increase interest rates
-
ఎల్ఐసీ, బజాజ్ హౌసింగ్ సంస్థల రుణ రేట్లు పెంపు
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు తమ గృహ రుణ రేటును 50 బేసిస్ పాయింట్ల (0.50 శాతం) వరకూ పెంచాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే, అరశాతం వడ్డీ పెంపుతో వేతనం, వృత్తి పరమైన వ్యక్తులకు గృహ రుణ రేటు 7.70 శాతంగా ఉండనుంది. ఇక ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రైమ్ లెండింగ్ 7.50 శాతం నుంచి 8 శాతానికి చేరింది. -
ఇక పీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతం
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాదారులకు కేంద్రం శుభవార్త అందించింది. 2018–19 సంవత్సరానికిగాను చేపట్టే చెల్లింపులకు 8.65 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇది ప్రస్తుతం చెల్లిస్తున్న వడ్డీరేటు 8.55 శాతంతో పోలిస్తే 0.10 శాతం ఎక్కువ. ఈ పెంపుతో 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి చేకూరనుంది. త్వరలోనే వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని శుక్రవారం ఢిల్లీలోని ఫిక్కీ కార్యాలయంలో ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల ప్రతినిధులతో సమావేశం అనంతరం కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేట్లు 8.8 శాతం ఉండగా అప్పటి పరిస్థితుల రీత్యా వాటిని క్రమంగా ఐదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి తగ్గించారు. ఈపీఎఫ్ఓ అంచనాల ప్రకారం 2018–19 సంవత్సరానికి వడ్డీరేటును 8.65 శాతం ఉంచితే 151 కోట్ల రూపాయల మిగులు ఉండనుంది. అదే 8.7 శాతానికి పెంచితే 158 కోట్ల ద్రవ్యలోటు ఉండనుంది. దీంతో వడ్డీరేటును 8.65 శాతానికి పెంచడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సమ్మతించింది. -
మద్దతు 35,830.. నిరోధం 36,370
వడ్డీ రేట్ల పెంపునకు అమెరికా ఫెడ్ బ్రేకులు వేయడం, అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల అధ్యక్షులూ త్వరలో సంతకాలు చేయవచ్చన్న వార్తలతో గతవారం పలు ప్రపంచ ప్రధాన మార్కెట్లు నెలల గరిష్టస్థాయిలో ముగిసినప్పటికీ, హఠాత్తుగా ఇండో–పాక్‌ల మధ్య తలెత్తిన ఘర్షణ ఫలితంగా భారత్ సూచీలు పరిమితశ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల వేగాన్ని పెంచడంతో ఇక్కడి భౌగోళిక ఉద్రిక్తతలు మార్కెట్‌పై పెద్దగా ప్రతికూల ప్రభావాన్ని చూపించలేదని భావించవచ్చు. ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమైతే తప్ప, మరో రెండు, మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలే ఇకనుంచి మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు... మార్చి 1తో ముగిసిన వారం ప్రధమార్థంలో గత మార్కెట్ పంచాంగంలో అంచనాలకు అనుగుణంగా 36,371 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత 35,714 పాయింట్ల కనిష్టస్థాయివరకూ తగ్గింది. చివరకు అంతక్రితంవారంకంటే 193 పాయింట్ల లాభంతో 36,064 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం రికవరీ కొనసాగితే తక్షణం 36,370 పాయింట్ల స్థాయి తక్షణ అవరోధం కల్పించవచ్చు. ఆపైన 36,830 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుతర్వాత క్రమేపీ 36,170 శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని అధిగమించలేకపోయినా, మార్కెట్ బలహీనంగా ప్రారంభమైనా 35,830 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ లోపున వేగంగా 35,715 పాయింట్ల వద్దకు పడిపోవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే 35,470 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. తక్షణ అవరోధం 10,940 గత కాలమ్‌లో సూచించిన రీతిలోనే 10,940 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత 10,729 పాయింట్ల కనిష్టస్థాయికి నిఫ్టీ పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 71 పాయింట్ల లాభంతో 10,864 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 10,940 పాయింట్ల సమీపంలో తక్షణ అవరోధం కలగవచ్చు. ఆపైన ముగిస్తే 11,040 పాయింట్ల వరకూ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అటుపై 11,120 పాయింట్ల స్థాయి గట్టిగా నిరోధించవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, మార్కెట్ బలహీనంగా ప్రారంభమైనా 10,785 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ లోపున 10,730 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ దిగువన 10,630 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. -
అమెరికా వడ్డీరేట్లు పెంచితే కష్టమే..
ముంబై: అగ్రరాజ్యం అమెరికా వడ్డీ రేట్లను పెంచిన పక్షంలో వర్ధమాన దేశాల నుంచి మరోసారి పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలిపోవచ్చని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ హెచ్చరించారు. దీంతో పాటు మార్కెట్లలో మళ్లీ భారీ హెచ్చుతగ్గులు చూడాల్సి రావొచ్చన్నారు. ఈ పర్యవసానాలు ఎదుర్కొనేందుకు భారత్ సహా వర్ధమాన దేశాలు సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. ‘సంప్రదాయానికి భిన్నమైన ద్రవ్య విధానాలు.. వర్ధమాన దేశాలు నేర్చుకోతగిన పాఠాలు’ అంశంపై మంగళవారం రిజర్వ్ బ్యాంక్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా లగార్డ్ ఈ విషయాలు తెలిపారు. ‘సహాయక ప్యాకేజీల ఉపసంహరణ ప్రభావాలు ఇక్కడితో ఆగిపోకపోవచ్చు. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు తీరు మార్కెట్లను ఆశ్చర్యపర్చే విధంగానే ఉండొచ్చు. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోల్లో మార్పులు, చేర్పులు చేయొచ్చు. దీంతో పెట్టుబడులు భారీగా వెనక్కి వెళ్లిపోయి, మార్కెట్లు మరోసారి భారీ హెచ్చుతగ్గులకు లోను కావొచ్చు’ అని లగార్డ్ పేర్కొన్నారు. వడ్డీ రేట్ల పెంపు ఎప్పుడు జరుగుతుంది, పెరుగుదల తీరు ఎంత వేగంగా .. ఏ విధంగా ఉంటుందనేది మార్కెట్లను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. సెంట్రల్ బ్యాంకులు కలసి పనిచేయాలి... 2007-08 నాటి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు అనుసరించిన ద్రవ్య విధానాలు.. వర్ధమాన దేశాలకు కొంత ప్రయోజనం చేకూర్చాయని లగార్డ్ చెప్పారు. 2009-12 మధ్య వర్ధమాన దేశాల్లోకి 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రాగా, భారత్‌లోకి 47,000 కోట్ల డాలర్లు వచ్చాయని పేర్కొన్నారు. దీంతో స్థానిక కరెన్సీల మారక విలువలతో పాటు బాండ్లు, షేర్లూ భారీగా పెరిగాయన్నారు. అయితే, ఈ సానుకూలాంశంతో పాటు వర్ధమాన దేశాలకు రిస్కులు కూడా క్రమంగా పెరిగాయన్నారు. 2013లో ప్యాకేజీల ఉపసంహరణ వార్తలు వచ్చిన తరుణంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత్ నుంచి దాదాపు 19 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకెళ్లిపోయారని ఆమె చెప్పారు. దీంతో రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయి 68.85కి పడిపోయిందన్నారు. ఇలా.. రెండేళ్ల క్రితం చోటుచేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా మార్కెట్లలో అనిశ్చితి పరిస్థితులను నియంత్రించేందుకు వర్ధమాన దేశాలు సంసిద్ధంగా ఉండాలని లగార్డ్ సూచించారు. ప్యాకేజీల ఉపసంహరణ, వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించిన ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు కలసి పనిచేయాల్సి ఉంటుందన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలతో లగార్డ్ ఏకీభవించారు. పాఠాలు నేర్పాయి.. ప్యాకేజీల ఉపసంహరణ పరిణామాలు ప్రపంచానికి ప్రధానంగా మూడు పాఠాలు నేర్పాయని లగార్డ్ చెప్పారు. సంపన్న దేశాలు సహాయం అందించగలవన్నది మొదటి పాఠం అని వివరించారు. ముందు నుంచీ తమ మార్కెట్లను నియంత్రించుకోగలిగిన వర్ధమాన దేశాలు, ప్యాకేజీల ఉపసంహరణ అనంతరం కూడా మెరుగ్గా రాణించగలవన్నది రెండో పాఠం కాగా.. మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనైన పక్షంలో సెంట్రల్ బ్యాంకులు తక్షణమే తగు చర్యలు తీసుకునేందుకు సంసిద్ధంగా ఉండాలన్నది మూడో పాఠమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు.. విదేశీ మారక విలువల్లో హెచ్చుతగ్గులను సరిదిద్దడంతో పాటు కొన్ని రంగాలకు తాత్కాలికంగానైనా తోడ్పాటు అందించాల్సి ఉంటుందన్నారు. రాజన్ హెచ్చరించినా.. 2008లో రుణ సంక్షోభం తలెత్తగలదంటూ 2005లోనే రాజన్ హెచ్చరించినా.. ఐఎంఎఫ్ పట్టించుకోకపోవడం పెద్ద తప్పిదమని లగార్డ్ అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన చెప్పేదేదైనా సరే ఐఎంఎఫ్ శ్రద్ధగా ఆలకిస్తోందన్నారు. అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఆయన ఒకరన్నారు. ఇటు కరెన్సీ సంక్షోభం తలెత్తకుండా దేశాన్ని గట్టెక్కించడంలో రాజన్ భేషైన పాత్ర పోషించారంటూ లగార్డ్ కితాబిచ్చారు. ఆర్బీఐ కీలక రంగాలకు విదేశీ మారకం లభ్యమయ్యేలా చూడటం, రూపాయి క్షీణతను కృత్రిమంగా నిలువరించకుండా వదిలేయడం మొదలైనవి దేశ ఎకానమీ కోలుకునేందుకు తోడ్పడ్డాయని చెప్పారు. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే ఇటు దేశంలో అంతర్గతంగా, అటు అంతర్జాతీయంగా వచ్చే సమస్యలను భారత్ సమర్ధమంతంగా ఎదుర్కొనగలిగిందన్నారు. రాజన్‌ను ప్రశంసిస్తూ.. భారత ద్రవ్యపరపతి విధానం సురక్షితమైన చేతుల్లోనే ఉందని లగార్డ్ చెప్పారు. భారతీయ నేతలతో సమావేశాలను బట్టి చూస్తే ప్రపంచ వృద్ధికి భారత్ చోదకంగా నిల్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న భావన కలుగుతోందని లగార్డ్ పేర్కొన్నారు.