కాపురానికి రానందుకు చంపేశాడు | husband killed his wife | Sakshi
Sakshi News home page

కాపురానికి రానందుకు చంపేశాడు

Published Sun, Apr 2 2017 7:39 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

కాపురానికి రానందుకు చంపేశాడు

కాపురానికి రానందుకు చంపేశాడు

న్యూఢిల్లీ: వేరొక వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్యను భర్తను అతి కిరాతకంగా చంపాడు. వివరాల్లోకి వెళ్తే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమోరాకు చెందిన చిరాగుద్దీనతో సహానాకు 9 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. చిరాగుద్దీన్‌ ఆటో డ్రైవర్ కావడంతో ఇంటికి అప్పుడప్పుడే మాత్రమే వచ్చే వాడు. దీంతో భార్య సహానా కాపురాన్ని ఢిల్లీకి మారుద్దామని భర్తకు చెప్పింది. దీనికి చిరాగుద్దీన్‌ ఒప్పుకోక పోవడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.

దీంతో సహానా భర్తతో కొన్నాళ్ల  నుంచి విడిగా ఉంటోంది. నసీర్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.  ఏడాది క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలతో కలిసి ఢిల్లీలో మకాం పెట్టారు. పలుమార్లు మొదటి భర్త చిరాగుద్దీన్‌, సహానాని ఇంటికి రమ్మని బ్రతిమిలాడాడు. తిరస్కరించడంతో పథకం ప్రకారం మాట్లాడుకుందాం రమ్మని  నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement