Illegal funds
-
బాబుకు ‘ఈడీ’ వేడి
సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది! హవాలా మార్గంలో అక్రమ నిధులు పొందే రాజకీయ పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్లు ఆధారాలున్నందున ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌పై ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం సరైనదేనని పేర్కొంది. ఈ కేసులో హవాలా మార్గంలో ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు చేరిన తరహాలోనే చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల మధ్య చాలా సారూప్యతలు న్నాయి. ఇప్పటికే స్కిల్ కుంభకోణంపై షెల్ కంపెనీలను విచారిస్తున్న ఈడీ ఇక చంద్రబాబును కూడా బోనెక్కించే అవకాశాలున్నాయి. ‘ఆప్’ చేతికి రూ.50 కోట్లు ఢిల్లీలో మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మళ్లించినట్లు ఈడీ నిర్థారించింది. 2022లో గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు హవాలా మార్గంలో రూ.50 కోట్లు చేరినట్లు ఆధారాలతో తేల్చింది. ఈ మేరకు గోవాలో ఆప్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఓ అభ్యర్థి వాంగ్మూలం కూడా ఇవ్వడం గమనార్హం. కేజ్రీవాలే బాధ్యత వహించాలి మద్యం కుంభకోణంపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 70 ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ, పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కేజ్రీవాల్ దీనికి బాధ్యత వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం రాజకీయ పార్టీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సంఘం. కంపెనీల చట్టం ప్రకారం ఓ కంపెనీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సముదాయం. రెండు వేర్వేరు చట్టాల ద్వారా నమోదైన రాజకీయ పార్టీ, కంపెనీల నిర్వచనం మాత్రం ఒకటే. కాబట్టి అక్రమ నిధులు పొందిన ఓ కంపెనీపై ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లుగానే అక్రమంగా నిధులు పొందిన రాజకీయ పార్టీపై కూడా అదే విధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు’ అని న్యాయమూర్తి ప్రకటించారు. ‘మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఆ పార్టీకి జాతీయ సమన్వయకర్త (అధ్యక్షుడు)గా ఉన్న కేజ్రీవాలే అందుకు బాధ్యత వహించాలి. ఆయనపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు. ఆయన అరెస్ట్ సరైనదే’ అని తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ స్కామ్‌లో టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు – బాధ్యత వహించాల్సింది చంద్రబాబే చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్‌లో కొల్లగొట్టిన నిధులు హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లోకి చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జర్మనీలోని సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు అంటూ నిధులు కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేసిన రూ.371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు బంగ్లాకు చేర్చిన అవినీతి నెట్వర్క్ గుట్టును సిట్ బయట పెట్టింది. అందులో రూ.65.86 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు పక్కా ఆధారాలతో గుర్తించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నాలుగు బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు. జూబ్లీహిల్స్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలున్నాయి. వాటిల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 చొప్పున జమ చేశారు. జూబ్లీ హిల్స్‌లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయి నోట్లను కట్టల రూపంలో తరలించి ఈ అక్రమ నిధులను జమ చేశారు. విస్తుపోయే విషయం ఏమిటంటే.. ఆ నిధులు తమకు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించకుండానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. ఆ సమయంలో టీడీపీ బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులను జమ చేశారు. భారీ డిపాజిట్లకు సంబంధించి ఆదాయ మార్గాలు వెల్లడించాల్సి ఉండగా టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86 కోట్లు జమ కావడం గమనార్హం. నోట్ల డిపాజిట్ సమయంలో ‘పే–స్లిప్’లో ఆ నిధులు ఎలా వచ్చాయనే విషయాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి. ఇక బాబుపై ఈడీ కొరడా! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కు సంబంధించి సిట్ పూర్తి ఆధారాలను ఈడీకి అందచేసింది. షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో నిధుల తరలింపుపై కేసు నమోదు చేసిన ఈడీ ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఇప్పటికే సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్‌చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్‌తోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్‌టెక్ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఈ కేసులో ఆ కంపెనీ ఆస్తులను జప్తు చేయడం సరైన చర్యేనని ఏపీ హైకోర్టు కూడా సమర్థించింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లో చేరిన అక్రమ నిధులపై ఈడీ దృష్టి సారించాల్సి ఉంది. తాజా తీర్పు ప్రకారం రాజకీయ పార్టీ ఖాతాలో చేరే అక్రమ నిధులకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలి. అంటే టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబే నిందితుడు అన్నది సుస్పష్టం. ఈ క్రమంలో ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని పలువురు న్యాయ నిపుణులతోపాటు సిట్ కూడా ఈడీ దృష్టికి తీసుకెళ్లనుంది. -
పచ్చ నోట్ల పంపిణీ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ప్రజాబలంతో ఎన్నికల్లో విజయం సాధించలేమని స్పష్టం కావడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పచ్చ నోట్ల దందాకు తెరతీశారు. రూ.వేల కోట్లు వెదజల్లి ఎన్నికల్లో అక్రమాలకు బరి తెగించేందుకు సన్నద్ధమయ్యారు. దశాబ్దాలుగా తన కుట్ర రాజకీయాల్లో భాగస్వాములైన ఈనాడు రామోజీరావు, పొంగూరు నారాయణలతోపాటు టీడీపీ బడా బాబుల వ్యాపార సంస్థలనే నల్లధనం డంపింగ్ యార్డులుగా మార్చేశారు. విశాఖ నుంచి నెల్లూరు వరకు పచ్చనేతల షిప్పింగ్, ఆక్వా కంపెనీలను నల్లధనం కంటైనర్లకు గమ్యస్థానాలుగా చేసుకున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ తరలిస్తున్న నల్లధనం బాగోతం ఇప్పటికే రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, పోలీసుల సోదాల్లో బయటపడింది. కాకపోతే దొరికింది గోరంతే! గుట్టుచప్పుడు కాకుండా సిద్ధం చేసిన గిడ్డంగుల్లో టీడీపీ పెద్దలు గుట్టలు గుట్టలుగా అక్రమ నిధులు దాచిపెట్టినట్లు స్పష్టమవుతోంది. కుట్రలకు ‘మార్గదర్శి’ చంద్రబాబు రాజకీయ, ఆర్థిక కుట్రల్లో భాగస్వామి ఈనాడు రామోజీ మరోసారి నల్లధనం తరలింపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. మీడియా ముసుగులో నిత్యం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతున్న ఆయన మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాలను టీడీపీ అక్రమ నిధుల తరలింపు కేంద్రాలుగా మార్చారు. రోజూ చిట్‌ఫండ్స్ కార్యాలయాల ద్వారా టర్నోవర్ ముసుగులో అక్రమ నిధులను చాప కింద నీరులా టీడీపీ అభ్యర్థులకు చేరవేస్తున్నారు. విశాఖలో ఎలాంటి పత్రాలు లేకుండా మార్గదర్శి కార్యాలయం నుంచి తరలిస్తున్న రూ.51.88 లక్షల నగదు, రూ.39.29 లక్షలు విలువ చేసే చెక్కులను తాజాగా పోలీసులు గుర్తించి జప్తు చేయడం తెలిసిందే. అయితే మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేంద్రంగా సాగుతున్న నల్లధనం దందాలో పట్టుబడిన ఈ మొత్తం సముద్రంలో కాకి రెట్ట లాంటిదే. ఆర్థిక అక్రమాల కోసం మార్గదర్శి చిట్‌ఫండ్స్ మొదటి నుంచి పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. డిజిటల్ చెల్లింపులు కాకుండా నగదు లావాదేవీలు నిర్వహిస్తోంది. విశాఖ బ్రాంచిలో మూడు రోజుల లావాదేవీల మొత్తాన్ని తాము తరలిస్తున్నట్లు సోదాల సందర్భంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది చెప్పారు. మూడు రోజులకే ఒక్క బ్రాంచిలో రూ.51.88 లక్షలు లావాదేవీల పేరుతో నల్లధనాన్ని తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలకు టీడీపీ సిద్ధపడిందో ఊహించవచ్చు. దీని ప్రకారం నెలకు రూ.5.10 కోట్లు వసూలు చేస్తున్నట్లే. రాష్ట్రంలోని 37 బ్రాంచిల ద్వారా నెలకు సగటున రూ.188.70 కోట్లు వసూలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మే నెలలో నిర్వహించనున్న ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు జనవరి నుంచి ఈ విధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ద్వారా అక్రమ నిధులు తరలిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇలా మార్గదర్శి కార్యాలయాల నుంచి రూ.వందల కోట్లను ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా తరలించినట్లు స్పష్టమవుతోంది. 2022 నవంబరు నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో కొత్త చిట్టీలు వేయడం లేదు. అయినా సరే ఈ స్థాయిలో నగదు లావాదేవీలు నిర్వహిస్తుండటం వెనుక లోగుట్టు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని 37 మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలకు ఆదేశించి నగదు లావాదేవీల రికార్డులను తనిఖీ చేస్తే అక్రమాల బాగోతం బట్టబయలవుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. దొంగ ఓట్ల బడి ‘నారాయణ’ మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థలు ఎన్నికల అక్రమాల శిక్షణా కేంద్రాలుగా మారాయి. నారాయణ విద్యా సంస్థల్లో చదువులు ఎలా చెబుతారో తెలియదు కానీ ఓటర్లను ఎలా ప్రలోభాలకు గురి చేయాలి? నోట్లు పంచి ఓట్లు ఎలా కొనుగోలు చేయాలి? అనేది టీడీపీ శ్రేణులకు పక్కాగా బోధిస్తారు. 