Impurities
-
నిష్కల్మషం నిరంతర ప్రక్రియ
బతికి ఉన్నంత కాలం అన్నం తినటం ఎంత అవసరమో శుచిగా ఉండటం అంతే అవసరం. శుచిగా ఉండటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్కసారి ఆపితే మకిలి పేరుకు పోతుంది. తరువాత యథాస్థితికి తేవటానికి సమయం చాలా అవసర మౌతుంది. రాగిచెంబుని ఎంత తోమితే అంత మెరుస్తుంది అని ఒక నానుడి. రాగిచెంబే కాదు జీవితమైనా అంతే. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ఇల్లయినా, ఒళ్లయినా, సమాజమైనా, దేశమైనా, మరేదైనా సరే! భౌతికమైన అంటే పరిసరాల, శారీరక శౌచం మాత్రమే కాదు మనసుని కూడా శుభ్రం చేస్తూ ఉండాలి. జీవప్రక్రియ జరుగుతున్నప్పుడు వ్యర్థాలు వెలువడటం సహజం. వాటిని ఎప్పటి కప్పుడు తొలగించక పోతే చెత్త పేరుకుపోతుంది. ఆరోగ్యం పాడవటం జరుగుతుంది. మనసు కూడా బాగా పని చేసినప్పుడు మథనంలో కావలసిన ఆలోచనలతో పాటు అక్కర లేనివి కూడా వస్తాయి. వాటిని పరిహరించక పోతే బుర్ర చెడి పోతుంది. ఒక్కక్షణం ఏమరుపాటు కలిగినా జరగవలసిన హాని జరిగిపోతుంది. మనకి మిత్రులలాగా కనపడుతూ కీడు చేసే శత్రువులు అవకాశం కోసం ఎదురు చూస్తూ తొంగిచూస్తూ ఉంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనసులో తిష్ఠవేసుకుని కూర్చుంటారు. ఆ శత్రువుల విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎంతో కాలంగా సాధన చేశాను, ఇంకెంత కాలం నియమ నిష్ఠలతో సాధన చెయ్యాలి? ఇంక చాలు – అంటూ ఉంటారు కొంతమంది. పుట్టినప్పటి నుండి గాలి పీలుస్తూనే ఉన్నాం కదా, ఇక గాలి పీల్చటం మానేద్దాం అని ఎవరైనా అనుకుంటారా? ఆఖరిక్షణం వరకు వీలైనంతగా కొనసాగించ వలసిందే. ఒక్కక్షణం ఆపితే ..? ఇంకేముంది? ఆ తరువాత గాలి పీల్చవలసిన పని ఉండదు. ఎందుకంటే గాలి పీల్చటం ఊపిరితిత్తుల ద్వారా రక్తాన్ని శుభ్రం చేయటమే. అందుకే అన్ని సంప్రదాయాల్లోను శౌచం అనే దానికి చాలా ్రపాధాన్యం ఉంది. అది పరిసరాలతో ్రపారంభమై శరీరం, మనస్సు, ఆత్మల వరకు విస్తరిస్తుంది. దీనిని సూచించటానికే జీసస్ పాత్రలు శుభ్రం చేస్తున్న చిత్రం ఒకటి కనపడుతుంది. అదేవిధంగా షిరిడీ సాయి బాబా కూడా పాత్రలు శుభ్రం చేస్తున్న చిత్రం ఉంటుంది. వాళ్ళకి ఎంగిలిపళ్ళాలు కడగవలసిన అవసరం ఏమిటి? అనే సందేహం ఎవరికైనా ఎప్పుడయినా వచ్చిందా?వాళ్ళు కడుగుతున్నది తమ శిష్యులు, లేక భక్తులు, లేక అనుయాయుల మనస్సులని కప్పిన పాపాలనే మలినాలని. పాపరహితులైన వారే నిరంతరం శుభ్రం చేయటానికి ్రపాధాన్యం ఇస్తూ ఉంటే సామాన్యుల మైన మనవంటి వార మెంత?