పచ్చ నోట్ల పంపిణీ కేంద్రాలు | Disbursement of illegal funds | Sakshi
Sakshi News home page

పచ్చ నోట్ల పంపిణీ కేంద్రాలు

Published Thu, Apr 4 2024 4:39 AM | Last Updated on Thu, Apr 4 2024 11:48 AM

Disbursement of illegal funds - Sakshi

బాబు బృందం వ్యాపార సంస్థలే డంపింగ్‌ స్థావరాలు

‘మార్గదర్శి’ కేంద్రంగా అక్రమ నిధుల పంపిణీ

నారాయణ విద్యా సంస్థల నుంచే నల్లధనం దందా

టీడీపీ బడాబాబుల షిప్పింగ్, ఆక్వా కంపెనీలే 

అక్రమ నిధుల గిడ్డంగులు.. ప్రలోభాలు.. విచ్చలవిడిగా 

నోట్ల దందా.. భారీగా దొంగ ఓట్లే లక్ష్యం

ఎన్నికల్లో అక్రమాలకు చంద్రబాబు బరితెగింపు  

సాక్షి, అమరావతి: ప్రజాబలంతో ఎన్నికల్లో విజ­యం సాధించలేమని స్పష్టం కావడంతో టీడీపీ అ­ధ్య­క్షుడు చంద్రబాబు పచ్చ నోట్ల దందాకు తెర­తీ­శా­రు. రూ.వేల కోట్లు వెదజల్లి ఎన్నికల్లో అక్రమాలకు బరి తెగించేందుకు సన్నద్ధమయ్యారు. దశాబ్దాలుగా తన కుట్ర రాజకీయాల్లో భాగస్వా­ములైన ఈనాడు రామోజీరావు, పొంగూరు నారాయణలతోపాటు టీడీపీ బడా బాబుల వ్యాపార సంస్థలనే నల్లధనం డంపింగ్‌ యార్డులుగా మార్చేశారు.

విశాఖ నుంచి నెల్లూరు వరకు పచ్చనేతల షిప్పింగ్, ఆక్వా కంపెనీలను నల్లధనం కంటైనర్లకు గమ్యస్థానాలుగా చేసుకున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ తరలిస్తున్న నల్లధనం బాగోతం ఇప్పటికే రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్, పోలీసుల సోదాల్లో బయటపడింది. కాకపోతే దొరికింది గోరంతే! గుట్టుచప్పుడు కాకుండా సిద్ధం చేసిన గిడ్డంగుల్లో టీడీపీ పెద్దలు గుట్టలు గుట్టలుగా అక్రమ నిధులు దాచిపెట్టినట్లు స్పష్టమవుతోంది. 

కుట్రలకు ‘మార్గదర్శి’
చంద్రబాబు రాజకీయ, ఆర్థిక కుట్రల్లో భాగస్వామి ఈనాడు రామోజీ మరోసారి నల్లధనం తరలింపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. మీడియా ముసు­గులో నిత్యం ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లుతున్న ఆయన మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాలను టీడీపీ అక్రమ నిధుల తరలింపు కేంద్రాలుగా మార్చారు. రోజూ చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల ద్వారా టర్నోవర్‌ ముసుగులో అక్రమ నిధులను చాప కింద నీరులా టీడీపీ అభ్యర్థులకు చేరవేస్తున్నారు.

విశాఖలో ఎ­లాంటి పత్రాలు లేకుండా మార్గదర్శి కార్యా­లయం నుంచి తరలిస్తున్న రూ.51.88 లక్షల నగదు, రూ.39.29 లక్షలు విలువ చేసే చెక్కులను తాజాగా పోలీసులు గుర్తించి జప్తు చేయడం తెలిసిందే. అయి­తే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేంద్రంగా సాగుతున్న నల్లధనం దందాలో పట్టుబడిన ఈ మొత్తం సము­ద్రంలో కాకి రెట్ట లాంటిదే.  ఆర్థిక అక్రమాల కోసం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మొదటి నుంచి పక్కా పన్నా­గంతో వ్యవహరిస్తోంది. డిజిటల్‌ చెల్లింపులు కాకుండా నగదు లావాదేవీలు నిర్వహిస్తోంది. విశా­ఖ బ్రాం­చిలో మూడు రోజుల లావాదేవీల మొత్తాన్ని తాము తరలిస్తున్నట్లు సోదాల సందర్భంగా మార్గ­దర్శి చిట్‌ఫండ్స్‌ సిబ్బంది చెప్పారు.

