే పెళ్లైంది రాకేశ్ తాను సారికకు ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఉంటున్న బ్రోతల్హౌజ్ యజమానికి లక్షరూపాయలు చెల్లించి సారికను విడిపించాడు. పెళ్లీ చేసుకున్నాడు. అప్పుడు చెప్పింది తన లక్ష్యాల గురించి రాకేశ్‌కి. అండగా ఉంటానని మాటిచ్చాడు. రాకేశ్ సహాయంతో పెద్ద కూతురిని తేలికగానే విడిపించుకుంది. తన బిడ్డ ఇక్కడుంటే ప్రమాదమని భావించి తీసుకెళ్లి తన సొంతూర్లో తమ్ముడు, మరదలి దగ్గర పెట్టింది. కూతురి అవసరాలకోసం నెలనెలకు తమ్ముడికి డబ్బులు పంపించి కూతురిని చదివించుకుంటోంది. రెండో బిడ్డ కోసం... ఢిల్లీలోని తానుంటున్న రెడ్‌లైట్ ఏరియా వదలాలనుకోలేదు సారిక. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి తాను దూరంగా వెళ్లిపోతే తనను ఈ నరకంలోకి నెట్టిన వాళ్ల కదలికలు తెలుసుకోలేదు. దాంతో రెండో బిడ్డ జాడా తెలియదు. అందుకే మొండిగా అదే ప్రాంతంలో ఇంకో బ్రోతల్ హౌజ్‌లో పనిచేయడం మొదలుపెట్టింది. రాకేశ్‌తో ఇంకో కూతురూ పుట్టింది. ఓ వైపు ఆ బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూనే తన రెండో బిడ్డ జాడ గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బిడ్డ ఆచూకీ కోసం కంప్లయింట్ ఇచ్చింది. తనను వ్యభిచారిగా మార్చిన స్త్రీ వచ్చింది. ‘ఆమె బిడ్డను ఆమెనే ఇష్టపూర్వకంగా దత్తతకు ఇచ్చింది’ అంటూ సారిక సంతకం చేసిన పత్రాలను పోలీసులకు చూపించింది. ‘ఈ సంతకం నీదేనా?’ అని అడిగారు పోలీస్ అధికారులు. పరీక్షగా చూసింది. అవును తనదే! కానీ బెదిరించి, భయపెట్టి పెట్టించిన సంతకం అది. ఆ విషయాన్నే పోలీసులకు మొరపెట్టుకుంది. ‘నువ్వు మైనర్‌వి, తెలియనిదానివి కాదు కదా.. భయపెట్టి సంతకం పెట్టించుకోవడానికి. నీ సంతకం ఉంది కాబట్టి ఏం చేయలేం’ అంటూ పెదవి విరిచారు. అవమానం, దుఃఖం, కోపం, నిస్సహాయత, తనమీద తనకే పుట్టిన జాలితో వెనుదిరిగింది సారిక. ఇంటికి వచ్చి గుండెపగిలేలా ఏడ్చింది. భార్య బాధ రాకేశ్ గుండెను పిండేసింది. సారిక న్యాయ పోరాటం బంధించి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేస్తూ ఇలాంటి కాగితాల మీద సంతకాలు చేయించడం నేరం. అలాంటివి చెల్లవు కూడా. దీనికే కాదు సారికను బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్లను ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్ నేరాల కింద అరెస్ట్ చేయాలి. సారికది న్యాయ పోరాటం. ఆమె పోరాటానికి శక్తివాహిని మద్దతు ఎప్పటికీ ఉంటుంది. - రవికాంత్, శక్తివాహిని ప్రధానకార్యకర్త శక్తివాహిని సహాయంతో.. స్థానికంగా పనిచేస్తున్న శక్తివాహిని అనే ఎన్జీవోకు వెళ్లాడు రాకేశ్. ఆ సంస్థ అధికారి రవికాంత్‌ను కలిశాడు. సారిక పరిస్థితిని వివరించాడు. ఆమె కథ విన్ని రవికాంత్ ఆమె రెండో కూతురును విడిపించడంలో తనకు సహాయపడ్తామని మాటిచ్చాడు. ఆ మరుసటిరోజే సారికను తీసుకెళ్లి రవికాంత్‌కు పరిచయం చేశాడు రాకేశ్. శక్తివాహిని ఆమెకు ధైర్యమిచ్చింది. బిడ్డ కోసం ఢిల్లీ కోర్ట్‌లో పిటీషన్ వేయించింది. ఇప్పుడు ఆ పోరాటంలోనే ఉంది సారిక. ‘భర్త చనిపోయిన నా నిస్సహాయస్థితిని ఆసరాగా తీసుకొని నన్ను నమ్మించి ఢిల్లీ తీసుకొచ్చి.. ఈ కోపంలోకి నెట్టింది. నా రెండోబిడ్డనూ నెట్టాలని చూస్తోంది. అసలు హిందీరాని కొత్తలో నా చేత ఏవో హిందీపేపర్ల మీద సంతకం చేయించి ఇప్పుడు అవే దత్తత కాగితాలని, వాటి మీద నేను ఇష్టపూర్వకంగా సంతకం చేశానని చూపిస్తోంది. నా ఇద్దరు బిడ్డలనూ వ్యభిచారంలోకి నెడ్తామని బెదిరించి నా చేత బలవంతంగా సంతకాలు చేయించారు. ఈ పాపాలకు వాళ్లకు శిక్షపడేలా చేయందే నిద్రపోను. ఎన్నేళ్లయినా సరే పోరాడుతాను. నా బిడ్డను తెచ్చుకుంటాను. నెల పసిగుడ్డప్పుడు నా నుంచి దూరం చేశారు. ఇప్పుడు దానికి ఎనిమిదేళ్లు. కోర్టు వాయిదాలకు వాళ్లతో కలిసి వస్తోంది. అసలు నన్ను గుర్తే పట్టడం లేదు. నేను నీ అమ్మను తల్లీ.. అని ఏడుస్తున్నా పిచ్చిదాన్ని.. పరాయిదాన్ని చూస్తున్నట్టు చూస్తోంది. అన్నిటికన్నా ఈ బాధను తట్టుకోలేకపోతున్నా..!’అంటోంది సారిక ఉబికొస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున్న ఆపుకుంటూ! ‘మా రెండో బిడ్డను తెచ్చుకోవడానికి మా ప్రాణాలను సైతం లెక్కచేయం. ఎంతదాకైనా పోరాడాతాం’ అంటున్నాడు రాకేశ్.