పుట్టినప్పుడున్నంత నిష్కల్మషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒక్కరోజు నిర్లక్ష్యం చేస్తే అప్పటి వరకు చేసినదంతా తుడిచి పెట్టుకు పోతుంది. రోజూ తుడుస్తున్న అద్దాన్ని ఒక్కసారి తుడవకపోతే దుమ్ము΄÷ర ఉండి దానిలో ప్రతిబింబం సరిగ్గా కనపడదు. ఇది అందరికి ప్రత్యక్ష ప్రమాణం. అదే మనస్సనే అద్దం మీద కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే మలినాలు ఉంటే దానిలో పరమాత్మ రూపం సరిగ్గా ప్రతిఫలిస్తుందా? ఎన్నో మార్పులతో కనిపిస్తుంది. అందుకే సాధకులకి ఒక్కొక్కరికి దైవం ఒక్కొక్క విధంగా ఉన్నట్టు తోస్తుంది. వీటికితోడు అహంకార మమకారాలు ఆడే నాటకాలు కూడా తక్కువేమీ కావు. ఈ ΄÷రలు కప్పి ఉండటం వల్లనే ఎన్నో వికల్పాలు కలుగుతూ ఉంటాయి. కనుకనే వీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. లేకపోతే అదే సహజమైన రూపం అని భ్రమపడే ప్రమాదం ఉంది. ఈ భ్రమప్రమాదాల కారణంగా సాధన పెడత్రోవ పట్టే అవకాశం ఉంది. – డా.ఎన్. అనంత లక్ష్మి -
క్యాన్ వాటర్ తాగుతున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!
ఈ చిత్రంలోని వాటర్‌ప్లాంట్ గోదావరిఖని పట్టణంలోనిది. అపరిశుభ్రంగా ఉన్న ఈ ప్లాంట్‌లో నిబంధనలు పాటించడం లేదు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 2021లో అధికారులు మొత్తం 19 వాటర్ ప్లాంట్లు ఉన్నాయని గుర్తించినట్లు వెల్లడిస్తున్నారు. కానీ లెక్కలకు మించి 50కు పైగానే పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇలా జిల్లా మొత్తంగా 67 అనధికార వాటర్ ప్లాంట్లు గుర్తించగా.. బీఎస్ఐ ప్రమాణాలతో ఒక్కప్లాంట్ నిర్వహించడం లేదు. సాక్షి, పెద్దపల్లి: ‘మినరల్... ఫ్యూరీఫైడ్.. ఫ్రెష్.’ డ్రింకింగ్‌వాటర్‌కు ప్లాంట్ల నిర్వాహకులు పెట్టిన పేర్లు ఇవీ. వినడానికి బాగున్నా... రుచి చూస్తే మాత్రం పచ్చి అబద్ధం. శుద్ధిచేసిన తాగునీరు పేరుతో కొందరు జిల్లాలో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. గుక్కెడు మంచినీళ్లు గరళంగా మారుతున్నాయి. గొంతు తడుపుకునేందుకు ఒక్కో కుటుంబం నెలకు రూ.వందల్లో వెచ్చించాల్సి వస్తోంది. విచ్చలవిడిగా వెలుస్తున్న నీటిశుద్ధి కేంద్రాల(ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు)పై అధికారుల నిఘా కరువైంది. బీఎస్ఐ స్టాండర్డ్ గుర్తింపు లేకుండానే ప్లాంట్ల నిర్వాహకులు వ్యాపారం చేస్తున్నారు. అపరిశుభ్రమైన నీళ్లలో కెమి కల్స్ కలిపి జనాల గొంతులో విషం పోస్తున్నారు. ఇదీ తయారీ పద్ధతి ముందుగా బోరులోని నీటిని ట్యాంక్‌లోకి నింపి క్లోరినేషన్ చెయ్యాలి. తర్వాత