2014, 2019 ఎన్నికల్లో అక్రమ నిధుల తరలింపు కేంద్రాలుగా నారాయణ విద్యా సంస్థలే ప్రధాన పాత్ర పోషించాయన్నది బహిరంగ రహస్యం. టీడీపీ హయాంలో అమరావతిలో భూదందాలో నారాయణ ‘ఎన్‌స్పైరా’ నుంచే అక్రమ నిధులు తరలించారన్నది సీఐడీ దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైంది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల నెల్లూరులోని ఎన్‌స్పైరా కార్యాలయాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ బాగోతం బట్టబయలైంది. నారాయణ విద్యా సంస్థల నిర్వహణ వ్యయం పేరిట అక్రమ నిధులు తరలిస్తున్నట్లు బయటపడింది. ఈదఫా ఎన్నికల్లో మరింత బరి తెగించారు. ఎన్‌స్పైరా ముసుగులో అక్రమ నిధుల పంపిణీకి పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయడం పచ్చ పన్నాగానికి పరాకాష్ట. జిల్లా కేంద్రాల్లోని నారాయణ విద్యా సంస్థలు, వాటి కార్యాలయాల నుంచే టీడీపీ అభ్యర్థులకు అక్రమ నిధుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులు చెల్లించిన ఫీజుల ముసుగులో చడీచప్పుడు కాకుండా కుట్రను అమలు చేసేందుకు ఉపక్రమించారు. నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులు, వారు చెల్లించిన ఫీజుల వివరాలు, బ్యాంకుల్లో జమ చేస్తున్న మొత్తం, ఇతర వ్యయం పేరిట చూపిస్తున్న లెక్కలను పరిశీలిస్తే ఈ అక్రమాల గుట్టు రట్టు కావడం ఖాయం. ఎన్నికల కమిషన్ నారాయణ విద్యా సంస్థల్లో సమగ్రంగా సోదాలు నిర్వహించి రికార్డులు, బ్యాంకు ఖాతాలను తనిఖీలు చేయాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. తీరం వెంట అక్రమ నిధుల డంపింగ్ యార్డులు రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతాన్ని ఎన్నికల అక్రమాలకు చుక్కానిగా చేసుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందుకోసం విశాఖ నుంచి నెల్లూరు వరకు టీడీపీ బడాబాబులకు చెందిన షిప్పింగ్, ఆక్వా కంపెనీలను దొంగ నోట్ల కేంద్రాలుగా, అక్రమ నిధులను తరలించే కంటైనర్లుగా మార్చుకోవడం ఆయన బరి తెగింపు రాజకీయాలకు నిదర్శనం. బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగ్నేశ నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీ కంటైనర్లలో తరలిస్తున్న అక్రమ నిధులు మార్చి 28న పోలీసుల సోదాల్లో బయట పడటం గమనార్హం. విదేశాల్లోని టీడీపీ సానుభూతిపరుల నుంచి సేకరించిన నిధులను లావాదేవీల ముసుగులో కంటైనర్ల ద్వారా మన రాష్ట్రంలోని పోర్టులకు తరలించడం ఆ పార్టీ పెద్దల లక్ష్యం. విశాఖ, కాకినాడ, నెల్లూరులో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన బడా బాబుల షిప్పింగ్ కంపెనీలు, ఆక్వా కంపెనీల గిడ్డంగులకు తరలించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయాలని పన్నాగం పన్నారు. ఇప్పటికే విశాఖపలోని ఓ షిప్పింగ్ కంపెనీ యజమానికి చెందిన గిడ్డంగులు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు అక్రమ నిధుల పంపిణీ కేంద్రాలుగా మారాయి. విశాఖ, భీమిలీ తీరప్రాంతంలోని టీడీపీకి బడాబాబుకు చెందిన ఓ హేచరీస్ కంపెనీ స్థావరంగా ఉత్తరాంధ్ర అంతటా అక్రమ నిధులు తరలించేందుకు కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే రీతిలో కాకినాడ జిల్లాలో టీడీపీ అభ్యర్థి ఒకరు తీరప్రాంతంలోని హేచరీలు, ఆక్వా కేంద్రాలు అడ్డాగా అక్రమ నిధులు తరలింపును పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు కేంద్ర స్థానంగా గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ తెరతీసింది. రాష్ట్రమంతా పర్చూరు మోడల్ ఎన్నికల్లో రూ.వేల కోట్లను వెదజల్లడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే పన్నాగాన్ని పక్కాగా పర్యవేక్షించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో అమలు చేసిన పథకాన్ని ఈసారి మరింత పకడ్బందీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలన్నది ఆయన కుతంత్రం. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గత ఎన్నికల్లో పాల్పడిన అక్రమాలు ఇటీవల డీఆర్ఐ సోదాల్లో వెలుగులోకి వచ్చాయి. మండలాలు, పంచాయతీలవారీగా ఓటర్లకు పంపిణీ చేయాల్సిన విధానం, ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించడం, అందుకోసం నిధుల వ్యయం, ఓట్ల కొనుగోలు, దొంగ ఓట్ల పర్యవేక్షణకు వివిధ స్థాయిలో బాధ్యుల నియామకం తదితరాలతో ఓ బ్లూప్రింట్‌ను రూపొందించి ఎమ్మెల్యే సాంబశివరావు అమలు చేశారు. తన వ్యాపార సంస్థ నోవా అగ్రిటెక్ ఆర్థిక వ్యవహారాల ముసుగులో ఆ కుత్రంతాన్ని అమలు చేశారు. అదే రీతిలో బ్లూప్రింట్‌ను టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని నియోజకవర్గాలకు పంపి కుట్రను పక్కాగా అమలు చేయాలన్నది చంద్రబాబు పన్నాగం. అందుకోసం మార్గదర్శి చిట్‌ఫండ్స్, నారాయణ విద్యా సంస్థలు, టీడీపీ బడాబాబులకు చెందిన షిప్పింగ్, ఆక్వా, ఇతర కంపెనీలను వాడుకోవాలని కుతంత్రం రచించారు. చంద్రబాబు, లోకేశ్, రామోజీ, నారాయణ, పచ్చ కోటరీలోని ఇతర ముఖ్యులు సర్వం తామై ఈ ఎన్నికల కుతంత్రం పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవడం గమనార్హం. ఎన్నికల్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడటం, రూ.వేల కోట్లు వెదజల్లడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, అవసరమైతే భయోత్పాతం సృష్టించేందుకు చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పచ్చ ముఠా అక్రమ నోట్ల గిడ్డంగులపై వెంటనే దాడులు నిర్వహించేలా ఎన్నికల కమిషన్ క్రియాశీలం కావడం ఒక్కటే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్షని పరిశీలకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
మైసూర్ కాఫీపై సెబీ జరిమానా
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్(ఎంఏసీఈఎల్)పై రూ. కోటి జరిమానా విధించింది. రూ. 3,535 కోట్ల నిధులను అక్రమ బదిలీ చేసేందుకు ప్రయివేట్ రంగ కంపెనీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(సీడీఈఎల్)ను ప్రేరేపించిన కేసులో ఫైన్ వేసింది. 45 రోజుల్లోగా జరిమానాను చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఈ రెండు సంస్థలూ దివంగత వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థ, ఆయన కుటుంబ సభ్యుల అజమాయిషీలో ఉన్న కంపెనీలు కాగా.. సీడీఈఎల్ అనుబంధ సంస్థల నుంచి నిధుల అక్రమ బదిలీకి ఎంఏసీఈఎల్ సహకరించినట్లు సెబీ పేర్కొంది. తద్వారా సెబీ చట్టం, పీఎఫ్‌యూటీపీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలియజేసింది. -
‘కోడెల ట్యాక్స్’ను కక్కిస్తున్నారు!
సాక్షి, గుంటూరు: అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమ అనుచరుల ద్వారా కోడెల కుమారుడు, కుమార్తెలు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడ్డ విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కే ట్యాక్స్ (కోడెల ట్యాక్స్) పేరుతో వ్యాపారులు, అధికారులు, కాంట్రాక్టర్లు, రైతులతో సహా ఎవరినీ వదలకుండా అందరి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. అనేక మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో డబ్బులు తీసుకుని పట్టించుకోలేదు. డబ్బులు వెనక్కు ఇవ్వకుండా తిప్పుతూ వచ్చారు. అదేమని అడిగితే అంతు చూస్తామంటూ కోడెల కుమారుడు, కుమార్తెల అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. తమకు అన్యాయం జరిగిందంటూ బాధితులు అధికారులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోవడంతో వారిలో వారు కుమిలిపోవడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో మిన్నకుండిపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఘోర పరాజయంపాలైన విషయం తెలిసిందే. దీంతో గతంలో కోడెల ట్యాక్స్ పేరుతో వసూలు చేసిన డబ్బులు వెనక్కు ఇప్పించాలంటూ బాధితులు పోలీసుస్టేషన్లకు క్యూ కడుతున్నారు. నిరుద్యోగుల ఫిర్యాదు కోడెల కుమార్తె విజయలక్ష్మి ఆదేశించారంటూ నరసరావుపేటకు చెందిన టీడీపీ నాయకుడు రాంబాబు తమను బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేశారని, వాటిని వెనక్కు ఇప్పించి న్యాయం చేయాలంటూ నరసరావుపేట మండలం కేశానుపల్లికి చెందిన ఓ బాధితుడు ఇటీవల నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సదరు టీడీపీ నేతను పిలిచి విచారించడంతో మరుసటి రోజే వసూలు చేసిన రూ.10 లక్షలను వెనక్కు ఇచ్చేశారు. విషయం బయటకు తెలియడంతో అతనితోపాటు రూ.25 లక్షలు ఇచ్చిన వారు సైతం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సబ్‌స్టేషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 17 మంది నిరుద్యోగుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల చొప్పున కోడెల కుమార్తె విజయలక్ష్మికి ఇవ్వాలంటూ టీడీపీ నేత రాంబాబు వసూలు చేసినట్లు సమాచారం. అయితే వీరిలో తొమ్మిది మందికి మాత్రమే ఉద్యోగాలు ఇప్పించగలిగారు. మిగతా ఎనిమిది మందికి ఉద్యోగం ఇప్పించకపోగా వారి వద్ద వసూలు చేసిన డబ్బులు సైతం వెనక్కు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. డబ్బులు వెనక్కు ఇవ్వమని అడిగితే బెదిరిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. శుక్రవారం ఎనిమిది మంది నిరుద్యోగులు నరసరావుపేట వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై వన్‌టౌన్ సీఐ బిలాలుద్దీన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెలుగులోకి వస్తున్న ‘కోడెల’ అక్రమాలు... రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బాధితులు ఒక్కొక్కరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓ బాధితునికి తాము నొక్కేసిన రూ.10 లక్షలను ‘కోడెల బ్యాచ్’ వెనక్కు ఇచ్చేశారనే వార్త బయటకు పొక్కింది. మిగిలిన బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ‘కోడెల’ అక్రమ దందాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు, కుమార్తె వల్ల ఇబ్బందులు పడ్డ బాధితులంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తే వాటిని కేసులుగా నమోదు చేసేందుకు ప్రత్యేక పోలీసు స్టేషన్లు.. వాటిని విచారించేందుకు ప్రత్యేక కోర్టులు పెట్టాల్సినంతమంది బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. -
అక్రమ నిధులకు అయస్కాంతం
పనామా సిటీ: అటు పసిఫిక్... ఇటు అట్లాంటిక్. ఆ రెండింటినీ కలిపే పనామా కాలువ చుట్టూ విస్తరించిన కరీబియన్ దేశం. దశాబ్ద కాలంగా ఈ దేశం సగటున 8.5% వృద్ధిని సాధిస్తోంది. దేశ జీడీపీలో80 శాతం వచ్చేది సర్వీసులపైనే. వాటిలోనూ ఆగ్రస్థానం బ్యాంకింగ్, బీమా, పర్యాటకాలదే. దీన్ని బట్టే ఇక్కడికి విదేశీ డబ్బు ఎంత వస్తోందో, ఎలా వస్తోందో ఒక అంచనాకు రావచ్చు. నిజానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ స్థాయి వృద్ధిని సాధించలేకపోతున్నాయి. విదేశాలనుంచి ప్రముఖుల డబ్బు వరదలా వెల్లువెత్తడంతో పనామా సిటీ లాటిన్ అమెరికా దేశాల దుబాయ్‌గా మారిపోయింది. అసలిన్ని నిధులు పనామాకు ఎలా వస్తున్నాయ్? ఎప్పటి నుంచి ఈ దేశం ఇలాంటి ‘అక్రమ’ కార్యక్రమాలకు కేంద్రమైంది? 