illegal relation
-
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని స్నేహితుడినే..
శివమొగ్గ: సొరబకు చెందిన లేఖప్ప (28) అనే వ్యక్తిని కృష్ణప్ప (30) హత్య చేశాడు. మన్మనే గ్రామానికి చెందిన లేఖప్ప సొరబకు వచ్చి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లేఖప్ప ఫోన్ కాల్స్ ఆధారంగా అతని స్నేహితుడు అయిన కృష్ణప్పను అదుపులోకి తీసుకొని విచారించగా తానే చంపినట్లు చెప్పాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పట్టణానికి పిలిపించి హత్య చేసి శవాన్ని పొలాల్లో పడేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా, శివమొగ్గ దగ్గర గురుపురలో గౌడప్ప (35) అనే ప్రైవేటు ఉద్యోగి బైక్‌పై వెళ్తుండగా గూడ్స్ వ్యాన్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందాడు. వరకట్న వేధింపులు, మరో అబల బలి మైసూరు: వరకట్న వేధింపులకు మరో అబల బలైన సంఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హిమ్మావు గ్రామంలో చోటు చేçసుకుంది. గ్రామానికి చెందిన ఉమేష్, బేబి (29)కి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అప్పుడప్పుడు దంపతుల మధ్య కట్నం విషయంగా గొడవలు జరిగేవి. ఇదిలా ఉంటే మంగళవారం తెల్లవారుజామున బేబి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డబ్బు కోసం వేధించడం వల్లనే బేబి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త అలా చేస్తున్నాడని వందన..) -
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..
చెన్నై: మద్రాస్ హైకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఆడ, మగ ఇద్దరు తాళం వేసిన ఇల్లు, గదిలో ఉన్నంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేమని స్పష్టం చేసింది. ఓ సాయుధ రిజర్వ్ పోలీసు కానిస్టేబుల్ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది. 1998లో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. కే శరవణ బాబు అనే సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ తన క్వార్టర్లో మరో మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఉండటాన్ని అధికారులు తప్పు పట్టారు. వారి మధ్య అక్రమ సంబంధం ఉందని.. అందుకే తలుపులు వేసుకుని ఇద్దరు లోపల ఉన్నారని ఆరోపించారు. ఇక ఇలాంటి చర్యలకు పాల్పడినందకు గాను అతడిని విధుల నుంచి తొలగించారు. దాంతో శరవణ బాబు కోర్టును ఆశ్రయించాడు. ఇక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఆర్ సురేష్ కుమార్ రద్దు పిటిషన్‌ని విరమించుకుంటూ.. ‘‘సమాజంలోని ఊహాతీత కథనాలను ఆధారంగా చేసుకుని క్రమశిక్షణా చర్యలు విధించడం.. విధుల నుంచి తొలగించడం సరైనది కాదు. ఇక ఈ కేసులో నిందితుడు శరవణ బాబు తన నివాసంలో ఓ మహిళా కానిస్టేబుల్‌తో ఉన్నాడు. అంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేమని’’ వెల్లడించింది. అంతేకాక నిందితుడి వాదనతో ఏకీభవించిన హై కోర్టు ఇద్దరు కానిస్టేబుల్స్‌ని అభ్యంతరకర స్థితిలో చూసినట్లు ఒక్క ప్రతక్ష్య సాక్షి గాని.. మరే ఇతర ఆధారాలు గాని లేవని స్పష్టం చేసింది. (చదవండి: మద్రాస్ హైకోర్టు కమిటీ చారిత్రక నిర్ణయం) ఈ సందర్భంగా శరవణ బాబు మాట్లాడుతూ.. ‘‘సదరు మహిళా కానిస్టేబుల్ నివాసం.. నా క్వార్టర్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఇక ఆమె ఇంటి తాళం కోసం నా నివాసానికి వచ్చింది. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా.. ఎవరో తలుపు లాక్ చేశారు. ఆ తర్వాత మేం డోర్లు వేసుకుని ఇంట్లో ఏదో అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు భావించిన ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపు తట్టారు’’ అని తెలిపాడు. -
నీ భర్తను చంపి నిన్ను నా దానిని చేసుకుంటా..
వేటపాలెం: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ యువకుడిపై ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన దేశాయిపేట హరిజనవాడ సమీపంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ వెంకటకృష్ణయ్య కథనం ప్రకారం.. దేశాయిపేట ఐటీఐ కాలనీకి చెందిన ఎర్రా నరేంద్రబాబు కొన్ని చేనేత మగ్గాలు నేయిస్తుంటాడు. అదేక్రమంలో నీలకంఠపురానికి చెందిన గుత్తి అశోక్‌రాజుకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టి మగ్గం పని చేయిస్తున్నాడు. ఈ క్రమంలో తరుచూ అశోక్ ఇంటికి నరేంద్ర వస్తుండేవాడు. ఇలా వస్తుండటంతో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నరేంద్రపై అశోక్‌రాజు అనుమానం పెంచుకున్నాడు. దేశాయిపేట హరిజనవాడ సమీపంలో కాపుకాచి మోటార్ సైకిల్‌పై వస్తున్న నరేంద్రను చంపాలనే ఉద్దేశంతో ఇష్టారీతిన అశోక్‌రాజు దాడి చేశాడు. కాలికి బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రుడు నరేంద్రను చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు. వైద్యశాలలో చీరాల రూరల్ పోలీసులు క్షతగాత్రుడి నుంచి వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా గుత్తి అశోక్‌రాజు భార్య ప్రసన్నలక్ష్మి కూడా పోలీసులకు కౌంటర్ ఫిర్యాదు చేసింది. తనకు నరేంద్ర మగ్గం పనులు ఇస్తూ లొంగదీసుకుని ఆరు నెలలుగా శారీరకంగా వాడుకున్నాడని, నీ భర్తను చంపి నిన్ను నా దానిని చేసుకుంటానని బెదిరించాడని, చెప్పినట్లు వినకుంటే నలుగురికి చెప్పి పరువు తీస్తానని బెదిరించాడని, ఈ విషయం తన భర్తకు తెలిసి నెల క్రితం అతడిని మందలించాడని, పది రోజుల క్రితం ఇంటికి వచ్చి బలవంతం చేయబోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌంటర్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవమానభారంతో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ సిటీ: కట్టుకున్న భార్యకు అన్యాయం చేశాడు. తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన భార్య భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవమానభారంతో తాను చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందని భయపడి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కుషాయిగూడ, గణేష్‌నగర్ కాలనీలో వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగించే రాజేష్(30)కు రాజమణితో వివాహం జరిగింది. అయినా రాజేష్ ఓమహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య రాజమణి, భర్తను నిలదీసింది. బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త తీరుపై ఫిర్యాదు చేసింది. దీంతో పరువు పోతుందని భావించిన రాజేష్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతన్ని తీసుకువచ్చేందుకు ఇంటికి వెళ్లగా సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సంఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలను సేకరించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కాపురానికి రానందుకు చంపేశాడు
న్యూఢిల్లీ: వేరొక వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్యను భర్తను అతి కిరాతకంగా చంపాడు. వివరాల్లోకి వెళ్తే ఉత్తర్ ప్రదేశ్‌లోని అమోరాకు చెందిన చిరాగుద్దీనతో సహానాకు 9 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. చిరాగుద్దీన్ ఆటో డ్రైవర్ కావడంతో ఇంటికి అప్పుడప్పుడే మాత్రమే వచ్చే వాడు. దీంతో భార్య సహానా కాపురాన్ని ఢిల్లీకి మారుద్దామని భర్తకు చెప్పింది. దీనికి చిరాగుద్దీన్ ఒప్పుకోక పోవడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో సహానా భర్తతో కొన్నాళ్ల నుంచి విడిగా ఉంటోంది. నసీర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఏడాది క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలతో కలిసి ఢిల్లీలో మకాం పెట్టారు. పలుమార్లు మొదటి భర్త చిరాగుద్దీన్, సహానాని ఇంటికి రమ్మని బ్రతిమిలాడాడు. తిరస్కరించడంతో పథకం ప్రకారం మాట్లాడుకుందాం రమ్మని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నల్లగొండ జిల్లాలో దారుణ హత్య