శాండ్ ఫిల్టర్‌లో శుభ్రం చేయాలి. కార్బన్ ఫిల్టర్స్, మైక్రాన్ ఫిల్టర్స్‌లో శుభ్రం చేసి రివర్స్ ఆస్మాసిస్ చెయ్యాలి. మినరల్స్‌ను జతచేసి ఓజోనైజేషన్ జరపాలి. ఆల్ట్రావైయోలెట్ రేడియేషన్ ద్వారా శుద్ధిచేసి నమూనాలు తీయాలి. మైక్రోబయాలజీ, కెమెస్ట్ ప్రయోగశాలలో నమూనాలను పరీక్షించాలి. ఆ తర్వాత క్యాన్లలోకి, బాటిళ్లలోకి తీసుకోవాలి. గతంలోని మోసాలివీ.. గతంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు, రామగుండం నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగం అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అనేక వాటర్ ప్లాంట్లలో మోసాలు బహిర్గతం అయ్యాయి. చాలా వరకు ప్లాంట్లను సీజ్ చేశారు. నీళ్లు నిల్వచేసే ట్యాంకులు పాకురుపట్టి ఉండడం, పైపులు, శుద్ధి చేసే యంత్రాలు దుమ్ము, దూళితో నిండిపోయి పారిశుధ్యం అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. తనిఖీలు నిర్వహిస్తాం అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నా వాటర్ ప్లాంట్స్‌లో త్వరలో తనిఖీలు నిర్వహిస్తాం. అటువంటి వాటిపై కేసులు నమోదు చేస్తాం. – అనూష, ఇన్చార్జి ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ నిబంధనలకు ‘నీళ్లు’ ►వాటర్ప్లాంట్లలో ఎయిర్ కండీషనర్లతోపాటు కెమికల్ ల్యాబ్, మైక్రోబయాలజీ ల్యాబ్, వాటర్ ఫిల్లింగ్ గది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బీఎస్ఐ) నిబంధనలకు అనుగుణంగా ప్లాంట్ పూర్తిగా స్టేయిన్‌లెస్ స్టీల్‌తో ఉండాలి. ►సంబంధిత అధికారులు ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆయా ప్లాంట్లలో తనిఖీలు చేసి నమూనాలను సేకరించి, పలు రకాల పరీక్షలు నిర్వహించాలి. సంతృప్తికరంగా ఉంటే లైసెన్స్‌లు ఇవ్వడం, అంతకు ముందు ఇచ్చి ఉంటే వాటికి రెన్యూవల్ చేస్తారు. ►ప్లాంట్ నిర్వహణతోపాటు బాటిళ్లు, ప్యాకెట్లకు కూడా ప్రత్యేంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ప్యాకెట్లు, 20 లీటర్ల క్యాన్లపై కంపెనీల పేర్లు, ఫోన్ నంబర్లు, తయారు తేదీలు ముద్రించని సంస్థలు, అపరిశుద్ధమైన నీళ్లను అమ్ముతున్నారు. ► వాటర్ప్లాంట్లు అందించే నీటిలో కోలీఫామ్స్, ఫ్లోరైడ్, బ్యాక్టీరియా, సుడోమోనాస్, ఫంగే తదితరాలు ఉంటాయని ఆరోపణలు వస్తున్నాయి. ►వీటి ద్వారా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కొందరు నిర్వాహకులు అనధికార బోర్లు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
అందుకే నా కుమారులతో కలిసి అశ్లీల వీడియోలు చూస్తా..!
