iMac Pro
-
యాపిల్ లోపం... విద్యార్థి ఇంట కాసుల వర్షం!
కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న, చిన్న తప్పుల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ సూత్రం మనకే కాదు దిగ్గజ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. దిగ్గజ కంపెనీలకు చెందిన సాంకేతికతలో ఉన్న చిన్న లోపం వల్ల కూడా కొన్నిసార్లు వేల కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. అయితే, ఇలాంటి చిన్న తప్పులను గుర్తించి సరిదిద్దుకుంటే ఏమి పర్వాలేదు. టెక్ దిగ్గజ యాపిల్ కంపెనీ ఇప్పుడు అదే పని చేసింది. ర్యాన్ పిక్రెన్ అనే సైబర్ సెక్యూరిటీ విద్యార్థికి బిగ్ బౌంటీ కింద 100,500 డాలర్లు(సుమారు రూ.75 లక్షలు) ఇచ్చింది. మ్యాక్ వెబ్‌క్యామ్‌లను హ్యాకర్లు హ్యాక్ చేసే విధంగా ఉన్న ఒక లోపాన్ని గుర్తించినందుకు యాపిల్ ఆ డబ్బులను ఇచ్చింది. ఐక్లౌడ్ షేరింగ్, సఫారీ 15తో సహ ఇతర బ్రౌజర్లలో వరుసగా బయటపడుతున్న లోపాల వల్ల హ్యాకర్లు వెబ్‌క్యామ్‌లను హ్యాక్ చేయవచ్చు అని ర్యాన్ పిక్రెన్ ఒక బ్లాగ్ పోస్టులో తెలిపారు. గత ఏడాది యాపిల్ ఈ లోపాలను పరిష్కరించినట్లు వైర్డ్ మీడియా తెలిపింది. "ఈ లోపం వల్ల భాదితులు ఓపెన్ చేసిన పోర్టల్ వివరాలు అన్నీ హ్యాకర్ చేతికి వెళ్తాయి. కొన్నిసార్లు, మన వెబ్‌క్యామ్ కూడా రికార్డు చేయడం ప్రారంభిస్తుంది. నేను కనిపెట్టిన బగ్ మీ ఐక్లౌడ్, పే పాల్, ఫేస్ బుక్, జీమెయిల్ మొదలైన ఖాతాలను కూడా హ్యాక్ చేయగలదు" అని ఆయన ఆ పోస్టులో రాశారు. సాధారణంగా కొన్నిసార్లు మనం డజన్ల కొద్దీ బ్రౌజర్ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు అకస్మాత్తుగా అనేక యాదృచ్ఛిక ప్రకటనల రావడం మనం గమనిస్తుంటాం. అయితే, ఇది కూడా హ్యాకింగ్‌లో ఒక టెక్నిక్. గత సంవత్సరం చివరలో బయటపడిన మాక్ ఓఎస్ లోపం మీ సఫారీ ట్యాబ్, ఇతర బ్రౌజర్ సెట్టింగ్ వివరాలను దోపిడి చేసి ఉండవచ్చు అని పిక్రెన్ పేర్కొన్నారు. ఈ లోపం వల్ల హ్యాకర్లు మీ ఆన్లైన్ ఖాతాలపై నియంత్రణ పొందడమే కాకుండా, మీ మైక్రోఫోన్ ఆన్ చేయడం లేదా మీ వెబ్‌క్యామ్ హ్యాక్ చేసి ఉండవచ్చు అని అన్నారు. అందుకే, ముఖ్యమైన వివరాలను,పాస్‌వర్డ్‌లను ఎన్నడూ కూడా బ్రౌజర్లలో సేవ్ చేయకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడైన నగదు లావాదేవీలు చేసేటప్పుడు వర్చువల్ కీ బోర్డ్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. (చదవండి: తిక్క కుదిరిందా ఎలన్ మస్క్? అదిరిపోయే పంచ్!) -
ఆపిల్ మోస్ట్ పవర్ ఫుల్ మ్యాక్ ఇదే!
ఊహించిన మాదిరిగానే ఆపిల్ తన డబ్ల్యూడబ్ల్యూడీసీ 2017 సమావేశంలో ఐమ్యాక్, మ్యాక్ బుక్, మ్యాక్ బుక్ ప్రొ, మ్యాక్ బుక్ ఎయిర్ లైనప్ డివైజ్ లను అప్ డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు తన కొత్త ఐమ్యాక్ ప్రొను టీజ్ చేసింది. ఇప్పటివరకున్న మ్యాక్ లో అత్యంత శక్తివంతమైన మ్యాక్ గా దీన్ని అభివర్ణించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. 8-కోర్ జియోన్ ప్రాసెసర్, 10-కోర్ ప్రాసెసర్, 18-కోర్ ప్రాసెసర్ లతో దీన్ని రవాణాచేస్తామని పేర్కొంది. మ్యాక్‌ఓస్ హై సియర్రా, లేటెస్ట్ మ్యాక్ ఓస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కూడా ఇది సపోర్ట్ చేసే సామర్థ్యం కలిగిఉందని తెలిపింది. దీని ధర 4,999 డాలర్లుగా ఉండబోతుంది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం దీని ధర 3లక్షలకు పైమాటే.వీటితో పాటు అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్ లకు పోటీగా కొత్త స్మార్ట్ హోమ్ స్పీకర్ ను ఆపిల్ ఆవిష్కరించింది. ఆపిల్ హోమ్ పాడ్ స్పీకర్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. నేటితరానికి చెందిన ఐమ్యాక్ మోడల్స్ కూడా 1,099 డాలర్ల(రూ.70,715) నుంచి ప్రారంభమవుతాయని ఆపిల్ హార్డ్ వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టర్నస్ చెప్పారు. 21.5 అంగుళాల మ్యాక్ రెటీనా 1,099 డాలర్లని(రూ.70,715), 27 అంగుళాల ఐమ్యాక్ రెటీనా 1,799 డాలర్లు( రూ.1,15,752)గా ఉండనున్నట్టు పేర్కొన్నారు.