1980ల్లోనే మొదలు... పనామాలో ఇలాంటి పరిస్థితులు కొత్తకాదు. 1980ల్లోనే ఇది మనీ లాండరింగ్‌కు కేంద్రం. అప్పటి నియంత జనరల్ మాన్యుల్ నోరెగా.. కొలంబియా డ్రగ్ ఉత్పతిదారులకు ఎర్రతివాచీతో స్వాగతం పలికాడు. అప్పటినుంచి అక్రమ డబ్బుకు ఇదో అయస్కాంతంగా మారిపోయింది. డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కావడంతో ఆర్జించిన సొమ్మును డాలర్లలో దాచుకునే వెసులుబాటుంది. ఇక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థయిన అమెరికాకు చేరువలో ఉండడం కూడా పనామాకు కలిసొచ్చింది. అలాగని ఇక్కడున్న కంపెనీలన్నీ ‘అక్రమ’ కేంద్రాలు కావు. న్యాయబద్ధంగా నడుస్తున్న కంపెనీలూ పనామాలో ఉన్నాయి. అమెరికా 3.. పనామా 13 నిజానికి షెల్ కంపెనీలకు పనామా ఒక్కటే కేంద్రం కాదు. పన్నులు తక్కువగా ఉన్న పలు దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ‘ద వాచ్ డాగ్ గ్రూప్’ వెల్లడించిన ఫైనాన్షియల్ సీక్రెసీ సూచీలో అమెరికా 3వ స్థానంలో ఉండగా పనామా స్థానం 13. లండన్‌లోని ట్యాక్స్ జస్టిస్ నెట్వర్క్ అంచనా ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా 21 ట్రిలియన్ డాలర్ల (రూ.138 కోట్ల కోట్లు) నుంచి 32 ట్రిలియన్ డాలర్ల (రూ.210 కోట్ల కోట్లు) పన్ను ఎగవేసిన లేదా స్వల్పంగా పన్ను చెల్లించిన సంపద ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో ‘గ్లోబల్ షెల్ గేమ్స్’ పేరిట కొందరు ఆర్థిక వేత్తలు విడుదల చేసిన పుస్తకంలో పన్నులు ఎగవేసే వారికి ఆశ్రయమిచ్చే దేశాలు, షెల్ కంపెనీల ఏర్పాటుకు 182 అనువైన ప్రాంతాలు, ఇందుకు సహకరించే 3700 కార్పొరేట్ సర్వీస్ ప్రొవైడర్ల గురించి సవివరంగా పేర్కొన్నారు. ఈ పుస్తకంలో వివరాలు దిమ్మతిరిగే వాస్తవాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇలాంటి అక్రమ కంపెనీల్లో పనామా వాటా 29 శాతం. ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఫొటో గుర్తింపుకార్డు, కంపెనీ యజమానిగా గుర్తించేందుకు కావాల్సిన ఇతర పత్రాలుంటే చాలు. ఇట్టే కంపెనీకి డెరైక్టర్ అయిపోవచ్చు. ఇలాంటి కంపెనీల్లో 25 శాతానికి అమెరికా, 6 శాతానికి డెలావర్ ఆశ్రయమిస్తున్నాయి. నిష్పాక్షిక విచారణ పనామా పేపర్స్ లీకేజీ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపనున్నట్లు తెలిపింది. దేశ, విదేశాల్లోని మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ ఘటనలో జరిగిన తప్పొప్పుల విచారణకు ప్రభుత్వం తరపున కావాల్సిన సహాయసహకారాలు అందుతాయని పనామా అధ్యక్షుడు జువాన్ కార్లోస్ వరేలా తెలిపారు. పనామా ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏ పనినీ ఉపేక్షించబోమన్నారు. మనీ లాండరింగ్ కేంద్రం అనే ముద్ర వేయటం సరికాదన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టినవారంతా అక్రమార్కులు కారన్నారు. హవ్వ! ఇంత జరుగుతుందా? పనామా పేపర్స్ లీక్ నేపథ్యంలో ప్రపంచం ముక్కున వేలేసుకుంటే.. పనామా ప్రజలూ ఆశ్చర్యపోతున్నారు. తమ దేశం ఇన్నాళ్లూ పన్ను ఎగవేతదారులు, అవినీతి తిమింగలాలు, డ్రగ్ డీలర్లకు స్వర్గధామంగా మారిన సంగతి తమకు తెలియదనే చెబుతున్నారు. మొసాక్ ఫోన్సెకా కంపెనీ సహ వ్యవస్థాపకుడు రొమాన్ ఫోన్సెకా మాట్లాడుతూ... ఆర్థికమాంద్యం నేథ్యంలో ధనవంతులు పనామాకు రావటం తట్టుకోలేక కొందరు కావాలనే ఈ పత్రాలను విడుదల చేశారని, ఇది అన్యాయమని చెప్పారు.