జకార్తా: సాధారణంగా తల్లిదండ్రులందరు తమ పిల్లల కోసం పరితపిస్తుంటారు. తమ వారు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. ఈ క్రమంలో పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ.. వారికి కావాల్సింది కొనిస్తారు. అయితే, కొంత మంది పిల్లలు ఆన్లైన్ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఆశ్లీల వీడియోలు చూస్తున్న సంఘటనలు తరచుగా వార్తల్లో చదువుతూనే ఉంటాం. కొంత మంది పిల్లలు పాశ్చాత్య పోకడలకు పోయి.. ప్రతి చిన్న విషయాలకు అబద్ధాలు చెబుతూ.. కన్న వారిని సైతం, మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. అయితే, ఈ తల్లి అందరిలా కాకుండా.. కాస్త వెరైటీగా ఆలోచించింది. ‘పిల్లలకు ఏది వద్దంటే.. అదే చేస్తారు’. కాబట్టి వారికి దాంట్లో మంచి..చెడులను చెప్పాలనుకుంది. అందుకే తన పిల్లలతో కలిసి పోర్న్ వీడియోలు చూస్తూ వారికి లైంగిక జీవితం పట్ల అవగాహన కల్పించింది. దీంతో ఈమె వార్తలలో నిలిచింది. వివరాలు.. ఇండోనేషియాకు చెందిన ప్రముఖ పాప్ స్టార్ యుని శరాకు ఇద్దరు కొడుకులు. ఈ మధ్య ఆమె ఒక యూట్యూబ్ ఇంటర్య్వూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. 47 ఏళ్ల వయసున్న యూనీ, తన ఇద్దరు కొడుకులు.. కెవిన్ సియాహన్, సెల్లో నియాహన్లతో కలిసి పోర్న్ వీడియోలు చూస్తానని బాంబ్ పేల్చింది. ప్రస్తుత స్మార్ట్ యుగంలో పిల్లలను చెడు వ్యవసనాల బారిన పడకుండా చూడటం దాదాపు అసాధ్యం. ఒకవేళ మనం వారిని దీనిపై కట్టడి చేస్తే.. మనకు తెలియకుండా ఎలాగైనా దొంగ చాటున చూసేస్తారు. అందుకే వారికి లైంగిక జీవితం పట్ల అవగాహన కల్పిస్తున్నానని యూనీ తెలిపింది. తన పిల్లలు శృంగారాన్ని ఓ బూతూలా కాకుండా.. ఓపేన్ మైండెడ్‌గా ఆలోచించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. కాగా, పిల్లలకు లైంగిక జీవితం పట్ల సరైన అవగాహన కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పింది. అయితే, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నెటిజన్లు.. ‘నీకేమైన బుద్ధుందా.. ఇదేం పైత్యం’ అంటూ.. తిట్టిపోస్తూంటే.. మరికొందరు ‘ఆమె చేస్తుంది సరైన పనే’ అంటూ యూని శరాను సపోర్ట్ చేస్తున్నారు. చదవండి: మనుషుల కంటె ఏనుగులే నయం.. వైరల్ వీడియో.. View this post on Instagram A post shared by WahyuSetyaningBudi✨ (@yunishara36) -
బాడీటాక్స్
స్నానాలే సరిపోవు..శరీరం లోపలికి మురికిని కూడా కడగాలి డీటాక్స్ ఎందుకు..? శరీరంలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన మలినాలను, కాలుష్యాలను, విషపదార్థాలను పూర్తిగా ప్రక్షాళన చేసి, పునరుత్తేజం పొందడానికి డీటాక్స్ చక్కని మార్గం. ఇది సామాన్యులకూ సాధ్యమే. శరీరంలో దీర్ఘకాలంగా పేరుకున్న విషపదార్థాలను పూర్తిగా వెలుపలకు పంపి, జీర్ణవ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు క్రమబద్ధమైన ఆహార పానీయాలు తీసుకోవడంతో పాటు వ్యాయామాలు చేయడం అవసరం. వాటి ప్రభావంతో విసర్జన ప్రక్రియ మెరుగుపడి, శరీరంలోని విషపదార్థాలు వెలుపలకుపోయి, శరీరం విషరహితమవుతుంది. ఎప్పుడు అవసరం? బరువు తగ్గడం ఇబ్బందికరంగా మారినప్పుడు, తరచు జీర్ణసంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు, ముఖంలో జీవకళ తగ్గినప్పుడు డీటాక్స్ చేసుకోవడం మంచిది. డీటాక్స్ ప్రక్రియలో భాగంగా తీసుకునే ప్రత్యేక ఆహార పదార్థాలు, ప్రత్యేకంగా చేసే వ్యాయామాల వల్ల శరీరం పునరుత్తేజితమవుతుంది. అయితే, సమతుల ఆహారం, వ్యాయామాలతో నిమిత్తం లేకుండా డీటాక్స్ ప్రక్రియ సాధ్యం కాదు. డీటాక్స్ ఔషధాల పేరిట మార్కెట్లో దొరుకుతున్న మందుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. శరీరాన్ని శుభ్రపరచే ఆహారం డీటాక్సిఫికేషన్ కోసం ప్రత్యేక ఆహారాన్ని ఎవరికి వారే ఇంటి వద్ద తీసుకోవచ్చు. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో పీచు పదార్థాలు, నీరు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పూర్తిస్థాయిలో డీటాక్స్ కోసం క్రమబద్ధంగా ఉపవాస పద్ధతిని కూడా పాటించవచ్చు. అయితే, ఉపవాస పద్ధతి పాటించే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది. ఉపవాస పద్ధతి పాటించేవారు వారంలో మూడో రోజు, ఆరో రోజు ఉదయం పూట ఘనాహారమేదీ తీసుకోకుండా, గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. సాధారణంగా ఈ పద్ధతిలో రాత్రిపూట భోజనానికి బదులు పండ్లు తీసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండే అరటిపండ్లు, సీతాఫలాలు, మామిడి, సపోటా వంటివి కాకుండా, తక్కువ చక్కెర, ఎక్కువ పీచు పదార్థాలు ఉండే నారింజ, బత్తాయి వంటి పండ్లు తీసుకోవాలి. ఈ పద్ధతిలో పచ్చి కూరగాయలు, హెర్బల్ టీ, గ్రీన్ టీ వంటి పానీయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో పిజ్జాలు, మిర్చిబజ్జీలు వంటి జంక్‌ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. మలినాలను తొలగించే వ్యాయామం డీటాక్స్ విధానంలో జీర్ణవ్యవస్థను శుభ్రపరచే ఆహారంతో పాటు చెమట ద్వారా శరీరంలోని మలినాలను తొలగించే వ్యాయామాలూ అవసరమే. వేగంగా నడక, కార్డియో వ్యాయామాలు, యోగాసనాలు వంటి వ్యాయామాలు స్వేదగ్రంథుల ద్వారా శరీరంలో పేరుకుపోయిన మలినాలను వెలుపలకు పంపేందుకు దోహదపడతాయి. ఇలాంటి వ్యాయామాలు కండరాలకు సత్తువ ఇవ్వడంతో పాటు శరీరాకృతిని చక్కగా తీర్చిదిద్దుతాయి. నీరు కడిగేస్తుంది శరీరంపై పేరుకున్న మలినాలనే కాదు, శరీరం లోపలి మలినాలను కడిగేయడంలోనూ నీరే కీలకం. డీటాక్స్ ప్రక్రియలో ప్రతిరోజూ 60 ఔన్సుల ఊటనీరు (బావి నీరు లేదా నీటిబుగ్గల నుంచి ఊరిన నీరు) తీసుకోవాలి. ఒక్కోసారి పది ఔన్సుల చొప్పున ఆరుసార్లు ఈ నీరు తీసుకోవాలి. ఈ నీటిలో ఒక్కోసారి రెండు ఔన్సుల చొప్పున నిమ్మరసం కలపాలి. రుచికోసం కొద్దిగా మిరియాల పొడి కలుపుకోవచ్చు. డీటాక్స్‌లో భాగంగా కొబ్బరినీరు, తాజా కూరగాయల జ్యూస్‌లు కూడా తీసుకోవచ్చు. ఇలా ఆరు నెలలకు ఒకసారి పూర్తిస్థాయి డీటాక్స్ ప్రక్రియను పాటించవచ్చు. అయితే బరువు తగ్గించుకోవడానికి ‘డీటాక్స్’ అనుసరించే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.ఈ ప్రక్రియలో అన్ని పోషకాలు అందవు కాబట్టి తాత్కాలికంగా కొద్దిగా నీరసం రావచ్చు. కాబట్టి రెండు ‘డీటాక్స్’లకు మధ్య కనీసం పదిహేను రోజుల వ్యవధి ఉండేలా చూడాలి. వీరు దూరంగా ఉండాలి కఠినమైన ఆహార పద్ధతులు, వ్యాయామాలతో కూడిన డీటాక్స్ పద్ధతిని సాధారణ ఆరోగ్యవంతులు మాత్రమే పాటించాలి. గర్భిణులు, చక్కెర వ్యాధితో బాధపడేవారు, గుండెజబ్బులకు, కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న వారు, సత్తువలేని వృద్ధులు, ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు ఈ ప్రక్రియకు దూరంగా ఉండాలి. మనలోకి చేరే కాలుష్యాలు గాలి, నీరు, ఆహారం ద్వారా మన శరీరంలోకి నానా కాలుష్యాలు, విష పదార్థాలు నిరంతరం చేరుతూనే ఉంటాయి. ప్లాస్టిక్ సంచుల వాడకం విరివిగా ఉన్నందున, ప్లాస్టిక్‌లోని బిస్ఫెనల్ అనే విష రసాయనం మనలోకి చేరుతూ ఉంటుంది. పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమైన నీరు తాగునీటిగా సరఫరా అవుతోంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగ మన ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. వాడిపారేసిన ఫ్లోరోసెంట్ బల్బులు, డెంటల్ ఫిల్లింగ్స్ కారణంగా పాదరసం మోతాదుకు మించి వాతావరణంలోకి, తర్వాత మన శరీరంలోకి చేరుతోంది. ఇలాంటి కాలుష్యాల కారణంగా కేన్సర్ సహా పలు ప్రమాదకర వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఒత్తిడి దూరం డీటాక్స్ ప్రక్రియ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఆరోగ్యంలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. ఒళ్లు తేలికబడటమే కాదు, మానసికంగానూ ఒత్తిడి తగ్గుతుంది. క్రమంగా శరీరం పునరుత్తేజం పొందడంతో ఉత్సాహం పెరుగుతుంది. కండరాలకు జవసత్వాలు వచ్చి, వయసు తగ్గిన అనుభూతి కలుగుతుంది. ఆహారంపై శ్రద్ధ డీటాక్స్ ప్రక్రియకు ముందు ఏం తింటున్నామో పట్టించుకోకుండా తినే అలవాటు ఉన్నా, ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఆహారంపై శ్రద్ధ పెరుగుతుంది. ఆహార విహారాల్లో క్రమశిక్షణ అలవడుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ముఖంలో కళాకాంతులు వచ్చి, చర్మం నునుపుదేరుతుంది. వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది. అతి అనర్థదాయకం శరీరంలోని మలినాలను తొలగించుకునేందుకు డీటాక్స్ ఆహార, వ్యాయామ ప్రణాళిక అవసరమే అయినా, త్వర త్వరగా ఈప్రక్రియను పూర్తి చేసుకోవాలనే యావతో అతి జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బందులు తప్పవు. శక్తికి మించిన ఉపవాసాల వల్ల, మోతాదుకు మించి నీరు తాగడం వంటి చర్యలకు పాల్పడితే రక్తపోటు, చక్కెర స్థాయి పడిపోవడం, జీర్ణవ్యవస్థలో సమతుల్యత లోపించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందువల్ల డీటాక్స్ కోసం ఇంటి వద్ద ఎలాంటి ఆహార పద్ధతులు, వ్యాయామ పద్ధతులు పాటించాలనుకున్నా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. వ్యసనాలను వదులుకోవాలి పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల శరీరంలోకి నిరంతరం విషపదార్థాలు చేరుతూనే ఉంటాయి. డీటాక్స్ పద్ధతులు పాటించాలనుకునేవారు తమకు ఇలాంటి అలవాట్లేమైనా ఉంటే, వాటిని వదులుకోవాలి. డీటాక్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా తిరిగి సిగరెట్లు, మద్యం వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. దీర్ఘకాలిక ఫలితాల కోసం డీటాక్స్ ప్రక్రియ ద్వారా ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. అయితే, ఆ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగాలంటే, ఆహార విహారాల్లో నిరంతరం అప్రమత్తత అవసరం. సమతుల పోషకాహారం తీసుకోవడం, వీలైనంత వరకు కాలుష్యాలకు దూరంగా ఉండటం, వ్యాయామ పద్ధతులను మానేయకుండా కొనసాగించడం ద్వారా డీటాక్స్ ఫలితాలను ఎక్కువకాలం ఆస్వాదించవచ్చు.