టీ హబ్‌ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ : ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించేందుకు తెలంగాణ ఐటీ శాఖ కేటీఆర్ మంగళవారం టీ-హబ్‌ను ప్రారంభించారు. ఈ హబ్ ద్వారా 15వందల మంది వ్యాపారవేత్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఐఎస్బీ, నల్సార్ యూనివర్సిటీ,నార్ కామ్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. సాంకేతిక నైపుణ్యాలు ఉన్న వారు వ్యాపార మెళకువలు కూడా నేర్చుకుని వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఈ టీ-హబ్ ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ట్రిపుల్ ఐటీ, నల్సార్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.