మూ­డు రోజు­లకే ఒక్క బ్రాంచిలో రూ.51.88 లక్షలు లావాదేవీల పేరుతో నల్లధనాన్ని తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలకు టీడీపీ సిద్ధపడిందో ఊహించవచ్చు. దీని ప్రకారం నెలకు రూ.5.10 కోట్లు వసూలు చేస్తున్నట్లే. రాష్ట్రంలోని 37 బ్రాంచిల ద్వారా నెలకు సగటున రూ.188.70 కోట్లు వసూలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మే నెలలో నిర్వహించనున్న ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు జనవరి నుంచి ఈ విధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ద్వారా అక్రమ నిధులు తరలిస్తున్నట్లు భావిస్తున్నారు.

ఇలా మార్గ­దర్శి కార్యాలయాల నుంచి రూ.వందల కోట్లను ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా తరలించినట్లు స్పష్టమవుతోంది. 2022 నవంబరు నుంచి మార్గ­దర్శి చిట్‌ఫండ్స్‌లో కొత్త చిట్టీలు వేయడం లేదు. అయినా సరే ఈ స్థాయిలో నగదు లావాదేవీలు నిర్వహిస్తుండటం వెనుక లోగుట్టు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల కమిషన్‌ రాష్ట్రంలోని 37 మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల్లో సోదాలకు ఆదేశించి నగదు లావాదేవీల రికార్డులను తనిఖీ చేస్తే అక్రమాల బాగోతం బట్టబయలవుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

దొంగ ఓట్ల బడి ‘నారాయణ’
మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థలు ఎన్నికల అక్రమాల శిక్షణా కేంద్రాలుగా మారాయి. నారాయణ విద్యా సంస్థల్లో చదువులు ఎలా చెబుతారో తెలియదు కానీ ఓటర్లను ఎలా ప్రలోభాలకు గురి చేయాలి? నోట్లు పంచి ఓట్లు ఎలా కొనుగోలు చేయాలి? అనేది టీడీపీ శ్రేణులకు పక్కాగా బోధిస్తారు. 2014, 2019 ఎన్నికల్లో అక్రమ నిధుల తరలింపు కేంద్రాలుగా నారాయణ విద్యా సంస్థలే ప్రధాన పాత్ర పోషించాయన్నది బహిరంగ రహస్యం. టీడీపీ హయాంలో అమరావతిలో భూదందాలో నారాయణ ‘ఎన్‌స్పైరా’ నుంచే అక్రమ నిధులు తరలించారన్నది సీఐడీ దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైంది.

ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇటీవల నెల్లూరులోని ఎన్‌స్పైరా కార్యాలయాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ బాగోతం బట్టబయలైంది. నారాయణ విద్యా సంస్థల నిర్వహణ వ్యయం పేరిట అక్రమ నిధులు తరలిస్తున్నట్లు బయటపడింది. ఈదఫా ఎన్నికల్లో మరింత బరి తెగించారు. ఎన్‌స్పైరా ముసుగులో అక్రమ నిధుల పంపిణీకి పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయడం పచ్చ పన్నాగానికి పరాకాష్ట. జిల్లా కేంద్రాల్లోని నారాయణ విద్యా సంస్థలు, వాటి కార్యాలయాల నుంచే టీడీపీ అభ్యర్థులకు అక్రమ నిధుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు.

విద్యార్థులు చెల్లించిన ఫీజుల ముసుగులో చడీచప్పుడు కాకుండా కుట్రను అమలు చేసేందుకు ఉపక్రమించారు. నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులు, వారు చెల్లించిన ఫీజుల వివరాలు, బ్యాంకుల్లో జమ చేస్తున్న మొత్తం, ఇతర వ్యయం పేరిట చూపిస్తున్న లెక్కలను పరిశీలిస్తే ఈ అక్రమాల గుట్టు రట్టు కావడం ఖాయం. ఎన్నికల కమిషన్‌ నారాయణ విద్యా సంస్థల్లో సమగ్రంగా సోదాలు నిర్వహించి రికార్డులు, బ్యాంకు ఖాతాలను తనిఖీలు చేయాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.

తీరం వెంట అక్రమ నిధుల డంపింగ్‌ యార్డులు
రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతాన్ని ఎన్నికల అక్రమాలకు చుక్కానిగా చేసుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందుకోసం విశాఖ నుంచి నెల్లూరు వరకు టీడీపీ బడాబాబులకు చెందిన షిప్పింగ్, ఆక్వా కంపెనీలను దొంగ నోట్ల కేంద్రాలుగా, అక్రమ నిధులను తరలించే కంటైనర్లుగా మార్చుకో­వడం ఆయన బరి తెగింపు రాజకీయాలకు నిదర్శనం. బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగ్నేశ నరేంద్ర వర్మకు చెందిన రాయల్‌ మెరైన్‌ కంపెనీ కంటైనర్లలో తరలిస్తున్న అక్రమ నిధులు మార్చి 28న పోలీసుల సోదాల్లో బయట పడటం గమనార్హం.

