indecent
-
అకృత్యం – దుష్కృత్యం
అకృత్యం, దుష్కృత్యం అనే రెండు పదాలని సమానార్థకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు సాధారణంగా. నిఘంటువు ననుసరించి రెండింటి మధ్య తేడా ఉన్నా వ్యవహారంలో మాత్రం సమానార్థకాలే. నిజానికి రెండు చేయకూడని పనులే. కాని రెండింటికీ మధ్య అతిసన్నని గీత వంటి తేడా ఉంది. కృత్యం అంటే చేయబడినది, పని అని అర్థం. అకృత్యం అనగానే వ్యతిరేకార్థం కనుక చేయబడనిది అని అర్థం చెప్పేస్తారు వ్యవహారజ్ఞానం తక్కువైన పండితులు. వ్యాకరణ రీత్యా ఆ విధంగా పదాన్ని సాధించవచ్చు. కాని దాని అర్థం మాత్రం చేయకూడని పని అని. చేయబడనిది అనే అర్థంలో అకృత్యం అనవలసి ఉంటుంది. దుష్కృత్యం అంటే చెడ్డపని. అకృత్యం అంటే చేయకూడని పని చేయటం వల్ల ఆ వ్యక్తికి నష్టం కలగ వచ్చు, కలగక పోవచ్చు. అది ఆ వ్యక్తి స్వభావాన్ని సూచిస్తుంది. కాని, దుష్కృత్యం అంటే చెడ్డపని వల్ల వ్యక్తికి ఇతరులకి, సమాజానికి కూడా హాని కలుగుతుంది. మానవుడు ఏ పని చేయకుండా కొద్దిసేపైనా ఉండలేడు. ఏమీ చేయటం లేదు అన్న వ్యక్తి కూడా ఆ క్షణం చేయటం లేదు అనే మాటని పలికాడు కదా! అది పనేగా! గాలి పీల్చటం, మానలేదుగా. ఆహారం తినటం, నీళ్ళు తాగటం ఆపలేదే. ఇవన్నీ ప్రయత్న పూర్వకంగా చేయటం లేదు. అసంకల్పిత చర్యలుగా సాగుతుంటాయి. కనక, నేను ఏమీ చేయటం లేదు అనటానికి వీలు లేదు. చేయటం తప్పనప్పుడు ఉపయోగ పడేది ఏదైనా చేయవచ్చు కదా! చేయాలని ఉండి, ఏం చేయాలో సరిగా తెలియక అనవసరమైన పనికిరాని పని చేయటం జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా చేయక పోయినా, సాధారణంగా చేయకూడని పని వల్ల ఏదో ఒక హాని ఉంటుంది. అందుకే దానిని చెడ్డపనితో సమానంగా భావించటం జరుగుతుంది. కాని, దుష్కృత్యం అంటే, ఉద్దేశపూర్వకంగా, కావాలని ఇతరులకి హాని కలగాలని చేసే పని. దుష్కృత్యం వెనుక దురుద్దేశం ఉంటుంది. కావాలని బాధించటానికి చేసే పని. క్రూరత్వం కాఠిన్యం ఉంటాయి. అది ఒకరకమైన మానసిక స్థితి. నలుగురు ఆనందం గా ఉంటే చూడలేక పోవటం, ఏడుస్తూ ఉంటే ఆనందించటం, ఏదైనా వ్యవస్థ సవ్యంగా నడుస్తూ ఉంటే చూడలేక పోవటం మొదలైన దుర్బుద్ధులు ఉన్నవారు చేసేవి ఈ పనులు. నలుగురు కలిసి ఏదో వేడుక జరుపుకుంటూ ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని చూసి ఓర్వ లేక చెడగొట్టటానికి విధ్వంసకచర్యలు చేయటం దుష్కృత్యం కాదా! అదే సామర్థ్యాన్ని, తెలివితేటలని పదిమంది సంతోషానికి ఉపయోగించవచ్చు కదా! ఒక దేశం కాని జాతి గాని పురోగమిస్తున్నప్పుడు ప్రగతి నిరోధక వ్యవహారాలు, మాటలు, ప్రచారాలు దుష్కృత్యాలే. పరాయి దేశాలపై దండయాత్రలు, దోపిడీలు, దోచుకోటాలు చేయతగిన పనులా? ఒకరకంగా చూస్తే ఇవి మానసిక జాడ్యాలు అని చెప్పవచ్చు. పైశాచిక, రాక్షసానందాలు. మందులతో తగ్గకపోతే శస్త్రచికిత్స తప్పదు. సామదాన భేద దండోపాయాల్లో ఏదో ఒక దానితో అదుపు చేయవలసి ఉంటుంది. వ్యక్తిగతమైన కక్షలు, అసూయా ద్వేషాలతో చేసే హానికారకమైన పనుల నుండి, జాతి, మత విద్వేషాలతో చేసే దురాగతాల వరకు ఇటువంటివి మనకు ఎన్నో కనపడుతూ ఉంటాయి. సంఘవిద్రోహకచర్యలు, హత్యలు, అత్యాచారాలు మొదలైననవి అన్నీ దుష్కృత్యాలే. ఒక్కమాటలో చెప్పాలంటే పాపకృత్యాలు అని చెప్పవచ్చు. పాపం అన్న దానికి కూడా చక్కని నిర్వచనం ఇచ్చారు పెద్దలు. ‘‘..పాపాయ పరపీడనం..’’ అని. ఇతరులని బాధించటమే పాపం. అందులోనూ కావాలని బాధించటం. అనుకోకుండా తాము చేసిన పని వల్ల ఇతరులకి బాధ కలిగితే అది పొరపాటు అవుతుంది కాని, దుష్కృత్యం అవదు. దానిని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. – డా. ఎన్. అనంత లక్ష్మి -
కర్నూలులో ‘నారాయణ’ వీడియోల కలకలం..