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన తగిడిమర్రి శ్రీహరి(30) స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కొట్టి చంపి, గ్రామ శివారులోని పొలాల్లో పడేసి వెళ్లారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన వారు చూసి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు దారి తీసి ఉండవచ్చని పోలీసలు అనుమానిస్తున్నారు. -
వివాహేతర సంబంధంతో ఇద్దరి హత్య
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం మండల పరిధిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక బీసీ సంఘం అధ్యక్షుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణ స్వామితో పాటు ఓ ప్రైవేటు పాఠశాల టీచర్ కల్పనను దుండగులు దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా, మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ రాజగోపాలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం... హిందూపురం సమీపంలోని బెవనహళ్లి వద్ద నారాయణ స్వామి ఓ హౌసింగ్ వెంచర్ వేశారు. తన ఇన్నోవా వాహనంలో కల్పనతో కలసి నారాయణ స్వామి ఆదివారం వెంచర్ వద్దకు వెళ్లారు. దుండగులు అక్కడే వారిద్దరిని బండరాళ్లతో కొట్టి కత్తులతో నరికి చంపారు. అనంతరం నారాయణస్వామి వాహనంలో పరారయ్యారు. మంగళవారం వెంచర్ వద్ద మృతదేహాలను ఓ గొర్రెల కాపరి చూసి పోలీసులకు సమాచారం అందించగా విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలు బాగా దెబ్బతిన్న స్థితిలో ఉన్నాయి. వాటిని పోస్ట్‌మార్టం కోసం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే వీరిద్దరి హత్య జరిగి ఉంటుందని సీఐ తెలిపారు. -
వివాహేతర సంబంధమే అని తేల్చిన సీఐ
విశాఖపట్నం: మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారం సర్పంచ్ షేక్ బీబీ భర్త భీమేష్ హత్య కేసును చోడవం సీఐ కిరణ్ కుమార్ చేధించారు. హత్యకు కారణం వివాహేతర సంబంధమేనని సీఐ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున భీమేష్ భార్య బీబీ గెలుపొందారు. వృత్తి రీత్యా మాంసం వ్యాపారి అయిన భీమేష్ వివాదాలకు దూరంగా ఉంటూ పార్టీలో చురుకైన పాత్ర పోషించే వారు. అతనికి చాలా కాలంగా గ్రామంలోని ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంబంధం కారణంగానే అతనిని హత్య చేసి మృతదేహాన్ని పెద్దేరు కాలువ వద్ద పడవేసినట్లు చెబుతున్నారు. -
మీడియాకు దొరికిన ప్రిన్సిపాల్, మహిళా అటెండర్!
వరంగల్: ఓ కాలేజీ ప్రిన్సిపాల్ మహిళా అటెండర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మీడియాకు దొరికిపోయాడు. ఏటూరునాగారం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్, కాలేజీలో పనిచేసే మహిళా అటెండర్‌తో గురువారం రాత్రి 9 గంటలకు ఏకాంతంగా ఉండగా విద్యార్థులు చూశారు. రెండ్హ్యాండ్ గా పట్టుకుని, ఇలా చేయడం వృత్తికే మచ్చ అని మందలించారు. మీడియాకు కబురందించారు. దాంతో అయ్యగారి బండారం బయటపడింది. విద్యార్థుల రాకను పసిగట్టిన ప్రిన్సిపాల్ పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. తీరా విద్యార్థులు నిలదీసేసరికి తాను భోజనం చేయడానికి వచ్చానని బుకాయించాడు. ఓ కేసు విషయంలో సాయం చేయడానికి వచ్చానే తప్ప ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పాడు. **