విదేశాల్లోని టీడీపీ సానుభూతిపరుల నుంచి సేకరించిన నిధులను లావాదేవీల ముసుగులో కంటైనర్ల ద్వారా మన రాష్ట్రంలోని పోర్టులకు తరలించడం ఆ పార్టీ పెద్దల లక్ష్యం. విశాఖ, కాకినాడ, నెల్లూరులో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన బడా బాబుల షిప్పింగ్‌ కంపెనీలు, ఆక్వా కంపెనీల గిడ్డంగులకు తరలించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయాలని పన్నాగం పన్నారు. ఇప్పటికే విశాఖపలోని ఓ షిప్పింగ్‌ కంపెనీ యజమానికి చెందిన గిడ్డంగులు అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలోని నియోజక­వర్గాలకు అక్రమ నిధుల పంపిణీ కేంద్రాలుగా మారాయి.

విశాఖ, భీమిలీ తీరప్రాంతంలోని టీడీపీకి బడాబాబుకు చెందిన ఓ హేచరీస్‌ కంపెనీ స్థావరంగా ఉత్తరాంధ్ర అంతటా అక్రమ నిధులు తరలించేందుకు కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే రీతిలో కాకినాడ జిల్లాలో టీడీపీ అభ్యర్థి ఒకరు తీరప్రాంతంలోని హేచరీలు, ఆక్వా కేంద్రాలు అడ్డాగా అక్రమ నిధులు తరలింపును పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు కేంద్ర స్థానంగా గ్రేటర్‌ రాయలసీమ జిల్లాల్లో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ తెరతీసింది. 

రాష్ట్రమంతా పర్చూరు మోడల్‌
ఎన్నికల్లో రూ.వేల కోట్లను వెదజల్లడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే పన్నాగాన్ని పక్కాగా పర్యవేక్షించాలని చంద్రబాబు భావిస్తు­న్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో అమలు చేసిన పథకాన్ని ఈసారి మరింత పకడ్బందీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలన్నది ఆయన కుతంత్రం. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గత ఎన్నికల్లో పాల్పడిన అక్రమాలు ఇటీవల డీఆర్‌ఐ సోదాల్లో వెలుగులోకి వచ్చాయి.

మండలాలు, పంచాయతీలవారీగా ఓటర్లకు పంపిణీ చేయాల్సిన విధానం, ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించడం, అందుకోసం నిధుల వ్యయం, ఓట్ల కొనుగోలు, దొంగ ఓట్ల పర్యవేక్షణకు వివిధ స్థాయిలో బాధ్యుల నియామకం తదితరాలతో ఓ బ్లూప్రింట్‌ను రూపొందించి ఎమ్మెల్యే సాంబశివరావు అమలు చేశారు. తన వ్యాపార సంస్థ నోవా అగ్రిటెక్‌ ఆర్థిక వ్యవహారాల ముసుగులో ఆ కుత్రంతాన్ని అమలు చేశారు.

అదే రీతిలో బ్లూప్రింట్‌ను టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని నియోజకవర్గాలకు పంపి కుట్రను పక్కాగా అమలు చేయాలన్నది చంద్రబాబు పన్నాగం. అందుకోసం మార్గదర్శి చిట్‌ఫండ్స్, నారాయణ విద్యా సంస్థలు, టీడీపీ బడాబాబులకు చెందిన షిప్పింగ్, ఆక్వా, ఇతర కంపెనీలను వాడుకోవాలని కుతంత్రం రచించారు. చంద్రబాబు, లోకేశ్, రామోజీ, నారాయణ, పచ్చ కోటరీలోని ఇతర ముఖ్యులు సర్వం తామై ఈ ఎన్నికల కుతంత్రం పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవడం గమనార్హం.

ఎన్నికల్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడటం, రూ.వేల కోట్లు వెదజల్లడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, అవసరమైతే భయోత్పాతం సృష్టించేందుకు చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పచ్చ ముఠా అక్రమ నోట్ల గిడ్డంగులపై వెంటనే దాడులు నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ క్రియాశీలం కావడం ఒక్కటే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్షని పరిశీలకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement