Increased traffic
-
100% ఆక్యుపెన్సీ దాటిన ‘వందేభారత్’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన వందేభారత్ రైళ్లు అత్యధిక ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తున్నాయి. దక్షిణమధ్య రైల్వేలో గతేడాది ప్రవేశపెట్టిన నాలుగు రైళ్లలో ఆక్యుపెన్సీ వంద శాతం దాటింది. ఈ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రయాణికుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్‌లో 134% ఆక్యుపెన్సీ.. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను గతేడాది జనవరిలో ప్రవేశపెట్టారు. 16 కోచ్‌లతో ఈ రైలు ప్రారంభమైంది. మొదటి నుంచి ఈ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోంది. గత డిసెంబర్లో ఈ ట్రైన్లో ప్రయాణికుల నుంచి అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. సికింద్రాబా ద్ నుంచి విశాఖకు వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో 134 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. ఇక విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే వందేభారత్‌లో ఇది ఏకంగా 143 శాతానికి చేరుకుంది. సంవత్సరాంతం కావడంతో రెండు వైపుల నుంచి ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో చాలా మంది వెయిటింగ్ జాబితాలో నిరీక్షించవలసి వచ్చింది. గత డిసెంబర్ ఆఖరు వారంలో వరుస సెలవులు రావడంతో ఎక్కువ మంది రాకపోకలు సాగించారు. సంక్రాంతి వరకు కూడా ప్రయాణికుల రద్దీ ఇలాగే ఉండవచ్చని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్‌లో... గతేడాది ఏప్రిల్‌లో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మొదట 8 కోచ్‌లతో ప్రారంభించారు. ఈ ట్రైన్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తోంది. ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో గతేడాది మే 17 నుంచి 16 కోచ్‌లకు పెంచారు. గత డిసెంబర్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు 114 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే వందేభారత్‌లో 105 శాతానికి ఆక్యుపెన్సీ చేరుకోవడం గమనార్హం. మరోవైపు గత సెపె్టంబర్లో 8 బోగీలతో ప్రవేశపెట్టిన కాచిగూడ–యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో డిసెంబర్లో ఆక్యుపెన్సీ 107 శా తానికి చేరింది. తిరుగుదిశలో యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడ వరకు 110 శాతం వరకు నమోదైంది. అలాగే దక్షిణమధ్య రైల్వే పరిధిలోని విజయవాడ–ఎంజీఆర్ చెన్నై–వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో సైతం గత డిసెంబర్లో 126 శాతం ఆక్యుపెన్సీ నమోదవగా చెన్నై నుంచి విజయవాడకు వచ్చే ట్రైన్లో ఇది 119 శాతం వరకు ఉంది. గత సెస్టెంబర్లో 8 కోచ్‌లతో ఈ ట్రైన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ట్రైన్ తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తోంది. ఆకట్టుకుంటున్న సదుపాయాలు... వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏర్పాటు చేసిన సదుపాయాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకొనే విధంగా రైళ్లను నడుపుతుండటంతో ఎక్కువ మంది వందేభారత్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ ట్రైన్లో ఏసీ చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లతో అన్ని రకాలసదుపాయాలు అందుబాటులో ఉన్నా యి. జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, రిక్లైనింగ్ సీట్లు, అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, డిఫ్యూజ్డ్ ఎల్ఈడీ లైటింగ్, చార్జింగ్ పాయింట్లు వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణికులకు పూర్తిగా సురక్షితమైన, మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. -
దాడులతో దడ..!
డ్రైవింగ్ లెసైన్సులకు భలే గిరాకీ ఆర్టీఏ కార్యాలయాల్లో పెరిగిన రద్దీ పోలీసు,రవాణా తనిఖీలతోబారులు తీరుతున్న వాహనదారులు 20 శాతం పెరిగిన రద్దీ సిటీబ్యూరో:డ్రైవింగ్ లెసైన్సుల కోసం ఆర్టీఏ కార్యాలయాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గత రెండు రోజులుగా రవాణా, పోలీసు విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీలతో లెసైన్సులు లేకుండా బండి నడుపుతున్న వాహనదారులు ఆర్టీఏ బాటపట్టారు. ఈ రెండు రోజుల్లో గ్రేటర్ పరిధిలో సాధారణ రోజుల్లో కంటే 20 శాతానికిపైగా లెర్నింగ్ లెసైన్సులు, డ్రైవింగ్ లెసైన్సులకు డిమాండ్ పెరిగి నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. 360 లెర్నింగ్ లెసైన్స్ స్లాట్ లు అందుబాటులో ఉన్న ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంలో బుధవారం 288 మంది ఎల్‌ఎల్‌ఆర్‌లు తీసుకున్నారు. సాధారణ రోజుల్లో 150 నుంచి 200 వరకు మాత్రమే స్లాట్లు నమోదవుతాయి. అలాగే సాధారణ రోజుల్లో 100 నుంచి 150 వరకు డిమాండ్ ఉండే సికింద్రాబాద్ ఆర్టీఏలో 200మంది ఎల్‌ఎల్‌ఆర్‌లు తీసుకున్నారు. నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్ పరీక్షల కోసం ఏకంగా 435 మంది హాజరయ్యారు. మరోవైపు నగర శివార్లలోని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ డ్రైవింగ్ లెసైన్సుల కోసం వచ్చే వాహనదారుల రద్దీ కనిపించింది. లెర్నింగ్లెసైన్సులు, డ్రైవింగ్ లెసైన్సుల కోసం బుధవారం 991 మంది హాజరయ్యారు. ఏజెంట్లను ఆశ్రయించవద్దు : జేటీసీ నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో డిమాండ్‌కు అనుగుణంగా స్లాట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకొని పరీక్షలకు హాజరు కావాలని జేటీసీ సూచించారు. ఈ సేవా కేంద్రాల్లోనూ స్లాట్ నమోదు చేసుకొనే సదుపాయం ఉందన్నారు. వినియోగదారులు బ్రోకర్లు, ఏజెంట్లను ఆశ్రయించకుండా నేరుగా ఆర్టీఏ అధికారులను సంప్రదించాలని కోరారు. రోడ్డు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్స్ రూల్స్ పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన వాహనదారులు లెర్నింగ్, డ్రైవింగ్ పరీక్ష ల్లోనూ ఉత్తీర్ణులవుతారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఎల్ఎల్ఆర్ ఇలా పొందవచ్చు.... రవాణాశాఖ వెబ్సైట్లో మొదట స్లాట్ నమో దు చేసుకోవాలి. 24 గంటల్లో ఈ సేవ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా నిర్ణీత రుసుం చెల్లించాలి. నిర్ణీత తేదీ, సమయం ప్రకారం పుట్టిన తేదీ, ని వాస ధృవీకరణ పత్రాలతో ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన 20 ప్రశ్న ల్లో 12 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సరైన జవాబులు గుర్తిస్తే ఉత్తీర్ణులుగా పరిగణించి వెంటనే ఎల్ఎల్ఆర్ ఇస్తారు. డ్రైవింగ్ లెసైన్స్ ఇలా... ఎల్ఎల్ఆర్ (లెర్నింగ్) తీసుకున్న 30 రోజుల నుంచి 6 నెలల వరకు ఎప్పుడైనా డ్రైవింగ్ టెస్ట్ కు హాజరు కావచ్చు. ఇందుకోసం మరోసారి ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. ఈసేవ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా 24 గంటల్లో ఫీజు చెల్లించాలి.నిర్ణీత తేదీ, సమయం ప్రకారం అందుబాటులోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌కు పరీక్షకు వెళ్లి, అధికారుల పర్యవేక్షణలో వాహనాలు నడపాలి, నిబంధనలకు అనుగుణంగా నడిపిన వారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. వారం రోజుల్లో డ్రైవింగ్ లెసైన్స్ స్పీడ్ పోస్టు ద్వారా ఇంటికి చేరుతుంది. లెర్నింగ్ పరీక్షల్లోనూ,. డ్రైవింగ్ పరీక్షల్లోనూ ఫెయిల్ అయిన వారు తిరిగి మరోసారి పరీక్షలకు హాజరు కావలసిందే. -
పోటెత్తిన భక్తజన గోదారి
ఏపీలో ఒక్కరోజే 41 లక్షల మంది పుణ్య స్నానాలు వేచి ఉన్న మరో ఐదు లక్షల మంది భక్తులు వరుస సెలవులతో పెరిగిన రద్దీ రాజమండ్రి: గోదావరి రేవుల్లో భక్తజన గోదారి పరవళ్లు తొక్కింది. రాష్ర్టంలోని వివిధ జిల్లాలతోపాటు దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో గోదావరికి ‘తూర్పు’న రాజమండ్రి, ‘పశ్చిమ’న కొవ్వూరు రహదారులు జనగోదారులను తలపిస్తున్నాయి. ఐదో రోజైన శనివారం నాడు వేకువజాము నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు 41లక్షల మంది భక్తులు స్నానమాచరించారని అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో 31,91,742 మంది, పశ్చిమ గోదావరిలో 9,21,043 మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని పేర్కొన్నారు. మరో ఐదు లక్షల మంది(అంచనా) పుష్కర స్నానం కోసం వేచి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికి కోటిన్నర మంది గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించగా, 8 లక్షల మంది పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. తరలివచ్చిన భక్తకోటితో గోదావరి జిల్లాల్లో ఊరూవాడా పుష్కర శోభను సంతరించుకున్నాయి. ముఖ్యంగా అఖండ గోదావరి తీరం రాజమహేంద్రికి రేయింబవళ్లు తేడా లేకుండా భక్తులు పోటెత్తారు. శుక్ర, శని, ఆదివారాల్లో పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు రావడంతో అనేకమంది కుటుంబ సమేతంగా పుష్కరాలకు తరలివస్తున్నారు. సగానికిపైగా ఉత్తరాంధ్ర భక్తులే పుష్కరాలకు వస్తున్న భక్తుల్లో సగానికి పైగా ఉత్తరాంధ్ర జిల్లాలవాసులే కనిపిస్తున్నారు. వారిలో కూడా ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో పిల్లాపాపలతో తరలివస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ప్రతి ఇంటిలో సగం మంది రావాలని, లేకుంటే కనీసం ఒకరైనా పుష్కర స్నానం చేసి తిరిగి వెళుతూ గోదావరి నీటిని తీసుకెళ్లి మిగిలినవారి నెత్తిన చల్లుతామని ఆ జిల్లా నుంచి వచ్చిన మహిళలు చెప్పారు. ధవళేశ్వరం మృతులకు పిండప్రదానం గత నెలలో ధవళేశ్వరం బ్యారేజిపై నుంచి తుపాన్ వ్యాన్ బోల్తాపడిన ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలైన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన 22 మందికి గాయత్రీ బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో పిండప్రదానం చేశారు. ప్రతిదారీ పద్మవ్యూహమే! ఏపీలో పుష్కర యాత్రికులకు ట్రాఫిక్ కష్టాలు రాజమండ్రి/కొవ్వూరు: పవిత్ర గోదావరి పుష్కరాలు.. వరుసగా రెండురోజుల సెలవులు.. ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది. రాష్ట్రంలో వాహనాలు గోదావరి తీరం వైపే సాగాయి. గోదావరికి దారితీసే అన్ని రహదారులు నిండిపోయాయి. ఇసుకేస్తే రాలని రీతిలో కార్లు, మినీ వ్యాన్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, సరకు రవాణా లారీలతో కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలతో కష్టాలు రెట్టింపయ్యాయి. వీటివద్ద కనుచూపుమేర దాకా వాహనాలు బారులు తీరాయి. పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఉత్సాహంగా బయల్దేరిన లక్షలాది మంది భక్తులు నడిరోడ్డుపై గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. జనం నరకయాతన అనుభవించారు. ఆకలిదప్పులతో అలమటించారు. కొందరు పుష్కర యాత్రను వాయిదా వేసుకొని వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు రైళ్లు కూడా 5 నుంచి 9 గంటలపాటు ఆలస్యంగా నడిచాయి. యాత్రికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పుష్కరాల నేపథ్యంలో శనివారం రహదారులపై ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించారు. విశాఖ జిల్లా నక్కపల్లి టోల్గేట్ నుంచి తూర్పుగోదావరి జిల్లా లాలాచెరువు వరకు 16వ నంబర్ జాతీయరహదారిపై తెల్లవారుజాము నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై కనీసం మోటార్ సైకిల్, ఆటోలు కూడావెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాహనచోదకులు, భక్తులు కాలినడకన రాజమండ్రికి రావాల్సి వచ్చింది.