ఆపిల్ మోస్ట్ పవర్ ఫుల్ మ్యాక్ ఇదే!
ఆపిల్ మోస్ట్ పవర్ ఫుల్ మ్యాక్ ఇదే!
Published Tue, Jun 6 2017 12:38 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
ఊహించిన మాదిరిగానే ఆపిల్ తన డబ్ల్యూడబ్ల్యూడీసీ 2017 సమావేశంలో ఐమ్యాక్, మ్యాక్ బుక్, మ్యాక్ బుక్ ప్రొ, మ్యాక్ బుక్ ఎయిర్ లైనప్ డివైజ్ లను అప్ డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు తన కొత్త ఐమ్యాక్ ప్రొను టీజ్ చేసింది. ఇప్పటివరకున్న మ్యాక్ లో అత్యంత శక్తివంతమైన మ్యాక్ గా దీన్ని అభివర్ణించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. 8-కోర్ జియోన్ ప్రాసెసర్, 10-కోర్ ప్రాసెసర్, 18-కోర్ ప్రాసెసర్ లతో దీన్ని రవాణాచేస్తామని పేర్కొంది. మ్యాక్ఓస్ హై సియర్రా, లేటెస్ట్ మ్యాక్ ఓస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కూడా ఇది సపోర్ట్ చేసే సామర్థ్యం కలిగిఉందని తెలిపింది.
దీని ధర 4,999 డాలర్లుగా ఉండబోతుంది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం దీని ధర 3లక్షలకు పైమాటే.వీటితో పాటు అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్ లకు పోటీగా కొత్త స్మార్ట్ హోమ్ స్పీకర్ ను ఆపిల్ ఆవిష్కరించింది. ఆపిల్ హోమ్ పాడ్ స్పీకర్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. నేటితరానికి చెందిన ఐమ్యాక్ మోడల్స్ కూడా 1,099 డాలర్ల(రూ.70,715) నుంచి ప్రారంభమవుతాయని ఆపిల్ హార్డ్ వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టర్నస్ చెప్పారు. 21.5 అంగుళాల మ్యాక్ రెటీనా 1,099 డాలర్లని(రూ.70,715), 27 అంగుళాల ఐమ్యాక్ రెటీనా 1,799 డాలర్లు( రూ.1,15,752)గా ఉండనున్నట్టు పేర్కొన్నారు.
Advertisement
Advertisement