Illegal quarries
-
కర్ణాటకలో క్వారీల దందా
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అక్రమ క్వారీల జాతర నడుస్తోంది. వివిధ జిల్లాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతున్నారు. అక్రమార్కులు కొండలను కరిగించి సొమ్ము చేసుకుంటున్నారు. క్వారీల్లో పేలుళ్ల కారణంగా పర్యావరణం తీవ్రంగా దెబ్బ తింటోంది. దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పేలుళ్లకు జిలెటిన్‌స్టిక్స్‌ను ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారు. ఒకేసారి అధిక మొత్తంలో కొండలను పిండి చేసేందుకు అధిక పేలుడు సామర్థ్యం ఉన్న జిలిటిన్స్టిక్స్ను వినియోగిస్తున్నారు. శివమొగ్గ జిల్లా హుణసోడు సమీపంలో భారీ పేలుడు సంభవించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ క్వారీలు, నిబంధనలు పాటించకుండా సాగుతున్న జిలెటిన్‌స్టిక్స్ రవాణాపై ప్రజల్లో చర్చ మొదలైంది. ఏయే జిల్లాల్లో.. మండ్య, బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, రామనగర, కొప్పళ, చిక్కబళ్లాపుర, శివమొగ్గ, చామరాజనగర, బీదర్, దక్షిణ కన్నడ తదితర జిల్లాల్లో అక్రమ క్వారీలు భారీగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ, నాగమంగల, కే.ఆర్.పేట తాలూకాలోని ఇలా జిల్లాలోని అనేక చోట్ల అక్రమ రాళ్ల క్వారీల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. పేలుళ్ల వల్ల క్వారీల సమీప గ్రామాల్లోని ఇళ్లు దెబ్బ తింటున్నాయి. తవ్వకాలను నిషేధించాలని పేదలు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. కాగా అక్రమ క్వారీలపై అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తుంటారు. ఐదేళ్ల కాలంలో అక్రమ క్వారీలపై సుమారు 2,450 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులో 1,126 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గనులు, భూగర్భ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదేళ్లలో దాడులు నిర్వహించి అక్రమంగా ఖనిజాన్ని తరలిస్తున్న 7,938 వాహనాలను జప్తు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.9 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారు. క్వారీ నిర్వాహకులకు అటవీ సంరక్షణ చట్టం 1980 2(1), 2(3), అటవీ సంరక్షణ చట్టం 2003 (6), కేంద్ర, పరిసర శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. సుమారు 20 లేదా 30 ఏళ్లకు సరిపడా అనుమతి ఒకేసారి తీసుకోవాల్సి ఉంటుంది. కర్ణాటక వ్యాప్తంగా సుమారు 13 వేల ఎకరాల్లో వేల సంఖ్యలో కాంట్రాక్టు పద్ధతిన క్వారీలు కొనసాగుతున్నాయని అధికారుల ద్వారా తెలిసింది. రాజకీయ నేతల అండ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు క్వారీ నిర్వాహకులే ప్రధాన ఆర్థిక వనరుగా ఉంటారని సమాచారం. ఈ క్రమంలో క్వారీలు నిర్వహించే వారిపై ఎన్ని కేసులు నమోదైనా తప్పిస్తూ ఉంటారని ఆరోపణలున్నాయి. అనుమతి లేకుండా రాతి క్వారీలు నిర్వహిస్తున్నట్లు తేలితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించేందుకు చట్టంలో అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఒకరికి కూడా శిక్ష పడిన దాఖలా లేదు. ఇష్టానుసారంగా జిలెటిన్‌స్టిక్స్ తరలింపు ఇక క్వారీల్లో పేలుడుకు సంబంధించి ఇష్టారాజ్యంగా జిలెటిన్‌స్టిక్స్‌ను సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా తరలిస్తున్నారు. రవాణా సమయంలో భారీ కుదుపులు వచ్చినా, ఎదురుగా ఏదైనా వచ్చి వాహనాన్ని ఢీకొన్నా భారీ పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది. అధికారుల తనిఖీలు సక్రమంగా లేకపోవడంతో అక్రమార్కులు సరైన భద్రతా వ్యవస్థ లేకుండానే జిలెటిన్‌స్టిక్స్ తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి అత్యధిక ప్రమాణాల్లో పేలుడు పదార్థాల నిర్వహణకు అనుమతి లేదు. ఒక చోట నుంచి మరో స్థలానికి పేలుడు పదార్థాల రవాణాకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి. అమ్మోనియం నైట్రేట్, జిలెటిన్ తదితర వస్తువులను ప్రత్యేకంగా నిల్వ ఉంచాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పేలుడు పదార్థాలను మిగతా వాటితో కలపకూడదు. అనుమతులు పొందిన తర్వాతనే క్వారీల్లో బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి జాగ్రత్తలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. సీఎం యడియూరప్పకు అగ్నిపరీక్ష -
వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ నియామకం