కర్నూలు సిటీ: ఇప్పటి వరకూ నారాయణ విద్యా సంస్థల్లో ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు, సరైన భోజనం, సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న ఘటనలే వెలుగు చూశాయి. తాజాగా ఉద్యోగి రాసలీలల వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ లింగేశ్వరరెడ్డి ఆక్కడ పనిచేసే కొందరు మహిళలతో జరిపిన రాసక్రీడల వీడియోల వ్యవహారం చర్చనీయాంశమైంది. నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ లింగేశ్వరరెడ్డి.. జూనియర్ కాలేజీల విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో తన కార్యాలయంలోనే అక్కడి మహిళలతో ఆయన సాగిస్తున్న సరస సల్లాపాలను గమనించిన అక్కడ పనిచేసే గోపీకృష్ణ, నజీర్ అనే ఉద్యోగులు ఆ గదిలో స్పై కెమెరాలు అమర్చారు. ఇందులో పదుల సంఖ్యలో రాసలీలల వీడియోలు రికార్డయ్యాయి. గోపీకృష్ణ, నజీర్‌లు ఆ వీడియోలను డీన్ లింగేశ్వరరెడ్డి వాట్సాప్‌కు పంపగా.. వారిని రాజీకి పిలిపించి ఒక ఇల్లు, రెండు విలువైన ప్లాట్లు వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేగాక వారి వేతనాలు కూడా పెంచేందుకు హామీ ఇచ్చారు. మరికొంత మంది బ్లాక్మెయిల్ తర్వాత ఆ వీడియోలు ఓ ఉద్యోగి ద్వారా నబీ రసూల్ అనే వ్యక్తికి చేరాయి. ఇతను చంద్రశేఖరరెడ్డి, రవిశంకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి అనేవారికి వీడియోలను పంపడంతో వారు లింగేశ్వరరెడ్డి వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. వీరితోనూ రాజీకి వెళ్లి పెద్ద మొత్తంలో నగదు ఒప్పందం చేసుకున్నారు. కొంత డబ్బులు ఇచ్చి, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో తిరిగి వీళ్లు ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయసాగారు. దీంతో ఇంకెంతమంది ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారోనని భయంతో లింగేశ్వరరెడ్డి స్పందనలో ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. దీంతో తాలూకా పోలీస్‌స్టేషన్‌కు బ్లాక్‌మెయిలర్స్‌ను పిలిపించి సెల్ఫోన్లు తీసుకుని వారి దగ్గర ఉన్న వీడియోలను డిలీట్ చేయించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఆయన ఆస్తులను కూడా తిరిగి అతని పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. నిందితులను కర్నూలు రూరల్ తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి బైండోవర్ కేసు నమోదు చేయించారు. తనను బ్లాక్ మెయిల్ చేసిన ఉద్యోగులను కోర్ డీన్ హైదరాబాద్‌కు బదిలీ చేయించారు. తనను కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని లింగేశ్వరరెడ్డి స్పందనలో ఫిర్యాదు చేయడంతో విచారించి నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు. బాధితులు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: విశాఖ జూ పార్క్‌లో దారుణం.. కేర్ టేకర్‌పై ఎలుగుబంటి దాడి -
న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి
హైదరాబాద్: ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతి చాటింగ్‌లో తన నగ్న వీడియోలు తీసి వేధింపులకు పాల్పడుతోందని బాధితుడు ఒకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్ నెం.12లోని భోలానగర్‌లో నివసించే ఓ వ్యక్తి (32) ఎల్రక్టీషియన్‌గా పని చేస్తున్నారు. జూలై నెలలో సాక్షి వర్మారెడ్డి పేరుతో ఓ యువతి పరిచయమైంది. ఇద్దరూ స్నేహితులుగా మారి వాట్సాప్ చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన నగ్న వీడియోలు చూపించి.. బాధితుడి ని కూడా నగ్నంగా ఉన్న వీడియోలు పెట్టాలని చెప్పడంతో అలాగే చేశాడు. కాసేపటి తర్వాత ఈ వీడియోను ఫేస్బుక్లో పెడుతానంటూ బెదిరింపులకు పాల్పడింది. ఆ వీడియోను కొంత మందికి కూడా పంపించింది. అంతటితో ఆగకుండా ఆత్మహత్య చేసుకుంటానంటూ భయభ్రాంతుల కు గురిచేస్తూ వస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం
హైదరాబాద్: నాగోల్‌లో రికార్డు డ్యాన్సులు కలకలం సృష్టించాయి. పీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్సికోత్సవంలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించింది. అమ్మాయిలు మద్యం మత్తులో చిందులు వేశారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు కంపెనీ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. డాన్సర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో డీఎంకే ఎంపీ లొంగుబాటు -
భర్త ఎదుటే భార్య పట్ల అసభ్య ప్రవర్తన
ముగ్గురిపై కేసు నమోదు, రిమాండ్ పరిగి : భార్యాభర్తలపై దాడి చేయడమే కాకుండా భర్త ఎదుటే భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ నగేష్ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. హైదరాబాద్ నగర శివారులోని బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన యాదగిరి తన భార్య, కుమార్తెతో కలిసి గురువారం రంగారెడ్డి జిల్లా పరిగిలో నివాసముండే తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. కార్యక్రమం పూర్తి అయ్యేసరికి రాత్రి అయ్యింది. దీంతో పది గంటల సమయంలో యాదగిరి కుటుంబం హైదరాబాద్‌కు బయలుదేనిందిజ అయితే అలసట అనిపించడంతో యాదగిరి కారును మండల పరిధిలోని రంగాపూర్‌లో రోడ్డు పక్కన ఆపాడు. ఈ సమయంలో రంగాపూర్‌కు చెందిన నర్సింహారెడ్డి, అరవింద్‌రెడ్డి, సంజీవరెడ్డిలు కారు వద్దకు వచ్చారు. ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. అలసటగా ఉండడంతో ఆపామని, తామిద్దరం భార్యాభర్తలమని చెప్పినా వారు వినిపించుకోలేదు. తాము పోలీసులమని, కారుకు సంబంధించిన కాగితాలు చూపాలని వారిపై దాడికి దిగారు. అంతటితో ఆగక.. యాదగిరి భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న యాదగిరి కుటుంబం నేరుగా పరిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శుక్రవారం నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులు ముగ్గురిని రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ నగేష్ తెలిపారు. -
కీచక ఉపాధ్యాయుడిపై కేసు
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ ♦ అక్బర్‌పేటలో ఘటన సిద్దిపేట క్రైం: తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుది. అంతటి గొప్ప స్థానానికి కొం దరు ఉపాధ్యాయులు మచ్చ తెస్తున్నారు. వరుస సంఘటనలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు చక్కటి బాట వేయాల్సిన గురువు బరితెగిస్తున్నాడు. మొన్న మెదక్ జిల్లా మిరుదొడ్డి మండ లం అక్బర్పేట పాఠశాలలో బాలిక పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించి కటకటాల పాలయిన సంఘటన మరువకముందే మళ్లీ సిద్దిపేట పట్టణంలో మరో దారుణం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను గురువులపై నమ్మకం, గౌరవంతో వారి ఇళ్లలోనే ఉంచి విద్యాబుద్ధులు నేర్పించే వారు. గురువులు కూడా అంతే నమ్మకంతో వారి శిష్యులను సొంత బిడ్డల్లా చూసుకునే వారు. కాలగమనంలో గురువులు కూడా చెడు మార్గం పట్టారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సిద్దిపేటలోని అక్బర్ పేట బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఫర్వేజ్ అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని (14) పట్ల అసభ్యంగా ప్రవర్తిం చాడు. వెకిలి చేష్టలతో బాలికను ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో బాధితురాలు ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం వివరించింది. దీంతో బాలిక తండ్రి హుస్సేన్ గురువారం వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి చెప్పారు. నిందితుడు ఫర్వేజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై విద్యార్థి సం ఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండు చేస్తున్నారు.