సాక్షి, అమరావతి : గురజాల అక్రమ గనుల తవ్వకాలపై వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. కమిటీ కన్వీనర్‌గా కాసు మహేశ్ రెడ్డి, సభ్యులుగా బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మహ్మద్ ఇక్బాల్‌తో పాటు నరసరావు పేట పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
‘నిక్షేపం’గా దోపిడి
మూడు రాష్ట్రాల కూడలి కుప్పంలో క్వారీల పేరుతో అధికారపార్టీ నాయకులు కోట్లకు పడగలెత్తుతున్నారు అధికారులు పట్టించుకోకపోవడంతో ఒకే పర్మిట్‌తో టన్నుల కొద్ది బండరాయిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఖజనాకు భారీగా గండిపడుతోంది. తెలుగుదే శం నేతల అక్రమాలపై సొంత పార్టీ వారే ఫిర్యాదు చేసినా.. సీఎం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతి: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అక్రమ క్వారీలకు అడ్డు, అదుపూ లేకుండా పోతోంది. ఈ ప్రాంతంలో 150 క్వారీలు నడుస్తున్నాయి. ఇందులో 40లోపు క్వారీ లకు వూత్రమే అనువుతులు ఉన్నారుు. అరకొరగా అనువుతులు ఉన్నవి, అసలు లేనివి కూడా పరిమితికి మించిన విస్తీర్ణంలో తవ్వకాలు చేపడుతున్నారుు. ఒకే పర్మిట్‌తో పదుల సంఖ్యలో లారీలు క్వారీ బ్లాకులను షిప్పు యూర్డులకు తరలిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయుం దళారుల ఖాతాలకు చేరుతోంది. కుప్పానికి చెందిన టీడీపీ నాయుకుడు జిల్లాలోని క్వారీల యుజ వూనుల నుంచి గత వుూడు నెలల్లో రూ.100 కోట్లు వసూలు చేసినట్టు సొంత పార్టీ వారే చెప్పుకున్నారు. దీనిపై సీఎం, ఆయన తనయుడికి ఫిర్యాదు చేసినా పట్టించులేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సదరు నాయుకుడికి పార్టీలో ప్రమోషన్ రావటంతో స్థానిక నాయకులు కివ్మునకుండా ఉండిపోయూరు. ఎగుమతులతో ఎదిగి.. జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, పలవునేరు, కుప్పం ప్రాం తాల్లో విలువైన రాతి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా యి. గనుల శాఖ పరిధిలో 1200 వందల క్వారీలున్నాయి. ఇందులో 850 క్వారీల్లో తవ్వకాలు సాగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు ఇక్కడి రాళ్లు ఎగువుతి అవుతున్నారుు. వీటి వ్యాపారంతోనే కోట్లు గడించిన వ్యాపార వేత్తలు, రాజకీయు నాయుకులు జిల్లాలో అనేక వుంది ఉన్నా రు. ఈ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో పొరు గు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వ్యాపారులు ఇక్కడికి వచ్చి కార్యకలాపాలు సాగిస్తున్నారు. నేలను తవ్వి, రారుుని బ్లాకులుగా తీసి ఎగువుతులు చేస్తున్నారు. వీటికితోడు బ్లాకులను పూర్తిస్థారుులో ప్రాసెస్ చేసి ఎగువుతులు చేసే పరిశ్రవులు జిల్లాలో వందకు పైగా ఉన్నారుు. రాళ్లతో డాలర్ల పంట పండుతుండటంతో దీనికి సంబంధించిన అన్ని విషయూల్లో భారీగా నగదు చేతులు వూరుతోంది. రాళ్ల వ్యాపారులు ప్రభుత్వాన్ని, అధికార యుంత్రాంగాన్ని శాసిం చేంతగా ఎదిగారు. అయినా ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కార్మికుల జీవితాలు.. గాల్లో దీపాలు క్వారీల్లో పనిచేసే కార్మికుల బతుకులు గాల్లో దీపాలుగా వూరారుు. కనీస సదుపాయూలు, భద్రతా ప్రవూణాలు పాటించే వారు కరువయ్యా రు. రాతి క్వారీల్లో ప్రవూదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోరుునా, వికలాంగులుగా వూరినా నావువూత్రపు పరిహారంతో క్వారీ నిర్వాహకులు చేతులు దులుపు కొంటున్నారు. స్థానికులను పనిలో పెట్టుకుని ప్రవూదాలు జరిగితే ఇబ్బందు లు ఉంటాయున్న కారణంతో తమిళనాడు, చత్తీస్ఘడ్, బిహార్, ఒడిశాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. వారిలో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయూలు కూడా లేకపోవటంతో సహచరులు విగత జీవుతైనా, వికలాంగులైనా మిగతా వారు పట్టించుకోవడం లేదు. కార్మికులకు ఎలాంటి బీవూ, ఈఎస్ఐ సదుపాయూలు లేవు. ఇదిగో సాక్ష్యం.. శాంతిపురం వుండలంలోని కోనేరుకుప్పం వద్ద ఉన్న ఓ క్వారీలో మేలో జరిగిన ప్రవూదంలో ఒడిశాలోని బరంపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వుతి చెందాడు. వుళ్లీ ఇదే క్వారీలో ఈ నెల 24న తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృత్యువాత పడగా, అదే రాష్ట్రంలోని విల్లుపురాని కి చెందిన వురొకరు తీవ్ర గాయూలతో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారు లు, పోలీసులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులైనా స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.